Mahabubabad District: మహబూబాబాద్ జిల్లాలోని రెడ్యాల, సికింద్రాబాద్ తండా గ్రామాల ప్రజలు, ఆ ప్రజలను ముక్తకంఠంతో ఒక్కతాటిపై చేర్చి రెండు సర్పంచులు, 18 వార్డులు ఏకగ్రీవం చేయడంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి, (Vennam Srikanth Reddy) కె ఎస్ ఎన్ రెడ్డిలు సత్ఫలితాలను సాధించారు. దశాబ్ద కాలం నాటి ఉమ్మడి రెడ్యాల గ్రామం నెరవేరిన సమయం.. అక్కడి వారందరినీ సంప్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది.
Also Read:Mahabubabad District: రెడ్యాలలో అంగరంగ వైభవంగా పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలు!
ఈ రెండు గ్రామాలు ఆదర్శం
ఒకటి కాదు రెండు కాదు ఇద్దరు సర్పంచులు, 18 వార్డులు ఏకగ్రీవం అయ్యాయంటే అక్కడి లీడర్లు వెన్నం శ్రీకాంత్ రెడ్డి, (Vennam Srikanth Reddy) కె ఎస్ ఎన్ రెడ్డి కృషి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. రెడ్యాల సర్పంచ్ గా అయిలబోయిన లక్ష్మి, సికింద్రాబాద్ తండా సర్పంచ్ గా నూనావత్ ఇస్తారి రెండు గ్రామాలకు ఏకగ్రీవ సర్పంచు లు గా నిలిచారు. దశాబ్దాల కళ నెరవేర్చుకున్నారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలందరికి ఈ రెండు గ్రామాలు ఆదర్శంగా నిలిచాయి. ఎన్నో ఏండ్లుగా ఏకగ్రీవ సర్పంచులు, వార్డు మెంబర్లు గా తీర్చిదిద్దాలనే వెన్నం శ్రీకాంత్ రెడ్డి నెరవేరింది. దీంతో ఆ రెండు గ్రామాల్లో సంబరాలు జరుపుకున్నారు. రెడ్యాల, సికింద్రాబాద్ తండాల సర్పంచులతోపాటు 18 వార్డులు ఏకగ్రీవం చేయడంలో కృషి చేసిన వెన్నం శ్రీకాంత్ రెడ్డి, కె ఎస్ ఎన్ రెడ్డి లకు అక్కడి గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు.
Also Read:Mahabubabad District: ఆ పట్టణ కేంద్రంలో వరుస ప్రమాదాలు.. అధికారుల నిర్లక్ష్యమే కారణమా?
