Konda Surekha:హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో మంత్రికొండా సురేఖ (Konda Surekha)ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని శాలువా సత్కరించి, వేంకటేశ్వరస్వామిప్రసాదం అందజేశారు. మంత్రి సైతం టీటీడీ చైర్మన్ ను కు యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి ప్రతిమను అందజేసి సన్మానించారు. తెలంగాణలోని పలు దేవాలయాల నిర్మాణానికి టీటీడీ చేస్తున్న చర్యలు, ప్రత్యేకించి దళిత కాలనీల్లో నిర్మిస్తున్న హిందూ దేవాలయాల గురించి ప్రస్తావించారు.
Also Read: Konda Surekha: భక్తులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 14న కొమురవెల్లి మల్లన్న కల్యాణం
రోప్‌వే నిర్మాణ పనులు చేపట్టడానికి టీటీడీ నుంచి నిధులు
ఈ నిర్మాణాలు మంథని, కొడంగల్, ఖమ్మం ప్రాంతాల్లో చేపడుతున్నట్టు మంత్రికి వివరించారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన కొండ ప్రాంతాల్లోని దేవాలయాల్లో రోప్‌వే నిర్మాణ పనులు చేపట్టడానికి టీటీడీ నుంచి నిధులు కేటాయించేందుకు సాయం చేయాలని మంత్రి కోరారు. వికారాబాద్ జిల్లాలోని పరిగిలో గల పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయం, హన్మకొండలోని పద్మాక్షి అమ్మవారి టెంపుల్, వరంగల్ జిల్లాలోని గోవింద రాజుల ఆలయంలో రోప్ వే నిర్మాణం అవసరం ఉందని గుర్తు చేశారు.
దివ్యాంగులకు తీవ్ర ఇబ్బందులు
ఈ ఆలయాలకు ఎంతో చారిత్మ్రకత ఉందని, వీటి దర్శనానికి దివ్యాంగులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. దాంతోపాటు, రాష్ట్రంలోని ముఖ్యమైన ఆలయాల్లో భజన మందిరాలు నిర్మించుకునేందుకు టీటీడీలోని శ్రీవాని ట్రస్టు నిధులు గతంలో ఇచ్చేవారని ఈ మధ్య కాలంలో వాటిని నిలిపివేశారని… అయితే, వీటి మళ్ళీ ఇవ్వాలని మంత్రి కోరారు. ఈ ట్రస్టు ద్వారా రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుందని గుర్తు చేయగా, అందుకు టీటీడీ చైర్మన్ సానుకూలంగా స్పందించారు.
Also Read: Konda Surekha: ధర్మపురి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తాం.. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

