Nalgonda District: పంచాయతీ ఎన్నికల బహిష్కరణ చేసిన గ్రామం
Nalgonda District (imagecrdit:swetcha)
Telangana News, నల్గొండ

Nalgonda District: పంచాయతీ ఎన్నికల బహిష్కరణ చేసిన గ్రామం.. డప్పు చాటింపుతో సంచలనంగా మారిన వైనం..!

Nalgonda District: నల్గొండ జిల్లా అనుముల(Anumula) మండలం పేరూరు గ్రామపంచాయతీ ప్రజలు జీపీ ఎన్నికలను బహిష్కరించి డప్పు చాటింపు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో పేరూరు(Perur), వీర్లగడ్డ తండా(Veerlagadda Thanda) కలిపి గ్రామపంచాయతీగా ఉండేది. అయితే గత ప్రభుత్వ హయాంలో వీర్లగడ్డ తండాను ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటయింది. ప్రస్తుతం పేరూరు గ్రామపంచాయతీ పరిధిలో సుమారు 1000 మంది జనాభా ఉంటుంది. అయితే గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు 2011 ఎస్సీ(SC), ఎస్టీ(ST) జనాభాను పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్లు చేశారు. అయితే పేరూరు గ్రామపంచాయతీలో ఒకరు ఎస్టీ పురుష ఓటర్ ఉన్నట్లుగా తప్పుగా నమోదు అయింది.

Also Read: Kothagudem Railway Station: రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం.. బాంబును కొరికిన కుక్క మృతి..!

నామినేషన్ కూడా వేయనీ..

ప్రస్తుతం ఈ గ్రామపంచాయతీలో 8 వార్డులు ఉండగా అందులో నాలుగు వార్డులను, సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ మహిళకు కేటాయిస్తూ రిజర్వేషన్లు చేశారు. అయితే తమ గ్రామపంచాయతీ ఎస్టీ జనాభా లేనప్పటికీ సర్పంచ్ తో పాటు నాలుగు వార్డులను ఎస్టీలకు రిజర్వేషన్లు చేయటం ఈ గ్రామస్తులు గత నెల 28న హైకోర్టును ఆశ్రయించారు. నామినేషన్ కూడా వేయనీ ఈ గ్రామ ప్రజలు ఎలక్షన్లను బహిష్కరిస్తూ తీర్మానం చేసి డప్పు చాటింపు చేయటం స్థానిక ఎన్నికలవేళ చర్చనీయాంశంగా మారింది. అయితే ఉమ్మడి నల్గొండ(Nalgonda) జిల్లాలో ఎస్టీ జనాభా ఒకరిద్దరికి మించి లేని గ్రామపంచాయతీలోనూ జీపీలను, వార్డులను రిజర్వేషన్ చేయటంపై ఇప్పటికే ఆయా గ్రామ పంచాయతీల ప్రజలు హైకోర్టు(High Cort)ను ఆశ్రయించటం ఎన్నికల సంఘంపై అసహనం వ్యక్తం చేయటం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.

Also Read: Kokapet Land Auction: మరోసారి కోట్లు పలికిన కోకాపేట భూములు.. 4 ఎకరాలకు రూ.524 కోట్లు

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!