Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (National Crush Rashmika Mandanna) సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దుర్వినియోగం, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని అశ్లీలతను సృష్టించడంపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ డిజిటల్ యుగంలో ‘విచక్షణే మన గొప్ప రక్షణ’ అని ఆమె పోస్ట్‌లో తెలిపారు. ఇటీవల ఆమె కూడా డీప్‌ఫేక్ బారిన పడిన విషయం తెలిసిందే. రష్మిక మాత్రమే కాదు, బాలీవుడ్‌కు చెందిన ఎందరో నటీమణులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో అవమానాలకు గురయ్యారు. టాలీవుడ్ హీరోలపై కూడా ఈ టెక్నాలజీని ఇష్టం వచ్చినట్లుగా వాడుతున్న విషయం తెలియంది కాదు. అందుకే.. ఈ విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం, ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేసే వారిపై కఠిన శిక్షలు విధించబడాలని ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Also Read- Dil Raju: పవన్ కళ్యాణ్‌తో సినిమా.. వెనక్కి తగ్గిన దిల్ రాజు.. ఈ క్లారిటీ అందుకేనా?
సత్యానికి ప్రతిబింబం వంటిది కాదు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది.. మారుతున్న కాలంలో అభివృద్ధికి ఒక శక్తిగా ఉన్నప్పటికీ, దానిని కొందరు వ్యక్తులు వల్గారిటీని సృష్టించడానికి, మరీ ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించడమనేది కొంతమందిలో నైతిక క్షీణతకు సంకేతమని రష్మిక తన పోస్ట్‌లో స్పష్టం చేశారు. ఇటీవల డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా సెలబ్రిటీల నకిలీ చిత్రాలు, వీడియోలు సృష్టించడం పెరిగిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె ప్రస్తుత డిజిటల్ ప్రపంచాన్ని వివరిస్తూ.. ‘‘ఇంటర్నెట్ ఇకపై సత్యానికి ప్రతిబింబం వంటిది కాదు. అది దేనినైనా వక్రీకరించగలిగే కాన్వాస్ కలిగి ఉంది’’ అని హెచ్చరించారు. ఈ పోస్ట్, సైబర్ స్పేస్‌లో సైతం కంటెంట్ యొక్క ప్రామాణికత గురించి విస్తృత చర్చకు దారితీసింది.
Also Read- Sharmila On Pawan: కోనసీమ దిష్టి వివాదంపై స్పందించిన షర్మిల.. పవన్ కళ్యాణ్‌కు చురకలు
క్షమించరాని శిక్ష విధించబడాలి
రష్మిక ఈ సమస్య నుండి బయటపడటానికి ఒక నిర్మాణాత్మక పరిష్కారాన్ని సూచించారు. ‘‘దుర్వినియోగానికి అతీతంగా గౌరవప్రదంగా, మెరుగైన సమాజాన్ని నిర్మించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించాలి’’ అని ఆమె కోరారు. ఇది కేవలం టెక్నాలజీ సమస్య కాదని, ‘బాధ్యతాయుతమైన వైఖరిని’ ఎంచుకోవడం ద్వారా మానవత్వం వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. చివరగా, ఆమె హెచ్చరిక ధోరణిలో.. ‘‘ప్రజలు మనుషుల్లా ప్రవర్తించలేకపోతే, వారికి కఠినమైన, క్షమించరాని శిక్ష తప్పక విధించబడాలి’’ అని సైబర్‌దోస్త్‌ను ఆమె ట్యాగ్ చేశారు. ఈ వ్యాఖ్య, సైబర్ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. రష్మిక మందన్నా పోస్ట్, AI యుగంలో బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరసత్వం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. నిజమైన పురోగతి అనేది నైతిక విలువలు, సాంకేతిక అభివృద్ధి యొక్క సమతుల్యతపై ఆధారపడి ఉంటుందని ఈ సందేశం బలంగా చెబుతోంది. ఆమె చేసిన ఈ పోస్ట్‌కు అభిమానుల నుంచి, అలాగే నెటిజన్ల నుంచి ఫుల్ సపోర్ట్ లభిస్తోంది.
“When truth can be manufactured, discernment becomes our greatest defence.”
AI is a force for progress, but its misuse to create vulgarity and target women signals a deep moral decline in certain people.
Remember, the internet is no longer a mirror of truth. It is a canvas where…— Rashmika Mandanna (@iamRashmika) December 3, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
