Akhanda 2: నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2: తాండవం’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి తాజా వార్త తెగ వైరల్ అవుతోంది. అది ఏంటంటే .. అఖండ 2 తాండవం సినిమాకు సీక్వల్ కూడా ఉంటుందని ప్రాచారం జరగుతోంది. దీంతో బాలయ్యా బాబు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సారి వచ్చే అఖండ 3 సినిమా గ్లోబల్ రీచ్ ఉంటుందిని ఆసిస్తున్నారు. ఇప్పిటికే సినిమాకు సంబంధించి థమన్ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. సినిమా మిక్స్ంగ్ పూర్తయిందన్నా దానికి సంబంధించి థమన్ ట్వీట్ పెట్టారు. అందులో జై అఖండా అని ఉంది. అయితే ఇదే అఖండ 3 ఉంటుందని హింట్ ఇచ్చారని తెలుస్తోంది. తానికి తగ్గట్టుగా థమన్ కూడా జై అఖండా అని పెట్టారు. దీంతో అఖండా 3 కూడా ఉంటుదని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. దీనిపై మూవీ టీం నుంచి అథికారిక ప్రకటన అయితే రాలేదు. ఇది సినిమా చివరిలో వస్తుందని టాక్ నడుస్తోంది. మరి ఉంటుందో లేదో తెలియాలి అంటే రేపటి వరకూ ఆగాల్సిందే..
Read also-Smriti Mandhana: స్మృతి మంధానా వివాహ తేదీపై క్లారిటీ ఇచ్చిన ఆమె సోదరుడు.. ఏం అన్నాడంటే?
నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ సినిమా విడుదల సందర్భంగా, రాష్ట్రంలోని థియేటర్లలో టికెట్ ధరలను పెంచుకునేందుకు, అలాగే అదనపు షోలను ప్రదర్శించుకునేందుకు అనుమతినిస్తూ ప్రత్యేకంగా ప్రభుత్వ ఉత్తర్వులు (GO) జారీ చేసింది. ‘అఖండ 2’ చిత్రానికి ఉన్న భారీ అంచనాలను దృష్టిలో ఉంచుకుని, సినిమా విడుదలైన మొదటి పది రోజుల పాటు ఈ ప్రత్యేక అనుమతులు అమల్లో ఉండనున్నాయి. పెంచిన టికెట్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి.. సింగిల్ స్క్రీన్ థియేటర్లు సాధారణ టికెట్ ధరపై అదనంగా రూ. 75 (జీఎస్టీతో కలిపి) పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్‌లు సాధారణ టికెట్ ధరపై అదనంగా రూ. 100 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అనుమతి మంజూరైంది. డిసెంబర్ 5వ తేదీన సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, ఈ ధరల పెంపుదల డిసెంబర్ 14వ తేదీ వరకు అంటే పది రోజుల పాటు వర్తిస్తుంది.
Read also-Ravi Teja: రవితేజ – శివ నిర్వాణ కాంబో ఫిల్మ్‌లో ఆరుగురు హీరోయిన్లు వార్తలపై టీమ్ ఏం చెప్పారంటే?
ప్రీమియర్ ఎప్పుడంటే?
టికెట్ ధరల పెంపుతో పాటు, సినిమా విడుదలకు ఒకరోజు ముందు ప్రీమియర్ షో ప్రదర్శించుకునేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 4 (బుధవారం రాత్రి). రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య ఈ షోను ప్రదర్శించవచ్చు. ఈ ప్రత్యేక షోకు టికెట్ ధరను రూ. 600గా (జీఎస్టీతో కలిపి) నిర్ణయించారు. ఈ బెనిఫిట్ షోలు సినిమాపై ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు, తొలి రోజుల్లోనే భారీ వసూళ్లను సాధించేందుకు నిర్మాతలకు దోహదపడతాయి. పెంచిన ధరలతో పాటు, మొదటి పది రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో రోజుకు ఐదు షోలను ప్రదర్శించుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. సాధారణంగా రోజుకు నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించేందుకు అనుమతి ఉంటుంది. ఈ అదనపు షో లభించడం వలన ఫ్యాన్స్‌కు టికెట్లు సులభంగా దొరికే అవకాశం ఉంటుంది. ‘అఖండ 2’ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం కావడంతో, ఈ ప్రత్యేక రాయితీలు సినిమా బడ్జెట్‌ను త్వరగా తిరిగి రాబట్టుకోవడానికి, నిర్మాతలకు అధిక లాభాలు అందించడానికి దోహదపడతాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం బాలయ్య అభిమానుల్లో ఆనందాన్ని నింపింది.
AUM NAMA SHIVAYA 🔱🔥 !!
JAI AKHANDA 📈
THE ROAR IS
BIGGER MIGHTIER STRONGER
ALL SET FOR A TRANCE OF SHIVA 🔱🙌🏿💪🏾Get ready 🔈🔈🔈🔈🔈🔈🔈🔈🔈🔈🔈🙏#Akhanda2Thaandavam 🔥🔫💣🔱 pic.twitter.com/lle8JGXlYP
— thaman S (@MusicThaman) December 3, 2025
