Kodanda Reddy:: కేంద్రం తెస్తున్న విత్తన చట్టంలో మల్టీనేషనల్ సీడ్ కంపెనీల ప్రయోజనమే కనిపిస్తుందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి (Kodanda Reddy) మండిపడ్డారు. బీఆర్కే భవన్ లో మంగళవారం కేంద్ర విత్తన చట్టం -2025 ముసాయిదాపై రైతు కమిషన్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సుమారు 20 రాష్ట్రాల నుంచి వివిధ రాజకీయ పార్టీల నేతలు, రైతు సంఘాల నాయకులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగ నిపుణులు, రైతులు(Farmers) పాల్గొన్నారు. సీడ్ బిల్లులో ఉన్న అంశాలపై అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ విత్తనం రైతు హక్కు అని కానీ ప్రస్తుతం విత్తనం విత్తన కంపెనీల చేతుల్లోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Kodanda Reddy: రైతులకు పక్కా రసీదులు ఇవ్వాలి.. రైతుకమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా చట్టం లేదు
కేంద్రం తెస్తున్న విత్తన చట్టంలో విత్తనాల ధరలపై నియంత్రణ లేదని, సెల్ఫ్ సర్టిఫికేషన్ తోనే కంపెనీలు అమ్ముకునే అవకాశం ఇవ్వడం మంచి పద్దతి కాదన్నారు. చట్టం అనేది రైతులకు లబ్ధి చేకూరేలా ఉండాలని, కానీ బహుళ జాతి కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా ఉందన్నారు. ఇక రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో కూడా క్లారిటీ లేదన్నారు. సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా చట్టం లేదన్నారు. రైతులకు విత్తనాలతో నష్టపోతే నష్టపరిహారం చెల్లించే విషయంలో క్లారిటీ లేదన్నారు. సభ్యురాలు భవానీ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం తెస్తున్న విత్తన బిల్లు విదేశీ కంపెనీలకు డోర్లు ఓపెన్ చేసినట్లున్నాయని, విత్తన చట్టంపై వస్తున్న అభ్యంతరాలను స్వీకరించకుంటే రైతులకు ఉరి వేసినట్లేనన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టడంలో చట్టం లో క్లారిటీ లేదన్నారు.
ఈ సమావేశంలో రైతు కమిషన్ సభ్యుడు రాములు నాయక్, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి. గోపి, ఉద్యానవన యూనివర్సిటీ వీసీ రాజీరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ నేతలు నల్లమల్ల వెంకటేశ్వర్ రావు, పత్తి కృష్ణారెడ్డి, ఆదిరెడ్డి, శ్రీకాంత్ పటేల్, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి శ్రీధర్ రెడ్డి, సీపీఎం రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, సాగర్, సీపీఐ పశ్యపద్మ, రైతు సంఘం నాయకు రాలు ఎం చందర్ రావు, వ్యవసాయ శాస్త్రవేత్త రామంజేయులు, పర్యవరణవేత్త దొంతి నర్సింహారెడ్డి, రిటైర్డ్ అగ్రి అధికారులు శ్రీనివాస్ రెడ్డి, విష్ణు, దిలీప్ రెడ్డి, కమిషన్ మెంబర్ సెక్రెటరీ గోపాల్, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు పాల్గొన్నారు.

