The Raja Saab: ‘రాజా సాబ్’కు ముందు ‘ది’ ఎందుకు? సెంటిమెంటా
The Raja Saab (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

The Raja Saab: ‘రాజా సాబ్’కు ముందు ‘ది’ ఎందుకు? మహేష్‌లా ప్రభాస్‌కు కూడా సెంటిమెంట్!

The Raja Saab: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలకు కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. నందమూరి నటసింహం బాలయ్య (NataSimham Balakrishna) ముహూర్తం టైమ్‌కి పక్కాగా అన్నీ జరిగిపోవాలి. అందుకు ఆయనే ముహూర్తం కూడా ఫిక్స్ చేస్తారు. ఈ మాత్రం తేడా వచ్చినా ఆయనతో దబిడి దిబిడే. ఇక సూపర్ స్టార్ మహేష్ (Super Star Mahesh Babu) విషయానికి వస్తే.. సినిమా ఓపెనింగ్ రోజు మహేష్ కనిపించడు. ఆయన ఓపెనింగ్‌కు హాజరైన సినిమాలు వరుస డిజాస్టర్స్ కావడంతో.. అప్పటి నుంచి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ‘మురారి’, ‘ఒక్కడు’, ‘పోకిరి’ చిత్రాల తర్వాత మూడు అక్షరాల టైటిల్స్‌‌కు ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనే టాక్ కూడా ఉంది. ఇప్పుడీ లిస్ట్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) కూడా చేరాడు. ప్రభాస్‌కు ఏం సెంటిమెంట్ ఉందని అనుకుంటున్నారా? ఉంది.. ప్రభాస్‌కు కూడా ఓ సెంటిమెంట్ ఉంది. అదేంటంటే..

Also Read- Ravi Teja: ర‌వితేజ – శివ నిర్వాణ కాంబో ఫిల్మ్‌లో ఆరుగురు హీరోయిన్లు వార్తలపై టీమ్ ఏం చెప్పారంటే?

హారర్ కామెడీ జానర్‌లో ఎవర్ గ్రీన్ మూవీ

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న క్రేజీ మూవీ ‘ది రాజా సాబ్’ (The Raja Saab). సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. హారర్ కామెడీ జానర్‌లో ఎవర్ గ్రీన్ మూవీగా దర్శకుడు మారుతి (Director Maruthi) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో అన్ కాంప్రమైజ్డ్‌గా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా సంబంధించి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం అభిమానులు, ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ ఈ సినిమాపై క్యూరియాసిటీ బీభత్సంగా పెరిగిపోయింది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే మరో బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ కూడా ఇందులో ఓ ఇంపార్టెంట్ పాత్రను చేస్తున్నట్లుగా, ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని, మంగళవారం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అసలు విషయంలోకి వస్తే..

Also Read- Akhanda 2: నందమూరి ఫ్యాన్స్‌కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే వస్తోన్న ‘అఖండ 2’!

ప్రభాస్ సెంటిమెంట్ ఇదే..

ఈ సినిమా టైటిల్‌ను ఒకసారి గమనిస్తే.. ‘ది రాజా సాబ్’ అని ఉంటుంది. కానీ ఈ సినిమాను మాత్రం ‘రాజా సాబ్’ అనే పిలుస్తున్నారు. ఈ ‘రాజా సాబ్’ ముందు ‘ది’ పెట్టడానికి కారణం.. ప్రభాస్ గత చిత్రాల రిజల్టే అని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా నటించిన గత చిత్రాలలో మొదటి అక్షరం ‘ఆర్’తో (R Letter Sentiment) మొదలైన చిత్రాలన్నీ పరాజయం చెందాయి. ‘రాఘవేంద్ర’, ‘రెబల్’, ‘రాధే శ్యామ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్‌ను అందుకున్నాయో తెలియంది కాదు. ఇప్పుడు ‘రాజా సాబ్’కు కనుక ఆ లెటర్ సెంటిమెంట్ వర్కవుట్ అయితే మాత్రం.. మరోసారి ప్రభాస్‌కు నిరాశ తప్పదు. అందుకే ఇదంతా ఆలోచించి.. ‘రాజా సాబ్’ని ‘ది రాజా సాబ్’గా మార్చారనేలా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఏమో.. ఒక వేళ ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయితే.. అమ్మో ఊహించుకుంటేనే దారుణంగా ఉంది. అందుకే మేకర్స్ ముందుగానే ఈ సినిమా టైటిల్‌కు ముందు ‘ది’ చేర్చేశారు. దీంతో ప్రభాస్‌తో పాటు ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kadapa New Mayor: కడప మేయర్ సురేష్ బాబుకు బిగ్ షాక్.. కొత్త మేయర్ ఎంపికకు ఈసీ ఆదేశాలు

Putin Lands in Delhi: ఢిల్లీలో అడుగుపెట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. స్వయంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీ

Breaking News: ‘అఖండ 2’ ప్రీమియర్స్ క్యాన్సిల్.. క్షమాపణలు చెప్పిన నిర్మాతలు

Marriage Scam: మామూలు స్కెచ్ కాదు.. పెళ్లి చేసుకుంటానని నిండా ముంచాడు.. లబోదిబోమంటున్న యువతి

Cyber Crime: కొంపలు ముంచిన ఏపీకే ఫైళ్లు.. ఒక్క క్లిక్‌తో రూ.లక్షల్లో స్వాహా!