CM Revanth Reddy: ఖమ్మంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తికాకుండా కేసీఆర్(KCR) ఇంట్లో కనుక వర్షం కురిపించాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revnath Rddy) కొత్తగూడెంలో జరిగిన సభలో వెల్లడించారు. దేశంలోనే మొట్టమొదటి ఎర్త్ యూనివర్సిటీ(Earth University) కి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) పేరుతో నామకరణం చేసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వానికి ఆయువుపట్టుగా నిలిచిన మంత్రి పదవులను ఖమ్మం జిల్లాకే ఉన్నాయని చెప్పారు. ముగ్గురు మంత్రుల సహకారంతో ప్రభుత్వం మరింత ముందుకు సాగుతుందన్నారు.
చేతిలో ఉన్న వజ్రాయుధం
ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలో రెండు నదుల ప్రాజెక్టులు నిర్మించుకోవడం సంతోషమని వెల్లడించారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ఏ కార్యక్రమం మొదలుపెట్టిన ఖమ్మం నుంచి మొదలవుతుందన్నారు. అది ఇందిరమ్మ ఇండ్లు అయిన, గృహలక్ష్మి పథకం అయిన, సన్న బియ్యం కార్యక్రమం అయిన ప్రతి కార్యక్రమం ఖమ్మం జిల్లా నుంచి మొదలవుతుందన్నారు. భద్రాచలం రాములవారి ఆశీస్సులతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసుకునేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. మంత్రుల అండదండలతో ప్రజా ప్రభుత్వాన్ని మరింత ముందుకు నడిపిస్తానని వెల్లడించారు. ప్రజల ఆశీస్సులు ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ముందుకు నడిపించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటుతోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న గ్రామాల్లో సర్పంచులు ఉంటేనే ఆ గ్రామం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని అందుకు ప్రజలు గ్రామాల్లో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. డబ్బుకో, మందుకో ఓటేస్తే గ్రామాలు కుంటు పడతాయని చెప్పారు.
Also Read: Naga Vamsi: సినిమాలకు సింపతీ కార్డ్ ఎందుకు పనిచేయడంలేదు.. నాగవంశీ ఏం అన్నారంటే?
రాజకీయ కక్షలు మానండి
రాజకీయ కక్షలు మానండి.. ప్రజా ప్రభుత్వానికి సహకరించండి.. అంటూ వేడుకున్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao), భట్టి విక్రమార్క మల్లు(Bhatti Vikramarka Mallu), పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి(Pongileti Srinivas Reddy)లతో కలిసి అన్ని గ్రామాలలో సర్పంచులను గెలిపించుకోగలిగితే రాష్ట్రమంతా అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ.. ఎర్త్ సైన్స్ అంటే దేశంలోనే లేదని అది తెలంగాణ రాష్ట్రంలో ఉండడం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టం అన్నారు. భూమి, భూమి లోపల పొరలు, భూమి లోపల ఖనిజాలు వెలికి తీసేదే మనం ప్రారంభించుకుంటున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీ అని చెప్పారు. తెలంగాణ(Telangana) రాష్ట్రం దేశానికి దిక్సూచి గా మారబోతుందన్నారు. 300 ఎకరాల్లో 1000 కోట్లతో ఈ నిర్మాణాన్ని ప్రారంభించుకోవడం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ(Revenue), గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read: Imran Khan: ఇమ్రాన్ ఖాన్ దారుణ హత్య?.. పాక్‌లో హైటెన్షన్.. 144 సెక్షన్ విధింపు

