Mega Victory: మెగాస్టార్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్..
msg-update(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Mega Victory: మెగాస్టార్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి.. మెగా విక్టరీ సాంగ్ లోడింగ్..

Mega Victory: మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు అనిల్ రావిపూడి తీస్తున్న సినిమా నుంచి అదిరిపోయే అప్టేట్ ఇచ్చాడు దర్శకుడు. టాలీవుడ్‌లో సరికొత్త వైబ్రేషన్స్ సృష్టిస్తూ, మన మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి ఒక “మెగా-విక్టరీ మాస్ సాంగ్”లో నటించబోతున్నారని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మాస్ సాంగ్ కోసం ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం నుండి షూటింగ్ జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ న్యూస్ సంక్రాంతి 2026ని సినీ చరిత్రలో చిరస్మరణీయంగా మార్చబోతోందని అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఇద్దరు దిగ్గజ హరోలో ఒకే తెరపై కనబడితే ఫ్యాన్స్కు పూనరాలే.. అలాంటిది.. ఒకే సాంగ్ లో కలిసి చేస్తున్నారు అంటే అది అభిమానులకు ఫీస్తే అవుతుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి మధ్య తీస్తున్నది చివరి సాంగ్ కావచ్చు.. దీనిని చూసిన అభిమానుల సంబరాలు చేసుకుంటున్నారు.

Read also-Bhagyashri Borse: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నుంచి భాగ్యశ్రీ బోర్సే ఆశించింది రాలేదా?.. ఆమె నిరాశకు కారణం ఇదే..

ఇద్దరు లెజెండ్స్..

చిరంజీవి, వెంకటేష్ ఈ ఇద్దరు దిగ్గజాలు తెలుగు సినిమాకు రెండు వేరు వేరు పంథాలలో సూపర్ స్టార్‌డమ్‌ను నిర్వచించారు. చిరంజీవి తన అద్భుతమైన డ్యాన్స్‌లు, స్టైలిష్ యాక్షన్, మెగా ఎనర్జీతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తే, వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా, సున్నితమైన నటనతో, తనదైన టైమింగ్‌తో ప్రేక్షకులను మెప్పించారు. ఈ ఇద్దరు హీరోలు కలిసి తెరపై కనిపిస్తే ఆ సందడి ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. ఇప్పుడు, అనిల్ రావిపూడి వీరిద్దరినీ ఒకే మాస్ సాంగ్‌లో చూపించే సాహసం చేస్తున్నారు. ఇది కేవలం ఒక పాట మాత్రమే కాదు, తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయే అవకాశం ఉంది.

Read also-Moglie Trailer: రోషన్ కనకాల ‘మోగ్లీ 2025’ ట్రైలర్ వచ్చేసింది.. సందీప్ రాజ్ వేరే లెవెల్ టేకింగ్..

అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్‌మెంట్..

దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో, కామెడీ, యాక్షన్‌ను సమపాళ్లలో మిళితం చేసి ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదాన్ని అందించడంలో ఆయన దిట్ట. ఆయన టేకింగ్‌లో ఒక మాస్ సాంగ్ అంటే, అది కేవలం డ్యాన్స్‌లకే పరిమితం కాకుండా, సందర్భానుసారం ఫన్నీ మూమెంట్స్‌, పవర్-ప్యాక్డ్ విజువల్స్ ప్రేక్షకులను థియేటర్‌లో విజిల్స్ వేయించే స్థాయి మాస్ మొమెంట్స్ ఖచ్చితంగా ఉంటాయని అంచనా వేయవచ్చు. ఈ పాటలో చిరంజీవి గ్రేస్, వెంకటేష్ స్వాగ్ మేళవింపు చూడబోతున్నాం. సంక్రాంతి అనేది తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ ఒక పండుగలాంటి సినిమా సీజన్. 2026 సంక్రాంతిని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు ఈ ‘మెగా-విక్టరీ మాస్ సాంగ్’ సిద్ధమవుతోంది. ఈ పాట విడుదల తర్వాత, థియేటర్లలో చిరంజీవి వెంకటేష్ అభిమానుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని ఇప్పటికే సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మొత్తంగా, అనిల్ రావిపూడి ఇచ్చిన ఈ అప్‌డేట్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. తెరపై మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌లను కలిసి చూసే ఆ “మెగా-విక్టరీ” మాస్ సెలబ్రేషన్‌ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Just In

01

Bigg Boss First Finalist: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు? రేసులో ఆ నలుగురు?

Big Ticket Abu Dhabi: సౌదీలోని భారతీయుడికి భారీ జాక్‌పాట్.. లాటరీలో రూ.61 కోట్లు!

OnePlus 13: OnePlus 13 ఫోన్ కు 10 వేల డిస్కౌంట్.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?

Hidma Encounter: హిడ్మా ఎన్‌కౌంటర్‌‌పై మావోయిస్టుల మరో లేఖ.. అంతా వాళ్లే చేశారు!

Akhanda 2: తెలంగాణలోనూ లైన్ క్లియర్.. ఎట్టకేలకు ప్రీమియర్‌కు, టికెట్ల ధరల హైక్‌కు అనుమతి! కండీషన్స్ అప్లయ్!