Bigg Boss 9 Telugu: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే టెలివిజన్ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 9’. తాజాగా దీనికి సంబంధించి ఈ రోజు మొదటి ప్రోమో విడుదలైంది. 86వరోజు గేమ్ మరింత రసవత్తరంగా సాగుతుందని ఈ ప్రోమోను చూస్తే తెలుస్తోంది. ఈ రోజు టాస్క లో గెలిచేవారు మొదట ఫైనలిస్ట్ అవుతారు. దీంతో అందరిలో ఒక రకమైన టెన్షన్ మొదలైంది. ఇప్పుడు ఉన్న సభ్యుల నుంచి ముగ్గురు ముందుకు వస్తే ఈ గేమ్ ప్రారంభిద్దాం ఆ ముగ్గురు ఎవరనేది మీరే నిర్ణయించుకుని చెప్పండి అంటూ బిగ్ బాస్ సభ్యులకు తెలిపారు. దీంతో అందరూ ఎవరు ముందు వెళ్తారు అన్నదానిపై దైలమాలో పడ్డారు. ఎవరో ఇద్దరు బాయ్స్ వస్తే వెళ్తాను అని సంజన తెలిపింది. దానికి తసూజ సమ్మతించింది. ఇంతలో నేను ముందు వెళ్తాను అని రీతూ భరణితో చెప్పింది. దీంతో ఎవరు వెళ్తున్నారు అన్నదానిపై క్లారిటీ రాలేదు. తనూజ మాత్రం ఇమ్మూ, పవన్, డీమాన్ ను పంపుదాం అని ప్రపోజ్ చేసింది.
Read also-Moglie Trailer: రోషన్ కనకాల ‘మోగ్లీ 2025’ ట్రైలర్ వచ్చేసింది.. సందీప్ రాజ్ వేరే లెవెల్ టేకింగ్..
ప్రపోజ్ చేసిన సభ్యులను పంపడానికి అంతా రెడీ అయింది. బిగ్ బాస్ పిలవడంతో తనూజ వెళ్లాలి అనుకున్న ముగ్గురి పేర్లు చెప్పింది. దీంతో రీతూకి కోపం వచ్చింది. నేనే వెళ్తను అన్నాను కదా.. మరి ఎందుకు వాళ్లను పంపుతున్నారు అని తనూజను అడిగింది. దీంతో తనూజ నాకు చెప్పాలి కదా.. ఎందుకు చెప్పలేదు. అంటూ అడిగింది దానికి నేను చెప్పాలనుకున్నా.. బిగ్ బాస్ అందుకే టైం ఇచ్చారు కదా అందుకే ఆలోచిస్తున్నా.. ఇంతలో నువ్వు వెళ్లి చెప్పేశావు అంటూ రీతూ తనూజపై ఫైర్ అయింది. తనూజ కూడా ఏం తగ్గకుండా ఆమెతో వారించింది. ఈ పంచాయితీ అంతటితో ఆగకుండా ఇమ్మనుయేల్ దగ్గరకు వెళ్లింది. ఇమ్మూ కూడా కొంత సేపు వారించి ఏం చేయాలో తెలియక తప్పుకున్నాడు. దీంతో బిగ్ బాస్ డైరెక్ట్ గా రంగంలోకి దిగి ఎవరు రావాలి అన్నది నేను నిర్ణయిస్తాను అని చెప్పరు. దీంతో అక్కడ గొడవ సర్దుమణిగింది.
Read also-Samantha Telugu: సమంతకు తెలుగు వారితో ఉన్న బంధం గురించి తెలిస్తే షాక్ అవుతారు.. మళ్లీ కోడలిగా..
బిగ్ బాస్ రీతూ కళ్యాణ్, ఇమాన్యూయేల్ ను ఎంచుకుని టాస్క్ ఆడటానికి సిద్ధం కమ్మన్నాడు, దీంతో వారు రెడీ అయ్యారు. వారి ముగ్గురినీ పిలిచి కనుక్కోండి చూద్దాం అనే టాస్క ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో రకరకాల లెక్కల ప్రశ్నలు ఉన్నాయి. వాటిలో నేను ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఆన్స్ ర్ వస్తుందో దానిని నేనే చెబుతాను. ప్రశ్న మీరు అక్కడి నుంచి తీసి నాకు చూపించాలి అని అన్నాడు. దీంతో అందరూ గేమ్ ఆడటానికి రెడీ అయ్యారు. గేమ్ ప్రారంభం బాగానే ఉంది. అందులో ఇమ్మాన్యూయేల్ ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు చూపించినట్లు ప్రోమోలో చూపించారు. అయితే ఈ గేమ్ ఎవరు నగ్గారు? ఎవరు ఫైనల్ అయ్యారు అన్నది మాత్రం తెలియాలి అంటే సాయంత్రం వరకూ ఆగాల్సిందే. ప్రోమోను బట్టి చూస్తుంటే ఇమ్మూ మొదటి ఫైనలిస్ట్ అవుతాడనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.
