Samantha Telugu: సమంతకు తెలుగు వారితో బంధం ఏంటంటే..
samantha(image:x)
ఎంటర్‌టైన్‌మెంట్

Samantha Telugu: సమంతకు తెలుగు వారితో ఉన్న బంధం గురించి తెలిస్తే షాక్ అవుతారు.. మళ్లీ కోడలిగా..

Samantha Telugu: దక్షిణాది సినీ పరిశ్రమలో తన అద్భుతమైన నటనతో, చలాకీతనంతో ప్రత్యేక ముద్ర వేసిన నటి సమంత రూత్ ప్రభుకు తెలుగు ప్రేక్షకులు, తెలుగు చిత్రసీమతో ఉన్న అనుబంధం ఎప్పటికీ విడదీయరానిది. ఆమె కెరీర్ గమనాన్ని, వ్యక్తిగత జీవితాన్ని మలుపు తిప్పిన ప్రధాన ఘట్టాలు చాలావరకు తెలుగు గడ్డపైనే చోటు చేసుకోవడం ఈ బంధాన్ని మరింత బలపరుస్తున్నాయి. సమంత కెరీర్ ప్రారంభం తెలుగులోనే కావడం ఈ అనుబంధానికి మొదటి కారణం. 2010లో విడుదలైన ‘ఏ మాయ చేశావే’ చిత్రం ఆమెకు మొదటి, అతిపెద్ద విజయాన్ని అందించింది. ఈ సినిమాలో ‘జెసీ’ పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు, గౌతమ్ మీనన్ దర్శకత్వం, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం – ఇవన్నీ కలిసి సమంతను రాత్రికి రాత్రే స్టార్‌గా మార్చేశాయి. ఈ సినిమా విజయం, తెలుగు ప్రేక్షకుల ఆదరణే ఆమెకు సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా స్థిరపడేందుకు గట్టి పునాది వేసింది. ఆ తర్వాత ‘దూకుడు’, ‘ఈగ’, ‘అత్తారింటికి దారేది’ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్‌లు ఆమెను తెలుగువారికి దగ్గర చేర్యాయి.

Read also-Raj Nidimoru: సమంతతో పెళ్లి తర్వాత వైరల్ అవుతున్న రాజ్ పాపను ఎత్తుకున్న ఫోటోలు..

తెలుగుతో బంధం..

సమంత వ్యక్తిగత జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం కూడా తెలుగు గడ్డపైనే జరిగింది. ఆమె తెలుగు సినిమాలోనే పరిచయమై, ప్రముఖ నటుడు అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2017లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో జరిగిన వీరి వివాహం తెలుగు సినీ అభిమానుల దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. మొదటి వివాహం తెలుగు వ్యక్తిని చేసుకోవడం ఆమెకు తెలుగు రాష్ట్రాలతో ఉన్న అవినాభావ సంబంధాన్ని మరింత స్పష్టం చేసింది. దురదృష్టవశాత్తూ వీరి వివాహ బంధం విచ్ఛేదం అయినా, తెలుగు ప్రేక్షకులు ఆమెను ఆదరించడం మాత్రం మానలేదు.

Read also-Akhanda 2: ‘అఖండ 2’కు అవతార్ రూపంలో గండం.. నిరాశలో నందమూరి ఫ్యాన్స్!

రాజ్ నిడమోరుతో తాజా పరిచయం..

ప్రస్తుతం సమంత కెరీర్‌ని పరిశీలిస్తే, ఆమె బాలీవుడ్‌లో కూడా అడుగుపెడుతూ, ప్రముఖ దర్శక ద్వయం రాజ్ & డీకే (రాజ్ నిడమోరు, కృష్ణ డి.కె.) దర్శకత్వంలో రూపొందుతున్న ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం రాజ్ ను పెళ్లిచేసుకున్నారు. ఆయన కూడా తెలుగు వ్యక్తే కావడం విశేషం. రాజ్ నిడమోరు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి. దర్శకత్వంలోకి రాకముందు ఆయన, డీకే కలిసి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా అమెరికాలో పనిచేశారు. వీరు హిందీ చిత్రసీమలో తమదైన ముద్ర వేశారు. ముఖ్యంగా, ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జి’ వంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లను సృష్టించి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. రాజ్ నిడమోరు తన సొంత ప్రాంతం, మాతృభాషపై మమకారాన్ని తరచూ వ్యక్తం చేస్తూ ఉంటారు. మొదటి విజయం, వివాహం, ప్రస్తుత ప్రొజెక్ట్‌లో తెలుగు మూలాలున్న దర్శకుడితో కలిసి పనిచేయడం – ఇవన్నీ సమంత రూత్ ప్రభుకు తెలుగు రాష్ట్రాల ప్రజలతో ఒక ప్రత్యేకమైన, హృదయపూర్వకమైన అనుబంధాన్ని నిలబెడుతున్నాయి. దీంతో సమంత తెలుగును వదలడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Just In

01

Bigg Boss First Finalist: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు? రేసులో ఆ నలుగురు?

Big Ticket Abu Dhabi: సౌదీలోని భారతీయుడికి భారీ జాక్‌పాట్.. లాటరీలో రూ.61 కోట్లు!

OnePlus 13: OnePlus 13 ఫోన్ కు 10 వేల డిస్కౌంట్.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?

Hidma Encounter: హిడ్మా ఎన్‌కౌంటర్‌‌పై మావోయిస్టుల మరో లేఖ.. అంతా వాళ్లే చేశారు!

Akhanda 2: తెలంగాణలోనూ లైన్ క్లియర్.. ఎట్టకేలకు ప్రీమియర్‌కు, టికెట్ల ధరల హైక్‌కు అనుమతి! కండీషన్స్ అప్లయ్!