T.PCC, BC, Reddy
Politics

Hyderabad: పీసీసీలో ‘సెంటిమెంట్’ సెగ

  • పీసీసీ పీఠంపై అధిష్టానం మల్లగుల్లాలు
  • అధిష్టానం చుట్టూ తిరుగుతున్న అన్ని వర్గాల సీనియర్ నేతలు
  • ఫైనల్ నిర్ణయం రేవంత్ కే వదిలేసిన అధిష్టానం
  • పీసీసీ పీఠం ఎంపికలో తెరపైకి వచ్చిన సెంటిమెంట్ అస్త్రం
  • బీసీ వెర్సెస్ రెడ్డి ఈక్వేషన్స్ గుర్తుచేస్తున్న పార్టీ వర్గాలు
  • బీసీ వర్గానికి చెందిన డిఎస్ తో పనిచేసిన వైఎస్
  • బీసీ వర్గానికే చెందిన కెకె తో కలిసి పనిచేసిన వైఎస్
  • బొత్స సత్సన్నారాయాణతో కలిసి పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి
  • మళ్లీ పాత ఫార్మేట్ లోనే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక చేయాలని సూచిస్తున్న సీనియర్లు

centiment politics in Tpcc bc verses reddy combination in selection

తెలంగాణ కాంగ్రెస్ లో ఏ ఇద్దరు నేతలు కలిసినా పీసీసీ అంశంపైనే జోరుగా చర్చలు జరుగుతున్నాయి. పీసీసీ సారథ్యం ఏ వర్గానికి ఇస్తారో అని అంతా అత్యుత్సాహంతో ఎదురుచూస్తున్నారు. పీసీసీ పీఠం కోసం అన్ని వర్గాలనుంచి అధిష్టానానికి ఒత్తిడులు బాగా పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో ఓ సరికొత్త సెంటిమెంట్ అంశం తెరమీదకొచ్చింది. ప్రస్తుతం ఆ సెంటిమెంట్ అంశాన్ని కూడా అటు అధిష్టానం, ఇటు రేవంత్ రెడ్డి సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సీఎం కావడంతో పీసీసీ అధ్యక్ష పీఠం ఆ వర్గానికి ఇచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారిలో ఒకరికి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. బలహీన వర్గాలకు చెందిన బీసీలకు ఇస్తారా లేక ఎస్టీలకు ఇస్తారా, ఎస్సీలకు ఇస్తారా అనే చర్చ పార్టీలో తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఇందుకు సంబంధించి పార్టీ సీనియర్లు ఇప్పటికే అధిష్టానంపై ఒత్తిడి పెంచడంతో అధిష్టానం మాత్రం ఫైనల్ నిర్ణయం రేవంత్ రెడ్డికే అప్పజెప్పినట్లు సమాచారం.

పీసీసీ పీఠంపై సెంటిమెంట్ అస్త్రం

అధ్యక్ష పీఠంపై ఊహాగానాలు ఇలా కొనసాగుతుండగా అనూహ్యంగా ఓ సెంటిమెంట్ అంశం తెరమీదకొచ్చింది. కొందరు గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది. అప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించేవారు. అప్పటి ఏఐసీసీ అధ్యక్షులుగా చేసినవారు సీఎంలతో సన్నిహితంగా ఉంటూ వారిచ్చే అమూల్యమైన సలహాలతో పార్టీని విజయపంథాలో నడిపించారు. 2004 నుంచి 2014 దాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పీరియడ్ ను పరిగణనలోకి తీసుకుంటే బీసీ వర్గానికి చెందిన నేతలే పీసీసీలుగా వ్యవహరిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు సీఎంలుగా ఉన్నారు. 2004-2005 కాలంటో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత దివంగత డి.శ్నీనివాస్ పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అదే టర్మ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నారు. అలాగే 2005 నుంచి 2011లోనూ తిరిగి డి. శ్రీనివాస్కే పీసీసీ బాధ్యతలు అధిష్టానం అప్పగించింది. అప్పుడు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా చేశారు. ిక 2005 నుంచి 2008 వరకూ బీసీ వర్గానికి చెందిన కె.కేశవరావు పీసీసీ అధ్యక్ష పదవిలో ఉండగా అప్పుడు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా చేస్తున్నారు. తర్వాత 2011 నుంచి 2014 వరకూ పీసీసీ అధ్యక్షుడిగా బొత్స సత్యన్నారాయణ పనిచేశారు. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

బీసీ వెర్సెస్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం పవర్‌లో ఉన్నప్పుడు సీఎంగా రెడ్డి సామాజిక వర్గం నేతలు ఉండగా, పీసీసీ అధ్యక్షుడిగా బీసీలకు అవకాశం ఇచ్చారు. కులసమీకరణలను బ్యాలెన్స్ చేసేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని పార్టీ లీడర్లు చెబుతున్నారు. అంతేకాదు 2004 నుంచి 2013 వరకూ కాంగ్రెస్ ప్రభుత్వం ..అది అనుసరించిన సంక్షేమ పథకాలకు అనూహ్య రీతిలో అంతులేని ప్రజాదరణ లభించింది. దీనికి తోడు వైఎస్ఆర్ ఛరిష్మా ఆయన క్యాబినెట్ తీరుతెన్నులు అన్నీ కూడా పార్టీకి కలిసొచ్చాయని కొందరు పార్టీ సీనియర్లు అంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కాంగ్రెస్ పై ఆదరణ చెక్కుచెదరలేదు. అయితే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఏకంగా హైజాక్ చేసి కాంగ్రెస్ పార్టీనే లేకుండా చేద్దామనుకున్న ఎత్తులను ప్రజలు గ్రహించారు. అందుకే 2023 అసెంబ్లీ ఎన్నికలలో అపూర్వ విజయం అందించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా పదేళ్ల పాటు సీఎంగా ఉండాలని అధిష్టానం భావిస్తోంది. ఇప్పుడున్న రేవంత్‌రెడ్డి సర్కారు కూడా పదేండ్లు పవర్‌లో ఉండాలని భావిస్తున్నది. దీనిలో భాగంగానే గతంలో సక్సెస్‌ను అందించిన ఆలోచనలు, విధానాలు, సూత్రాలను ఇప్పుడూ ఇంప్లిమెంట్ చేయాలనేది ఏఐసీసీ భావన. కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక వేగంగా జరుగుతున్న వేళ ఈ అనవాయితీ తెర మీదకు వచ్చింది. దీని వల్ల నేతలందరూ సంతృప్తి చెందుతారని పార్టీ వర్గాల్లో టాక్. త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్‌ను ప్రకటించే చాన్స్ ఉన్నదని పార్టీ‌లో జోరుగా చర్చ జరుగుతున్నది.

తగ్గేది లేదంటున్న సీనియర్లు

పీసీసీ చీఫ్ పోస్టు బీసీకి కన్ఫామ్ చేస్తే, గౌడ సామాజిక వర్గానికి దక్కే అవకాశం ఎక్కువగా ఉందనే చర్చ జరుగుతోంది. దీంతో పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ‌గౌడ్ కూడా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నారు. ఏఐసీసీ స్థాయిలోని తన పరిచయాలతో పావులు కదుపుతున్నారు. దీంతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నట్టు టాక్. ఇక ప్రభుత్వంలో సరైన ప్రాతనిధ్యం లేని కులాలను కూడా పీసీసీ చీఫ్ పోస్టు కోసం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నది. ప్రస్తుత ప్రభుత్వంలో ఎస్టీ కులాల్లోని ఆదివాసీ వర్గానికి మంత్రి పదవి ఉండగా, లంబాడాలకు అవకాశం రాలేదు. లంబాడా వర్గానికి పార్టీలో హయ్యర్ పోస్టు ఇవ్వాలనే ఒక ప్రపోజల్ కూడా ఉన్నది. దీంతో ప్రస్తుత ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ పేరును కూడా పీసీసీ చీఫ్ పోస్టుకు పరిశీలిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?