Revanth Reddy: పదేళ్లలో 100 ఏళ్లకు సరిపడా అభివృద్ధి చేసుకుందాం
70 ఏండ్ల తర్వాత పాలమూరు బిడ్డకు పాలించే అవకాశం
ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చాక పాలమూరును పట్టించుకున్న సీఎంలు లేరు
సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా మార్చాం
పాలమూరులో పసిడి పంటలు పండాలి
మఖ్తల్ ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మహబూబ్ నగర్ /మఖ్తల్, స్వేచ్ఛ: ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పాలమూరు జిల్లాను పట్టించుకున్న ముఖ్యమంత్రులు ఎవరూ లేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. కానీ, 2023 డిసెంబరు 7న అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వచ్చే పదేళ్లలో వందేళ్ల కు సరిపడా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘వడ్డించే వాడినే నేను. జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవడానికి ఎన్ని నిధులైనా ఇస్తాను’’ అనిని ఆయన హామీ ఇచ్చారు. పాలమూరు జిల్లా ప్రజలు ఆశీర్వదించి ఓట్లు వేసి ఉమ్మడి జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేల బలగంతో పంపిస్తే, తాను తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిని అయ్యానని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’ తొలి సభ మఖ్తల్ పట్టణంలో నిర్వహించగా, ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Read Also- Huzurabad Area Hospital: ఏరియా హాస్పిటల్‌లో ఓ రేడియాలజిస్ట్ చేతిలో బందీ అయిన స్కానింగ్ సెంటర్!
అంతకు ముందు సభా వేదిక పక్కన హెలిప్యాడ్ నుంచి రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, జిల్లా ఇంఛార్జి మంత్రి దామోదర రాజనర్సింహతో కలసి నేరుగా మఖ్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి మళ్లీ సభా వేదిక వద్దకు చేరుకుని రూ.1,038 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా విజయోత్సవాల సభలో సీఎం ప్రసంగించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచిన సందర్భంగా రాష్ట్రంలో ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్న తర్వాత, విజయోత్సవాల తొలి సభను వెనకబడిన మక్తల్‌లో ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీహరి కోరడం.. ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని అడిగారని తెలిపారు. అందుకే ఇక్కడి నుంచే విజయోత్సవాల సభను జరుపుకున్నామని తెలిపారు.
Read Also- New Wine Shops: కొత్త వైన్స్‌లోకి త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త బ్రాండ్లు
‘‘కౌన్ పూచేగా మఖ్తల్ అనేది కాకుండా సబ్ కుచ్ పూచేగా, సబ్ కుచ్ ఆయేగా మఖ్తల్’’ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాకు చెందిన బూర్గుల రామకృష్ణ సీఎం అయ్యారని, మళ్లీ 75 ఏళ్ల తర్వాత ప్రజా ఆశీర్వాదంతో పాలమూరు బిడ్డ సీఎం అయ్యారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అప్పట్లో జిల్లా నుంచి మంత్రులు ఎన్నికైనా… ఆనాటి సీఎం చెప్పు చేతల్లో ఉన్నారని, కానీ పాలమూరు ప్రజలు చైతన్యవంతులై ఉమ్మడి జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేల ను గెలిపిస్తే ‘మీ రైతు బిడ్డ సీఎం అయ్యాడు’ అని అన్నారు. ‘‘ మీ బిడ్డ జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ఇపుడు సీఎంగా నిలబడ్డాడు. పాలమూరు ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది. మోసం చేస్తే పాతాళానికి తొక్కుతుంది. 2009లో వలస వచ్చి ఎంపీగా పోటీ చేస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం, జిల్లా ప్రాజెక్టుల పూర్తి కోసం, లక్షలాది ఎకరాలకు నీళ్లు వస్తాయనే ఆశతో , పాలమూరులో ఊరు లేకున్నా… పార్లమెంటులో నోరు లేకున్నా..ఆయనను జిల్లా ప్రజలు ఆశీర్వదించారు’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
