Boyapati Srinu: మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి నటసింహం బాలయ్య (Nandamuri Balakrishna)తో వరుస బ్లాక్‌బస్టర్స్ కొడుతూ.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ హిస్టరీని క్రియేట్ చేసుకున్న దర్శకుడాయన. అలాంటి దర్శకుడి నుంచి ‘అఖండ 2’ (Akhanda 2) చిత్రం రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్న బోయపాటి.. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఎందుకు చేయలేదో చెప్పుకొచ్చారు. వాస్తవానికి ‘సింహా’ సినిమా (Simha Movie) కథని మొదట చిరంజీవి (Megastar Chiranjeevi)కే ఆయన వినిపించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన చిరంజీవితో ఇప్పటి వరకు సినిమా ఎందుకు చేయలేదనే అంశంపై స్పష్టత ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, తమ కలయిక ఇప్పటి వరకు కుదరకపోవడానికి గల ప్రధాన కారణాన్ని వెల్లడించారు.
Also Read- Nov 2025 Hits And Flops: నవంబర్‌లో థియేటర్లలోకి వచ్చిన సినిమాలలో ఏవి హిట్? ఏవి ఫట్?
‘అఖండ’ తర్వాత మారిపోయిన లెక్కలు
గతంలో చిరంజీవితో సినిమా చేసే అవకాశం కుదరలేదని బోయపాటి తెలిపారు. భవిష్యత్తులో చిరంజీవితో సినిమా వస్తే, దాని కోసం బలమైన కథ ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. దీనికి కారణం, నందమూరి బాలకృష్ణతో తాను తీసిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అఖండ’ అని బోయపాటి పేర్కొన్నారు. ‘‘చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ హీరోలతో సినిమాలు చేసేటప్పుడు, నా వరకు ప్రధానంగా ‘అఖండ’నే చూస్తారు. వారితో సినిమా చేస్తే ఆ సినిమాను మించిన కథ కావాలి. ‘అఖండ’కు ముందు మెగాస్టార్‌తో సినిమా చేయడానికి నా దగ్గర కథలుండేవి. కానీ, ఇప్పుడా కథలు పనికిరావు. ఇప్పుడంతా ‘అఖండ’ రేంజ్‌నే చూస్తారు. ఈ టాప్ హీరోలలో ఎవరితో సినిమా చేయాలన్నా.. ‘అఖండ’ను మించే అంతా ఊహిస్తారు’’ అని బోయపాటి చెప్పుకొచ్చారు.
Also Read- Naga Chaitanya: సమంతతో విడాకులపై నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్.. ఇప్పుడిదే టాక్!
సరైన కథ దొరకలేదు
‘‘అలా అఖండ’ తర్వాత అంచనాలు పూర్తిగా మారిపోయాయి. చిరంజీవి లాంటి హీరోతో సినిమా చేయాలంటే, ‘అఖండ’ స్థాయిలో లేదా అంతకంటే గొప్పగా ఉండే కొత్త కథాంశాన్ని ఎంచుకోవాలి. ఇప్పుడు మా దగ్గర కరెక్ట్ కథ లేదు. మెగాస్టార్‌తో సినిమా చేయాలంటే ఆ స్థాయి కథ కావాలి. ఆ కథ వేరే వేరియేషన్‌లో లేదా వేరే డైమెన్షన్‌లో ఉండాలి. అప్పుడే అది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. అలా కాకుండా ఏదంటే అది తీస్తే, అది వెంటనే వేరే సినిమాలతో పోలిక వచ్చే అవకాశం ఉంది, అందుకే తొందరపడకూడదని భావిస్తున్నాను. మెగాస్టార్ ఇమేజ్‌కి తగ్గట్టుగా, ‘అఖండ’ స్థాయిని మించిన బలమైన, కొత్త కథ దొరికినప్పుడే మా కలయికలో సినిమా ఉంటుంది’’ అని బోయపాటి శ్రీను ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. చూద్దాం మరి.. మెగాస్టార్ చిరంజీవి, బోయపాటి కాంబినేషన్ సినిమా ఎప్పుడు ఫైనల్ అవుతుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
