Samantha Wedding: రాజ్‌తో పెళ్లి!.. ఫొటోలు పంచుకున్న సామ్..
sam-photos(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Samantha Wedding: రాజ్‌తో రెండో పెళ్లి!.. ఫొటోలు పంచుకున్న సామ్.. మాముల్గా లేవుగా..

Samantha Wedding: టాలీవుడ్ టాప్ హీరోయిన్ మరో సారి వివాహ బంధంలో కి అడుగుపెట్టారు. బాలీవుడ్ ప్రముఖులు రాజ్‌, సమంత సోమవారం ఉదయం తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఉన్న ప్రఖ్యాత ఇషా యోగా సెంటర్‌లో ఏడడుగులు వేశారు. ఈ వివాహ వేడుక అత్యంత గోప్యంగా, కేవలం కొంతమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. అందిన సమాచారం ప్రకారం, “వివాహం ఇషా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో సోమవారం ఉదయం జరిగింది.” అని ఒక అంతర్గత వర్గం వెల్లడించింది. ఈ వేడుకకు మొత్తం 30 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది. పెళ్లికూతురు సమంత ఎరుపు రంగు చీరలో మెరిసిపోయిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలను సంమంత ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఫేర్ చేశారు. దీనిని చూసిన అభిమానుల ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read also-Samantha Wedding: దర్శకుడు రాజ్ నిడమోరును పెళ్లి చేసుకున్న సమంత రూత్ ప్రభు!.. ఎక్కడంటే?

రాజ్‌, సమంత పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు ఆదివారం రాత్రి నుంచే మొదలయ్యాయి. ఈ పరిణామాల మధ్య రాజ్‌ మాజీ భార్య శ్యామలి దే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన ఓ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె, “నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తులు నిస్సహాయమైన పనులు చేస్తారు” (Desperate people do desperate things) అని ఓ అర్థం గల కొటేషన్‌ను పంచుకున్నారు. ఇది రాజ్‌, సమంత వివాహాన్ని ఉద్దేశించినదేనా అనే చర్చ అప్పటి నుంచి మొదలైంది. రాజ్‌, శ్యామలి దే 2022లోనే విడాకులు తీసుకున్నారని సమాచారం.

Read akso-Marriage Debate: తన మనవరాలి పెళ్లి విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జయా బచ్చన్.. ఏం అన్నారంటే?

రాజ్‌, సమంత మధ్య సాన్నిహిత్యం 2024 ఆరంభంలో మొదలైందని కథనాలు చెబుతున్నాయి. ఆ తర్వాత గత ఏడాదిగా సమంత ఏమాత్రం దాపరికాలు లేకుండా రాజ్‌తో కలిసి దిగిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలలో పంచుకుంటూ వచ్చారు. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఆ ఫొటోలు చెప్పకనే చెప్పాయి. ఇక సమంత గతంలో ప్రముఖ నటుడు నాగ చైతన్యను వివాహం చేసుకున్నారు. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత వారు విడిపోయారు. నాగ చైతన్య ఆ తర్వాత నటి శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు జరిగిన రాజ్‌-సమంత వివాహంతో, గత కొద్ది నెలలుగా నడుస్తున్న ఊహాగానాలకు తెరపడింది. బాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

Just In

01

Jogipet News: ప్రజల దృష్టిని ఆకర్షించేలా చేసిన ఓ యువకుడు.. గుర్రంపై వచ్చి నామినేషన్!

Shocking Video: 20 అడుగుల గోడ దూకి.. సింహాల బోనులోకి వెళ్లాడు.. తర్వాత ఏమైదంటే?

Modi vs Priyanka: ప్రధాని మోదీ వర్సెస్ ప్రియాంక గాంధీ… మాటల తూటాలు.. మోదీ ఏమన్నారో తెలుసా?

CM Revanth Reddy: హడ్కో ఛైర్మ‌న్ సంజ‌య్ కుల‌శ్రేష్ఠ‌తో సీఎం రేవంత్ భేటి.. కీలక అంశాలపై చర్చ

Viral Video: కార్పొరేట్ ఉద్యోగం వదిలి ఆటో డ్రైవర్ ను అయ్యా.. జీవితంలో చాలా పాఠాలు నేర్చుకున్నా.. వీడియో వైరల్