Tollywood: నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?
Rasha and Harshaali (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Tollywood: తెలుగు సినిమా పరిశ్రమ (టాలీవుడ్) నిరంతరం కొత్త ప్రతిభను ఆహ్వానిస్తూ, సరికొత్త అందాలతో కళకళలాడుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా మరో ఇద్దరు యువ నటీమణులు టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. వారి నేపథ్యం, అసాధారణమైన అందం, అభినయ సామర్థ్యం చూస్తే, వీరు రాబోయే కాలంలో టాలీవుడ్‌ను శాసించే కథానాయికలుగా మారడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఇద్దరు భామలు ఎవరో కాదు… రషా తడానీ (Rasha Thadani), హర్షాలీ మల్హోత్రా (Harshaali Malhotra). ముఖ్యంగా బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న కొత్త తరం నటీమణుల్లో రషా తడానీ ఒకరు. రషా బ్యాక్‌గ్రౌండ్ చూస్తే, ఆమె బాలీవుడ్‌లో ఇప్పటికే ఓ ఊపు ఊపేసింది. ప్రముఖ నటి, నిర్మాత రవీనా టాండన్ కుమార్తె అయిన రషా తడానీకి బాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆమె టాలీవుడ్‌లోకి రావడం సినీ ప్రేమికులకు ఆసక్తిని పెంచుతోంది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram) ద్వారా రషా తడానీ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో ఆమె నటన, గ్లామర్ పరంగా పూర్తి న్యాయం చేస్తుందని యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రషాకు ఉన్న స్టార్ వారసత్వం, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కచ్చితంగా టాలీవుడ్‌లో ఆమెకు మంచి భవిష్యత్తును అందిస్తాయని అంతా భావిస్తున్నారు.

Also Read- Mana Shankara Vara Prasad Garu: ‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేసింది.. ఏంటంటే..

హర్షాలీ మల్హోత్రా: ‘మున్నీ’ నుండి టాలీవుడ్ వరకు..

మరోవైపు, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన హర్షాలీ మల్హోత్రా కూడా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. 2015లో సల్మాన్ ఖాన్ నటించిన ‘బజరంగీ భాయిజాన్’ చిత్రంలో ‘మున్నీ’గా తన అమాయకమైన నటనతో దేశవ్యాప్తంగా హర్షాలీ పేరు మారుమోగింది. ఆ చిన్నారి ఇప్పుడు టీనేజ్‌లోకి అడుగుపెట్టి అద్భుతమైన అందంతో ఆకట్టుకుంటోంది. హర్షాలీ మల్హోత్రా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో, నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘అఖండ 2’ (Akhanda 2) లో ఒక కీలక పాత్రతో టాలీవుడ్‌కు పరిచయం కాబోతుంది. ఆమె ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించకపోయినా, ఆమెకు ఉన్న ఆకర్షణ, అందం చూస్తే, త్వరలోనే ఆమె తెలుగు చిత్రాలలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read- Harshaali Malhotra: తెలుగులో ఇష్టమైన హీరోలు ఎవరంటే..? ‘బజరంగీ భాయిజాన్’ ఫేమ్ చెప్పిన పేర్లు ఇవే!

కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు

ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త ముఖాలను, కొత్త నటనను కోరుకుంటూ ఉంటారు. ఇప్పటికే బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్ వంటి నటీమణులు టాలీవుడ్‌లో తమ సత్తా చాటుతున్న నేపథ్యంలో, ఇప్పుడు కొత్తగా వస్తున్న రషా తడానీ, హర్షాలీ జంట.. తప్పకుండా మంచి గుర్తింపును తెచ్చుకుంటారని, తమ టాలెంట్‌తో తెలుగు చిత్ర పరిశ్రమను దున్నేయడం ఖాయమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. వీరు ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తారో, ఎంతటి స్టార్‌డమ్‌ను సంపాదిస్తారో అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ‘అఖండ 2’ ప్రమోషన్స్‌లో హర్షాలి.. హీరోయిన్‌గా చేయడానికి రెడీ అని ఆఫర్ ఇచ్చేసింది కాబట్టి.. త్వరలోనే ఆమె హీరోయిన్‌గా కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం చూద్దాం.. చూద్దాం మరి ఆమెతో రొమాన్స్‌కు టాలీవుడ్‌లోని ఏ హీరో ముందు వరసలో ఉంటాడో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

IMDB 2026: ఐఎండిబి 2026లో మోస్ట్ ఎవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ ఇదే..

Huzurabad: హుజురాబాద్ పురపాలక సంఘం పరిధిలో.. వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదల!

MP Dharmapuri Arvind: కేటీఆర్ మాది గాలివాటమా? మీ చెల్లిని అడుగు.. ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు!

BJP Group Politics: బీజేపీలో గ్రూప్ పాలిటిక్స్.. ఆ తరహా రాజకీయాలుంటే తప్పేంటి.. బీజేపీ ఎంపీల భిన్న స్వరాలు!

Naveen Polishetty: క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే.. అవుట్ పుట్ ‘రాజు’లా ఉంటుంది