The Girlfriend OTT: ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
The Girlfriend OTT (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

The Girlfriend OTT: ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. డిటైల్స్ ఇవే!

The Girlfriend OTT: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna), టాలెంటెడ్ నటుడు దీక్షిత్ శెట్టి (Dheekshith Shetty) జంటగా నటించిన ఎమోషనల్ డ్రామా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend). ఈ సినిమా ఓటీటీ (OTT) స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. ఈ చిత్రం 5 డిసెంబర్, 2025 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది.

Also Read- Harshaali Malhotra: తెలుగులో ఇష్టమైన హీరోలు ఎవరంటే..? ‘బజరంగీ భాయిజాన్’ ఫేమ్ చెప్పిన పేర్లు ఇవే!

రష్మిక మందన్నా నటనకు అంతా ఫిదా..

నవంబర్ 7న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ప్రేక్షకుల, విమర్శకుల నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా భూమా దేవి పాత్రలో రష్మిక మందన్నా అద్భుతమైన, భావోద్వేగభరితమైన నటనకు ప్రశంసలు దక్కాయి. అమాయకత్వం, ప్రేమ, భయం, కోపం వంటి అనేక భావాలను ఆమె కళ్ళతోనే పలికించి ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ పాత్ర రష్మిక కెరీర్‌లోనే అత్యంత లోతైన పెర్ఫార్మెన్స్‌గా నిలిచింది. విక్రమ్ పాత్రలో దీక్షిత్ శెట్టి నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ల సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరించారు. హేషమ్ అబ్దుల్‌ వహాబ్ అందించిన సంగీతం, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలం. థియేటర్లలో ఈ భావోద్వేగ ప్రయాణాన్ని మిస్ అయిన ప్రేక్షకులు, అలాగే ఇతర భాషల ఆడియన్స్ ఇప్పుడు డిసెంబర్ 5 నుండి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రాన్ని ఆస్వాదించవచ్చు.

Also Read- Mana Shankara Vara Prasad Garu: ‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేసింది.. ఏంటంటే..

సినిమా కథ ఇదే.. (The Girlfriend Story)

‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా కథ, భూమా దేవి (రష్మిక మందన్నా) అనే అమాయక యువతి చుట్టూ తిరుగుతుంది. ఇంగ్లీష్ లిటరేచర్‌లో పీజీ పూర్తి చేయడానికి హైదరాబాద్ వచ్చిన భూమ, కాలేజీలో విక్రమ్ (దీక్షిత్ శెట్టి)ను పరిచయం చేసుకుంటుంది. వారి స్నేహం క్రమంగా ప్రేమగా మారుతుంది. అయితే, ఈ ప్రేమ బంధం ముందుకు సాగేకొద్దీ విక్రమ్‌లోని టాక్సిక్ (Toxic) స్వభావం, అతి నమ్మకం, నియంత్రణ ధోరణి బయటపడుతుంది. తనను తానుగా స్వీకరించని ఈ బంధీఖానా లాంటి రిలేషన్‌షిప్‌లో భూమా మానసికంగా ఎంతగానో నలిగిపోతుంది. ప్రేమ పేరుతో స్వేచ్ఛను కోల్పోవడం, బాయ్‌ఫ్రెండ్ అధికారం, అనుమానాలు ఎదుర్కోవడంతో ఆమె జీవితం సంక్లిష్టంగా మారుతుంది. ఈ విషపూరిత బంధం నుంచి భూమా ఎలా బయటపడింది? తన ఆత్మగౌరవాన్ని, స్వేచ్ఛను ఎలా తిరిగి సాధించుకుంది? అనే సంఘర్షణతో ఈ కథ సాగుతుంది. నేటి ఆధునిక ప్రేమ సంబంధాల్లోని ఒత్తిళ్లు, భావోద్వేగాల గురించి ఈ చిత్రం సున్నితంగా చర్చించింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Hyderabad Crime: క్షణికావేశం..బంధాన్ని తుంచేసింది..పెగ్గు కొసం అన్నను చంపిన తమ్ముడు.. నాచారంలో దారుణ ఘటన!

The RajaSaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మొదటి వారం వసూళ్లు ఎంతంటే?.. కింగ్ సైజ్ బ్లాక్‌బాస్టర్..

Dragon Movie: ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్.. వరుసగా రెండోసారి..

Bapatla SP: సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఆ జిల్లా ఎస్పీ కీలక సూచనలు!

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా ఏం మిగిలింది?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు