Heavy Rains: దిత్వా తుఫాన్.. ఏపీలో భారీ వర్షాలు
Heavy Rains ( Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Heavy Rains: దిత్వా తుఫాన్.. భారీ వర్షాలు, ఈదురుగాలులతో ఏపీలో రెడ్ అలర్ట్

Heavy Rains: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దిత్వా’ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళన వాతావరణం నెలకొంది. తుపాను తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అప్రమత్తమై రాష్ట్రంలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.

ఇటీవల మొంథా తుపాను ప్రభావం నుండి కోలుకుంటున్న రాష్ట్రానికి మరోసారి దిత్వా తుపాను రూపంలో కొత్త ముప్పు ఎదురవ్వనుంది. తుపాను కదలికలు, దాని దిశ, తీవ్రతను పర్యవేక్షిస్తున్న వాతావరణ నిపుణుల ప్రకారం, ప్రస్తుతం దిత్వా నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర దిశగా కదులుతోంది. తుపాను గాలుల వేగం గంటకు 55 కిలోమీటర్లుగా నమోదైంది.

తాజా అంచనాల ప్రకారం, తుపాను ఉత్తర–వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం ఉదయం తమిళనాడు–పుదుచ్చేరి తీరానికి 60 కిలోమీటర్ల దూరానికి చేరుకుంటుంది. సాయంత్రానికి ఈ దూరం 25 కిలోమీటర్లకు తగ్గే అవకాశం ఉంది. అయితే తుపాను తీరాన్ని దాటే అవకాశాలు ఎక్కువగా లేవని, తీరం వెంట ప్రయాణిస్తూ సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇవాళ సాయంత్రం వరకు తుపాను తీవ్రత కొనసాగి, తర్వాత అది వాయుగుండంగా మారే అవకాశముంది.

అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ రోజు (ఆదివారం) శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని పేర్కొంది. అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా తెలిపింది.

సోమవారం డిసెంబర్ 1 న ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా, కోనసీమ, తూర్పు & పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.

మంగళవారం డిసెంబర్ 2 న నెల్లూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ సూచించింది.

దిత్వా ప్రభావంతో తీర ప్రాంతాల్లో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సముద్రం తీవ్రంగా అలజడిగా మారిన కారణంగా సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచనలు జారీ చేశారు. అలాగే, కృష్ణపట్నం పోర్టుకు మూడో నంబర్ హెచ్చరిక, మిగిలిన పోర్టులకు రెండో నంబర్ హెచ్చరికలు జారీ అయ్యాయి.

Just In

01

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!

RTC Officer Died: ఆర్‌టీసీ డిప్యూటీ ఆర్‌ఎం వెంకట్ రెడ్డి పాడె మోసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి