Jagannath Movie: హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా రాయలసీమ భరత్ రూపొందించిన చిత్రం ‘జగన్నాథ్’. భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పీలం పురుషోత్తం నిర్మాణంలో, భరత్, సంతోష్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రాయలసీమ భరత్ సరసన హీరోయిన్లు – నిత్యశ్రీ, ప్రీతి, సారా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘జగన్నాథ్’ చిత్రానికి సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు జనాల్లో మంచి క్యూరియాసిటీని పెంచాయి. ముఖ్యంగా, హీరో భరత్ స్వయంగా జనాల్లోకి వెళ్లి, డిఫరెంట్‌గా ప్రచారం చేస్తూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నారు.
Read also-Bigg Boss 9 Telugu: ఈ రోజు బిగ్ బాస్ టాస్క్‌లో ఎక్కువ మందిని వెన్ను పోటు పొడిచింది ఎవరంటే?
విడుదల ఎప్పుడంటే?
తాజాగా, చిత్ర యూనిట్ ‘జగన్నాథ్’ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌లను విడుదల చేసింది. ఈ సినిమాను డిసెంబర్ 19న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. విడుదలైన పోస్టర్లను బట్టి చూస్తే, ఈ చిత్రం యాక్షన్, లవ్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని అర్థమవుతోంది. పోస్టర్లలో హీరో భరత్ ఇంటెన్స్ లుక్, రక్తంతో నిండిన సన్నివేశాలు చూస్తుంటే, ఇందులో యాక్షన్ డోస్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో, హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ఈ చిత్రంలో రాయలసీమ భరత్, నిత్యశ్రీ, ప్రీతి, సారా, అజయ్, బాహుబలి ప్రభాకర్, సత్యప్రకాష్, సమ్మెటగాంధీ, జబర్దస్త్ అప్పారావు, షేకింగ్ శేషు, అంబటిశ్రీనివాస్, ఎఫ్. ఎం బాబాయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ‘జగన్నాథ్’ చిత్రానికి షేక్ వలి, క్రాంతి కుమార్ సినిమాటోగ్రాఫర్‌లుగా, శేఖర్ మోపూరి సంగీత దర్శకుడిగా పనిచేశారు. నలుగురు హీరోయిన్లు, బలమైన యాక్షన్, లవ్ అంశాలతో తెరకెక్కిన ‘జగన్నాథ్’ డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

