Ravi Teja: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు కిశోర్ తిరుమల కాంబినేషన్‌లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి తాజాగా మొదటి సింగిల్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో, మొదటి పాటపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిర్మాతలు విడుదల చేసిన ఈ సింగిల్ ప్రోమో, సినిమాలో వినోదాన్ని, సంగీతాన్ని ఏ స్థాయిలో ఆస్వాదించవచ్చో తెలియజేసింది. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రోమో.. పాటలో ఉన్న ట్యూన్, రిథమ్‌ను పరిచయం చేస్తూ, రవితేజ మార్క్ ఎనర్జీ, స్టైల్‌ను ప్రదర్శిస్తుంది. పూర్తి పాట కోసం ఎదురుచూసేలా ఈ ప్రోమో క్యూరియాసిటీని పెంచింది.
Read also-Bigg Boss 9: ఫ్యామిలీ వీక్ తర్వాత బిగ్ బాస్ సభ్యులను ఇబ్బంది పెట్టిన సంజన.. ఎగ్జిట్ ఖాయమేనా?
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో రవితేజ పాత్ర పేరు ‘రామసత్యనారాయణ’ అని, అతని జీవితంలోని ఇద్దరు ఆడవాళ్లు అడిగిన రెండు ప్రశ్నలకు సమాధానం వెతకడం ఈ సినిమా ప్రధానాంశమని అర్థమైంది. ఆ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి గూగుల్, ఏఐలను అడిగినా, అనుభవం ఉన్న మగవాళ్లు కూడా సమాధానం చెప్పలేకపోయారని రవితేజ చెప్పే సంభాషణ హాస్యాన్ని పండిస్తుంది. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి ఫీల్ గుడ్ చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కిశోర్ తిరుమల, ఈసారి రవితేజ ఎనర్జీకి తగిన వినోదాన్ని, కుటుంబ బంధాలను మేళవించి తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే క్లాస్ టైటిల్ ఉన్నప్పటికీ, సినిమా మాత్రం పక్కా మాస్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని తాజా అప్‌డేట్‌లు స్పష్టం చేస్తున్నాయి.
Read also-Akhanda Ticket: బాలయ్య ‘అఖండ 2’ మొదటి టికెట్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. క్రేజ్ అలాంటిది..
ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కొత్త సింగిల్ ప్రోమోతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఈ పాటకు సంబంధించి పుల్ లిరికల్ వీడియోను ఇప్పుడు విడుదల చేయనున్నారో కూడా తెలిపారు నిర్మాతలు. ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియే.. డిసెంబర్ 1 ఉదయం 10 :08 గంటలకు విడుదల చేయనున్నారు. దీంతో రవితేజ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సాంగ్ కూడా మంచి ఎనర్జిటిగ్ గా ఉండటంతో ఈ సినిమా విడదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

