Uday Kiran: ఉదయ్ కిరణ్ గురించి చెబుతూ ఎమోషనల్ దర్శకుడు..
aaditya-vn(x)
ఎంటర్‌టైన్‌మెంట్

Uday Kiran: ఉదయ్ కిరణ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన ‘మనసంతా నువ్వే’ దర్శకుడు.. ఉంటే అలా చేసేవాడిని..

Uday Kiran: దివంగత నటుడు ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ హిట్ చిత్రాలలో ‘మనసంతా నువ్వే’ సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 2001లో విడుదలైన ఈ రొమాంటిక్ డ్రామా, ప్రేక్షకుల హృదయాలను హత్తుకుని అప్పటి యువతకు ఒక ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీగా నిలిచింది. తాజాగా ఆ సినిమా దర్శకుడు వీఎన్ ఆదిత్య ఒక మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఉదయ్ కిరణ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. అలాంటి వ్యక్తి ఎలా ఉండేవాడో చెబుతూ కంటతడి పెట్టకున్నారు. ఉదయ్ కిరణ్ ను మిస్ అవుతున్నారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు దర్శకుడు ఆదిత్య ఇలా స్పందించారు. ఆయన గనుక ఇప్పుడు ఉంటే చాలా బాగుండేది. నాకు ఆయనతో సినిమాలు తీయాల్సి వచ్చినపుడు ఎంతో చనువుగా వెళ్లి డేట్స్ తీసుకువచ్చే వాడిని. ఇప్పుడు వున్న నటుల వద్దకు వెళ్లాలి అంటే తెలియదు కదా అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు.

Read also-Bigg Boss9: భరణి అలా అన్నందుకు ఫైర్ అవుతున్న తనూజా.. సంచాలక్ విషయంతో బిగ్ ట్విస్ట్ ..

చివరిగా మీ మధ్య జరిగిన మీకు గుర్తుకు వున్న సంభాషణ గురించి చెప్పండి అని యాంకర్ అడిగారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఉదయ్ కిరణ్ తో చివరిగా మాట్లాడింది, ‘అత్తారింటికి దారేది’ సినిమా గురించి. ఆ సినిమా విడుదలైన తర్వాత ఉదయ్ కాల్ చేశారు, దాదాపు ఆరు గంటల సేపు మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ లాంటి మాస్ హీరో కుటుంబ కథా చిత్రం తీస్తే ఏ రేంజ్ లో హిట్ అవుతుందో ఆ సినిమా నిరూపించిందని, అలాంటి సినిమా వస్తే ఖచ్చితంగా సినిమా చేస్తానని చెప్పుకొచ్చారు. అప్పటి వరకూ మాస్ సినిమాలు చేయాలన్న తన ఆలోచనలను ‘అత్తారింటికి దారేది’ పూర్తిగా మార్చేసింది. ఆ సినిమా విజయం సాధించినందుకు తెగ ఆనంద పడిపోయాడు’ అంటూ చెప్పుకొచ్చారు.

Read also-Mandhana Wedding: స్మృతి మంధాన పెళ్లి వాయిదా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్.. అసలు విషయం ఇదే..

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం గురించి కూడా చెప్పుకొచ్చారు. ‘సినిమా ఇండస్టీలో అంతటి స్టార్డమ్ చూసిన తర్వాత కూడా అలా చేయడం నాకు చాలా కోపం తెప్పించింది. ఉదయ్ చూడాల్సిన స్టార్ డమ్ మొత్తం చూసేశారు. ఆ తర్వాత లోతులు కూడా చూశారు. అప్పుడు అలాంటి నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు. కానీ అన్నీ బాగున్నపుడు, ఆయన సంతోషంగా ఉన్నపుడు మాత్రం అలా చేశారు. ఇది తర్వాత వచ్చేవారికి ఇది అంత సెట్ కాదు అని సంకేతాన్ని ఇస్తుంది. ఏది ఏమైనా ఆయన చార్మింగ్ హీరో కొంత సేపు మాట్లాడితే ఆయన ఏంటో తెలిసిపోతుంది.

Just In

01

Medaram Jatara 2026: మేడారం భక్తులకు గుడ్ న్యూస్.. జాతరలో ఆ భయం లేదిక..?

Naresh Birthday: నరేష్ 30 నిమిషాలు కేటాయిస్తే గొప్ప.. పవిత్ర లోకేష్.. ఏం చేస్తారంటే?

University Recruitment: ఉద్యాన వర్సిటీ ప్రతిష్ట దెబ్బతీస్తే ఉపేక్షించం.. నియామకాలపై కుట్రలెందుకు..?

Gadwal News: గత రికార్డును బ్రేక్ చేసేలా.. విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న గద్వాల ఉపాధ్యాయులు

Phone Tapping Case: రెండేళ్ల నుంచే ఒకటే డ్రామా.. ఇంకెన్నాళ్లు ఈ సీరియల్.. సీఎంపై హరీశ్ రావు ఫైర్!