Bigg Boss9: భరణి అలా అన్నందుకు ఫైర్ అవుతున్న తనూజా..
big-boss-83(x)
ఎంటర్‌టైన్‌మెంట్

Bigg Boss9: భరణి అలా అన్నందుకు ఫైర్ అవుతున్న తనూజా.. సంచాలక్ విషయంతో బిగ్ ట్విస్ట్ ..

Bigg Boss9: బిగ్ బాస్ సీజన్ 9 రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. 83వ రోజు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ బిగ్ బాస్ ఇంటి సభ్యల మధ్యలో గొడవకు దారితీసింది. ఈ రోజు స్పాన్సర్ టాస్క్ ఇచ్చారు. అందులో బిగ్ బాస్ సభ్యలు రెండు వర్గాలుగా విడిపోయి ఈ టాస్క్ పూర్తి చెయ్యలి. టీం సభ్యలు టేబుల్ పై మరకలు వేస్తారు. వాటిని చేతి రుమాళ్లతో క్లీన్ చేసి మిషిన్ ద్వారా క్లీన్ చేయ్యాలి. అనంతరం వాటిని బ్రాండ్ కనిపించేలా ఆరెయ్యాలి. ఈ టాస్క్ లో భరణి టీం గెలవడంతో వ్యతిరేక టీంలో ఉన్న తనూజా.. భరణిపై ఫైర్ అయ్యారు. ప్రతిసారీ తనకే అన్యాయం జరుగుతుందంటూ సంచాలక్ ను తిట్టడం మెదలు పెట్టింది. దీంతో సంచాలక్ కూడా సీరియస్ అయింది. ప్రతిసారి ఎవరికీ లేని ప్రాబ్లమ్ తనకే వస్తుందంటూ భరణి కూడా మండిపడ్డారు. అయినా తనూజ మాత్రం ఎక్కడా తగ్గలేదు. అందరినీ తిట్టుకుంటూ ఉంటుంది. చలా సేపు భరించి భరణి ఆమెతో కూడా వారించారు. ప్రతిసారి నీలాగా నోటికి వచ్చింది నేను వాగను ఏం అవసరమే అదే మాట్లాడతా.. అంటూ చెప్పుకొచ్చారు. దీనికి తనూజకు కోపం వచ్చింది. వాగను అని మాట్లాడకండి అంటూ భరణితో వారించింది. దీనితో భరణీ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఆమెతో కూడా బలంగా వాదించారు.

Read also-iBomma Case: విచారణ సమయంలో మారిపోతానంటున్న ఐబొమ్మ రవి.. ఎందుకంటే?

చివరకు వీరిద్దరూ చాలా సేపు ఒకరినొకరు వారించుకున్నారు. దీంతో షో మొత్తం చాలా గందరగోళంగా మారింది. సంచాలక్ కూడా ఈ విషయంలో సీరియస్ అయ్యారు. ప్రతి సారి నీ దగ్గరే ప్రాబ్లమ్ వస్తుంది అంటూ తనూజను హెచ్చరించింది. దీంతో తనూజ మరింత రెచ్చిపోయింది. సీజన్ మొత్తం సంచాలక్ ను ఒకరికే ఇవ్వుండి.. వేరేవాళ్లకు ఆ అవకాశం ఇవ్వకండి అంటూ మండిపడ్డారు. దీంతో సంచాలక్ కూడా కోపగించుకుని, తనను తర్వాత నుంచి సంచలక్ ఇవ్వవద్దు అంటూ బిగ్ బాస్ కు తెలిపింది. అక్కడితో ఈ రోజు ప్రోమో ముగిసింది. రోజు రోజుకూ రసవత్తరంగా సాగుతున్న ఈ షో లో మొదటి ప్రోమో నే ఇలా ఉంటే రెండో ప్రోమో ఎలా ఉండబోతుందో అని చూసేందుకు బిగ్ బాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

Medaram Jatara 2026: మేడారం భక్తులకు గుడ్ న్యూస్.. జాతరలో ఆ భయం లేదిక..?

Naresh Birthday: నరేష్ 30 నిమిషాలు కేటాయిస్తే గొప్ప.. పవిత్ర లోకేష్.. ఏం చేస్తారంటే?

University Recruitment: ఉద్యాన వర్సిటీ ప్రతిష్ట దెబ్బతీస్తే ఉపేక్షించం.. నియామకాలపై కుట్రలెందుకు..?

Gadwal News: గత రికార్డును బ్రేక్ చేసేలా.. విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న గద్వాల ఉపాధ్యాయులు

Phone Tapping Case: రెండేళ్ల నుంచే ఒకటే డ్రామా.. ఇంకెన్నాళ్లు ఈ సీరియల్.. సీఎంపై హరీశ్ రావు ఫైర్!