Deeksha Divas: కేటీఆర్, హరీశ్, కవిత ఆసక్తికర వ్యాఖ్యలు
Deeksha Divas (Image Source: Twitter)
Telangana News

Deeksha Divas: కేసీఆర్ నిరాహార దీక్షకు నేటితో 16 ఏళ్లు.. కేటీఆర్, హరీశ్, కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Deeksha Divas: తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కొత్త రాష్ట్ర ఆవిర్భవంలో అత్యంత కీలక ఘట్టంగా మారింది. అయితే కేసీఆర్ ఆ దీక్ష చేపట్టి నేటితో (నవంబర్ 29) సరిగ్గా 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఆనాడు కేసీఆర్ చేసిన అద్భుత పోరాటాన్ని గుర్తు చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, జాగృతి అధ్యక్షురాలు కవిత నెట్టింట ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ మాటలు బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

‘ సావుతో సమరానికి పోయినావే’

కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు 16 ఏళ్లు పూర్తైన సందర్భంగా కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. మా బతుకు మారాలని సావుతో సమరానికి పోయినావే. ఓ బాపు.. నువ్వు లేకపోతే ఏడుండే ఈ తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేశారు’ అంటూ కేటీఆర్ రాసుకొచ్చారు. అలాగే అప్పటి కేసీఆర్ దీక్షకు సంబంధించిన దృశ్యాలు తన వ్యాఖ్యలకు జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను బీఆర్ఎస్ శ్రేణులు విపరీతంగా ట్రెండ్ చేస్తున్నాయి.

‘అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు’

మరోవైపు మాజీ మంత్రి హరీశ్ రావు.. కేసీఆర్ దీక్షపై స్పందిస్తూ ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో నినాదంతో 2009 నవంబర్‌ 29న ప్రారంభించిన ఆమరణ దీక్ష, ఉద్యమ గతిని మలుపు తిప్పింది. సరికొత్త చరిత్రకు నాంది పలికింది. తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసింది. రానే రాదు, కానే కాదు అన్న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సబ్బండ వర్గాలను ఏకం చేసి సుసాధ్యం చేసి చూపిన ఘన చరిత కేసిఆర్ ది. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష సాధనకు అలుపెరగని పోరాటం చేసిన చరిత్ర కేసీఆర్‌ ది. పదవులే కాదు, తెలంగాణ కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడ్డ ధీరత్వం కేసీఆర్ ది’ అని హరీశ్ రావు అన్నారు.

Also Read: SEC Warning: గ్రామాల్లో జోరుగా ఏకగ్రీవాలు.. సర్పంచ్ సీటుకి వేలం పాటలు.. ఈసీ స్ట్రాంగ్ వార్నింగ్

వీరోచిత సంతకం..

తెలంగాణ అజరామర చరిత్రకు వీరోచిత సంతకం కేసీఆర్ అని హరీశ్ రావు పొగడ్తల వర్షం కురిపించారు. ‘నాలుగు కోట్ల ప్రజల్లో మార్మోగే ‘జై తెలంగాణ’ అనే రణ నినాదం కేసీఆర్. నవంబర్‌ 29న కేసీఆర్‌ దీక్ష లేకుండా డిసెంబర్‌ 9 ప్రకటన లేదు. డిసెంబర్‌ 9 ప్రకటన లేకుండా తెలంగాణ రాష్ట్రం లేదు. దశాబ్దాల పోరాటంతోనే తెలంగాణ సిద్ధించింది తప్ప పాలకుల దయాదాక్షిణ్యాలతో కాదన్నది అక్షర సత్యం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన కెసిఆర్ గారి దీక్షా కాలం ఉద్యమ జ్ఞాపకాలు నా గుండెలో పదిలంగా ఉన్నాయి. జై తెలంగాణ అని నినదిస్తున్నాయి. తెలంగాణ స్ఫూర్తిని నిత్యం రగిలిస్తున్నాయి’ అంటూ ఉద్యమ కాలం నాటి అనుభవాలు తెలియజేసే వీడియోను హరీశ్ రావు ఎక్స్ లో పంచుకున్నారు.

కవిత రియాక్షన్ ఇదే..

మరోవైపు కేసీఆర్ తనయ, జాగృతి అధ్యక్షురాలు కవిత సైతం ఎక్స్ వేదికగా స్పందించారు. ఒక యోధుని దీక్ష.. అమరుల త్యాగం.. యావత్ తెలంగాణ జాతిని మేలుకొల్పింది. ఉద్యమ స్ఫూర్తిని నింపిది. తెలంగాణ ఉద్యమాన్ని విజయపథంవైపు నడిపింది. రాష్ట్ర సాధనకు దీపమైంది’ అంటూ కవిత ఎక్స్ లో రాసుకొచ్చారు. జై తెలంగాణ.. జైజై తెలంగాణ అంటూ దాన పోస్టును ముగించారు.

Also Read: Rapido Driver – ED: ర్యాపిడో డ్రైవర్ ఖాతాకు రూ.331 కోట్లు.. రిసార్టులో విలాసవంతమైన వివాహం.. తీరా తెలిసిందేమంటే?

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!