Central Minister Bandi Sanjay
Politics

Hyderabad: రాష్ట్రంలో పాలన అటకెక్కింది

  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శ
  • బీజేపీ ఎమ్మెల్యేలకు నిధులివ్వడం లేదు
  • రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరి కాదు
  • మేము ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తాం
  • ఎమ్మెల్యే లు పార్టీ మారడం వారి విజ్ఞత పై ఆధారపడి ఉంటుంది
  • జనసేన తో కలిసి నడిచే విషయం అధిష్టానం చూసుకుంటుంది

Central minister Bandi Sanjay criticise congress not ruling properly
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు నియోజకవర్గాలకు నిధులు కేటాయించకపోవడం దారుణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలన అటకెక్కిందని కామెంట్ చేశారు. కేవలం వంద రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చేసిందని అన్నారు. ఆరు గ్యారంటీల అమలుపై అన్ని చోట్ల చర్చ మొదలైదని పేర్కొన్నారు. పల్లెల్లో ప్రజలు రూ.4 వేల పెన్షన్, ప్రతి మహిళకు రూ.2,500 గురించి కాంగ్రెస్ లీడర్లను నిలదీస్తున్నారని గుర్తు చేశారు. అదేవిధంగ రైతు భరోసా రూ.15వేలు ఎప్పుడిస్తారంటూ అన్నదాతలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారని మండిపడ్డారు. ఇక నియోజవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే సర్కార్ నిధులు విడుదల చేస్తోందని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధి సీఎం రేవంత్‌రెడ్డికి వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోవట్లేదని మండిపడ్డారు.

బీజేపీ ఎమ్మెల్యేలపై వివక్ష

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మంచిది కాదని ఫైర్ అయ్యారు. కేంద్రంలో తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నా.. తమ ఎమ్మెల్యేల పట్ల వివక్ష చూపడం సరికాదన్నారు. ఇక పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరాన్ని బట్టి కండువాలు మార్చడం వారి విజ్ఞతపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఇక తెలంగాణలో జనసేన పొత్తు గురించి ప్రశ్నించగా.. రాష్ట్రంలో జనసేనతో కలిసి నడిచే విషయాన్ని తమ పార్టీ అధిష్టానం చూసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?