Local Body Elections: తొలివిడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ శనివారంతోముగిస్తుంది. ఒక్కరోజే గడువు ఉండటంతో భారీగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో 4236 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వార్డు37440 ఉన్నాయి. రెండో రోజూ సర్పంచ్ స్థానాలకు 4901 నామినేషన్లు దాఖలు అయ్యాయి. వార్డులకు 9643 నామినేషన్లు వచ్చాయి. రెండ్రోజులుగా4236 గ్రామపంచాయతీలకు గాను 8198 నామినేషన్లు రాగా, 37440 వార్డులకు 11502 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Also Read: Local Body Elections: మెదక్ ఉమ్మడి జిల్లా సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల కోలాహలం!
రాష్ట్రవ్యాప్తంగా..
రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఆదిలాబాద్ జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 214 దరఖాస్తులు, కొత్తగూడెం జిల్లాలో 116 దరఖాస్తులు, హనుమకొండలో 84, జగిత్యాలలో 248, జనగాం 153, జయశంకర్ భూపాలపల్లిలో 48, గద్వాలలో 100, కామారెడ్డిలో 253, కరీంనగర్ లో 197, ఖమ్మంలో 157, ఆసిఫాబాద్ లో 111, మహబూబాబాద్ లో 161, మహబూబ్ నగర్ లో 143, మంచిర్యాలలో 99, మెదక్ 152, ములుగు 41, నాగర్ కర్నూల్ లో 231, నల్లగొండలో 363, నారాయణపేటలో 76, నిర్మల్ లో 188, నిజామాబాద్ లో 164, పెద్దపల్లిలో 184, సిరిసిల్లలో 149, రంగారెడ్డిలో 203, సంగారెడ్డిలో 191, సిద్దిపేటలో 194, సూర్యాపేటలో 159, వికారాబాద్ లో 178, వనపర్తిలో 58, వరంగల్ లో 103, యాదాద్రిలో 183 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: Tallest Ram Statue: మరో అరుదైన ఘట్టం.. 77 అడుగుల శ్రీరాముడి విగ్రహం.. ఆవిష్కరించిన మోదీ

