Shivacharan Reddy: మెదక్ పట్టణంలో TNGOS హాల్ లో యువజన కాంగ్రెస్ మెదక్ జిల్లా అధ్యక్షులు పరశారం గౌడ్ అద్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర అధ్యక్షులు శివచరన్ రెడ్డి, జాతీయ కార్యదర్శి భవ్య సింగ్ పాల్గొన్నారు, ఇ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ రాబోయే పంచాయితి ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని తెలిపారు, యువజన కాంగ్రెస్ కు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్లు చాలా అవకాశాలు ఇస్తున్నారు దానిలో భాగంగానే మొన్న ప్రకటించిన డీసీసీ అధ్యక్షులల్లో 8 మందికి యువజన కాంగ్రెస్ వారికి అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు.
Also Read: CM Revanth Reddy: చైనా జపాన్‌ల స్థాయి అభివృద్ధే మన టార్గెట్: సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ను బలోపేతం చేయడం పైన దృష్టి
అదే విధంగా ఒక MLC, ఒక రాజ్య సభ ఎంపీ, అలాగే స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా అన్ని విభాగాలలో అవకాశాలు ఇస్తున్నారు, కావున ప్రతి ఒక్కరు కష్టపడలని తెలియచేశారు, ఇంచార్జ్ భావ్య గారు మాట్లాడుతూ మా కుటుంబంలో ఎవరు రాజకీయాలలో లేరు, ఐన కూడా ఒక సాధారణ మహిళానైన నాకు జాతీయ స్థాయిలో అవకాశం కలిపించింది అంటే అది ఒక్క యువజన కాంగ్రెస్ కు మాత్రమే చెందుతుందని వారు తెలియచేశారు, కావున జిల్లాలో యువజన కాంగ్రెస్ ను బలోపేతం చేయడం పైన దృష్టి పెట్టాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ కన్వీనర్ మహేందర్ రెడ్డి . భవ్య సింగ్ యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి & తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ RGPRS – జాతీయ కార్యవర్గ సభ్యుడు (NOB) – మహేందర్ రెడ్డి..ప్రధాన కార్యదర్శి సంతోష్ తరుణ్,- రామచందర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు – పరశురామ్ గౌడ్ మెదక్ అసెంబ్లీ అధ్యక్షుడు – భరత్ గౌడ్ నర్సాపూర్ అసెంబ్లీ అధ్యక్షుడు – సందీప్ జిల్లా కమిటీ, అసెంబ్లీ కమిటీ అన్ని మండల అధ్యక్షులు, పెద్ద ఎత్తున్న యువజన కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
Also Read: CM Revanth Reddy: గ్లోబల్ సమ్మిట్‌కు మోదీని ఆహ్వానించాలి: సీఎం రేవంత్ రెడ్డి

