Akhanda 2 Teaser: బాలయ్య బాబు ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘అఖండ 2 తాండవం’. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో మాసివ్ టీజర్ రాబోతుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టర్ ను విడుదల చేశారు మూవీటీం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్లు ప్రేక్షకుల్లో ఎంత ఇంపేక్ట్ చూపించాయో తెలిసిందే. మరో టీజర్ వస్తుందన్న వార్త బాలయ్య బాబు అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ టీజర్ నవంబర్ 28 సాయంత్రం 7:52 గంటలకు విడుదల చేయనున్నారు నిర్మాతలు. ఇప్పటికే థమన్ అందించిన పాటలు పాన్ ఇండియా స్థాయిలో చాట్ బాస్టర్లుగా నిలిచాయి. ప్రస్తుతం మరో టీజర్ వస్తుందని నిర్మాతలు చెప్పడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి టీజర్‌లో అఘోరా పాత్రపై దృష్టి సారించగా, ఈ తాజా టీజర్ మాస్ స్వాగ్‌తో కూడిన మరో పాత్రను పరిచయం చేస్తుందని టాక్ వినిపిస్తుంది.
Read also-Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ తన పిల్లల విషయంలో నెక్స్ట్ ప్లాన్ ఇదేనా.. ఇప్పటి నుంచే..
సనాతన ధర్మం..
ఈ సినిమా కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మాత్రమే కాకుండా, సనాతన ధర్మం, దేశభక్తి వంటి అంశాలను కూడా ప్రస్తావిస్తుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. “ఏ దేశంలోనైనా ఏ లోకంలోనైనా ఉండేది ఒక మతం. ఇక్కడ భారతదేశంలో ఉండేది సనాతన హైందవ ధర్మం అనే ధర్మం” వంటి సంభాషణలు సినిమాలోని గంభీరమైన సందేశాన్ని చాటిచెప్పాయి. దేశంపైకి వచ్చే బాహ్య శక్తులను, దుష్టశక్తులను అఖండ పాత్ర ఎలా ఎదుర్కొంటుందనేది ప్రధానాంశంగా ఉండబోతోందని తెలుస్తోంది. త్రిశూలం ఝుళిపిస్తూ బాలకృష్ణ చేసిన భయంకరమైన యాక్షన్ సీన్స్ శివతాండవాన్ని గుర్తుచేశాయి. ఇప్పటికే ఈ సినిమా గురించి దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ఈ సినిమా ఒక చిత్రం అయితే కాదు. ఇది భారత దేశ సోల్ అంటూ ప్రచార కార్యాక్రమాల్లో చెప్పుకొచ్చారు.
Read also-Venkatesh Birthday: విక్టరీ వెంకటేష్ పుట్టినరోజుకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్న నిర్మాతలు.. ఏంటంటే?
ప్యాన్-ఇండియా రేంజ్
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించబడిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి శక్తివంతమైన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సంయుక్త మీనన్ కథానాయికగా నటించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 5, 2025న విడుదల కానుంది. ముఖ్యంగా, ‘అఖండ 2: తాండవం’ 3D ఫార్మాట్‌లో కూడా విడుదల అవుతుండడం ప్రేక్షకులకు మరో ప్రత్యేక ఆకర్షణ. బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబో మరో బ్లాక్‌బస్టర్‌ను అందించి, బాలయ్యను ప్యాన్-ఇండియా స్థాయిలో నిలబెడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా కోసం ప్రచారం నిర్వహించారు బాలయ్య బాబు.
Brace yourselves for the DIVINE FURY 🔱🔥#Akhanda2 MASSIVE THAANDAVAM TEASER out today at 7.52 PM ❤🔥
In cinemas worldwide on December 5th.#Akhanda2Thaandavam
‘GOD OF MASSES’ #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial @MusicThaman @14ReelsPlus @iamsamyuktha_… pic.twitter.com/0oJdvw51sf— 14 Reels Plus (@14ReelsPlus) November 28, 2025

