Venkatesh Birthday: విక్టరీ వెంకటేష్‌ పుట్టినరోజుకు గిఫ్ట్ ఇదే..
venka-tesh(x)
ఎంటర్‌టైన్‌మెంట్

Venkatesh Birthday: విక్టరీ వెంకటేష్‌ పుట్టినరోజుకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్న నిర్మాతలు.. ఏంటంటే?

Venkatesh Birthday: విక్టరీ వెంకటేష్ అభిమానులకు ఇది నిజంగా పెద్ద పండుగ వార్త! ట్రెండ్ సెట్టింగ్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన “పెళ్ళి చేసుకుందాం” సినిమాను, వెంకటేష్ జన్మదిన కానుకగా డిసెంబర్ 13న మళ్ళీ విడుదల చేయబోతున్నారు. ఈసారి ఈ క్లాసిక్ చిత్రాన్ని సాయిలక్ష్మీ ఫిల్మ్స్ ద్వారా అత్యుత్తమ 4K రిజల్యూషన్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తుండడం విశేషం. విక్టరీ వెంకటేష్ నట జీవితంలో అసాధారణ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో “పెళ్ళి చేసుకుందాం” ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో కథానాయికగా అందం, అభినయాల కలబోత అయిన సౌందర్య నటించారు. వీరిద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Read also-Kiara Advani: కియారా అద్వానీ తన కూతురికి ఏం పేరు పెట్టిందో తెలుసా?.. దానికి అర్థం ఏంటంటే?

ఈ ట్రెండ్ సెట్టింగ్ చిత్రాన్ని సుప్రసిద్ధ దర్శకులు ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించారు. నిర్మాతలుగా సి.వెంకట్రాజు, శివరాజు వ్యవహరించారు. ఈ సినిమా విజయానికి మరొక ముఖ్య కారణం.. పదునైన పోసాని కృష్ణమురళి సంభాషణలు. అవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. లైలా, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి వంటి ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్య పాత్రలు పోషించి సినిమాకు బలాన్నిచ్చారు. సంగీత దర్శకుడు కోటి అందించిన మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది. కె.రవీంద్రబాబు సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్ వంటి సాంకేతిక అంశాలు ఈ చిత్రాన్ని మరింత ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి.

Read also-Bigg Boss 9: ఫైర్ మోడ్‌‌‌లో సాగుతున్న బిగ్ బాస్ కెప్టెన్సీ రేస్.. ఇమ్మాన్యూయేల్ కోపానికి కారణం ఇదే..

4K లో ఫ్రెష్ ఎక్స్‌పీరియన్స్

“పెళ్ళి చేసుకుందాం” చిత్రాన్ని 4K రిజల్యూషన్ లో తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సాయిలక్ష్మీ ఫిల్మ్స్ పతాకంపై వరప్రసాద్ గారు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రంతో తెలుగులో 300 కోట్ల క్లబ్ ఫౌండర్ హీరోగా చరిత్ర సృష్టించిన వెంకటేష్ బాబు నటించిన ఆణిముత్యాల్లో ‘పెళ్ళి చేసుకుందాం’ ఒకటి. అటువంటి చిత్రాన్ని ఈ ఫ్రెష్ రెజల్యూషన్‌లో డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం లభించడం తమకు గర్వకారణం” అని అన్నారు. ముఖ్యంగా, తమ రెండు తెలుగు రాష్ట్రాల్లోని విక్టరీ వెంకటేష్ అభిమానులంతా, అలాగే సిసలైన సినీ ప్రేమికులంతా ఈ క్లాసిక్ చిత్రాన్ని ఆదరిస్తారనే బలమైన నమ్మకం ఆయన వ్యక్తం చేశారు. మళ్ళీ తెరపై విక్టరీ వెంకటేష్‌ను, అభినయ దేవత సౌందర్యను 4K క్వాలిటీలో చూసేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 13న ఈ ట్రెండ్ సెట్టింగ్ బ్లాక్ బస్టర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసి ఆ అనుభూతిని తిరిగి పొందడానికి సినీ ప్రియులంతా సిద్ధమవుతున్నారు.

Just In

01

Local Body Elections: తెలంగాణ పల్లెల్లో మొదలైన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్..!

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?