Thimmaraju Palli TV: ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?
Thimmaraju Palli TV (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Thimmaraju Palli TV: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?

Thimmaraju Palli TV: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) సినీ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టి, తన ప్రతిభతో స్టార్‌గా ఎదిగిన కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు సిద్ధమయ్యారు. సుమైర స్టూడియోస్‌తో కలిసి తన ‘కేఏ ప్రొడక్షన్స్’ (KA Productions) బ్యానర్‌‌పై కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న తొలి చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’ (Thimmaraju Palli TV). ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్డేట్‌ను తాజాగా మేకర్స్ వదిలారు. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Mokshagna Teja: మళ్లీ వార్తల్లోకి నందమూరి వారసుడి ఎంట్రీ.. దర్శకుడు ఫిక్సయ్యాడా!

కొత్త టాలెంట్‌కు వేదిక

‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ద్వారా నటులు సాయి తేజ్ (Sai Tej), వేద జలంధర్ (Ved Jalandhar) హీరో హీరోయిన్లుగా సినీ రంగానికి పరిచయమవుతున్నారు. అలాగే, వి.మునిరాజు (V. Muniraju) ఈ చిత్రంతో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తేజ వేల్పుచర్ల ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ సింగిల్‌ను నవంబర్ 29న విడుదల చేయబోతున్నట్లుగా చెబుతూ ఓ అనౌన్స్‌మెంట్ వీడియోను మేకర్స్ వదిలారు. ఈ అనౌన్స్‌మెంట్ ప్రోమోలో కిరణ్ అబ్బవరం కూడా భాగమైనట్లుగా చూపించారు. కానీ, ఇందులో ఫేస్ క్లియర్‌గా చూపించలేదు. తన సొంత బ్యానర్ నుంచి వస్తున్న తొలి పాట కాబట్టి, ఇది తప్పక ప్రేక్షకులకు నచ్చుతుందని కిరణ్‌తో పాటు చిత్రయూనిట్ అంతా నమ్మకంగా ఉంది. ఈ చిత్రంలో ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read- Magic of Chikiri Chikiri: ‘తలా జారుతుంది చూస్కో’.. బుచ్చిబాబుపై రామ్ చరణ్ కామెడీ.. మేకింగ్ వీడియో వైరల్

పీరియాడిక్ డ్రామాగా ‘తిమ్మరాజుపల్లి టీవీ’

‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రం గ్రామీణ నేపథ్యంతో కూడిన ఒక ఆసక్తికరమైన పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోంది. సినిమా త్వరలోనే గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో, మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ రేఖన చార్ట్‌బస్టర్ అయ్యే పాటలను అందించారని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం విషయానికి వస్తే ‘క’ (Ka) అనే చిత్రంతో ఆయన బ్లాక్ బస్టర్ కొట్టి.. అందరికీ సమాధానమిచ్చారు. ఒక చిన్న ప్రయత్నంగా మొదలై, కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని ఈ సినిమా నిరూపించింది. ఈ విజయంతోనే మరింత స్ఫూర్తి పొందిన కిరణ్ అబ్బవరం, తనలాగే బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహిక నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఒక వేదిక కల్పించాలని నిర్ణయించుకున్నారు. ఆ ఆలోచనలోంచి పుట్టిందే ‘కేఏ ప్రొడక్షన్స్’ అని కిరణ్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. కిరణ్ అబ్బవరం కేవలం హీరోగానే కాకుండా, నిర్మాతగా కూడా కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు తీసుకున్న ఈ నిర్ణయాన్ని సినీ వర్గాలు, ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!