CM Revanth Reddy: గ్లోబల్ సమ్మిట్‌కు మోదీని ఆహ్వానిద్దాం..!
CM Revanth Reddy (imagecredit:twitter)
Telangana News

CM Revanth Reddy: గ్లోబల్ సమ్మిట్‌కు మోదీని ఆహ్వానించాలి: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ(PM MOdhi)తో పాటు కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సూచించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, ఏర్పాట్లపై ముఖ్యమంత్రి బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Srideer babu), పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు పలు శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమ్మిట్‌కు దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించేందుకు ముందుగానే జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు చెప్పారు. సదస్సులో పాల్గొనే ఆహ్వానితులకు ఎక్కడా లోటు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సదస్సుకు హాజరు కావాలని ఇప్పటికే 2600 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు అందించామని సమావేశంలో అధికారులు వివరించారు.

Also Read: Srinivas Goud: ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడతాం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

స్పష్టమైన ప్రణాళిక

పెట్టుబడులకు సంబంధించి సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. విభాగాల వారీగా వివిధ అంశాలపై మాట్లాడేందుకు వక్తలకు సంబంధించిన పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని, వక్తలకు సమయం ముందుగానే నిర్దేశించి క్రమశిక్షణతో కూడిన ప్రణాళిక ఉండాలని చెప్పారు. ఒక్కో ఈవెంట్‌కు ఒక్కో సీనియర్ ఐఏఎస్(IAS) అధికారిని బాధ్యుడిగా నియమించాలని ఆయన సూచించారు. సమ్మిట్ కోసం ఏర్పాటు చేస్తున్న స్టాల్స్ డిజైన్లను అధికారులు వివరించగా, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం, పరిశ్రమలు, వైద్య రంగాలకు సంబంధించిన స్టాల్స్ విషయంలో సీఎం అవసరమైన జాగ్రత్తలను సూచించారు. సమ్మిట్ సందర్భంగా ప్రదర్శించే డ్రోన్ షో తెలంగాణ బ్రాండ్ ఇమేజీ(Drone show Telangana brand image)ని పెంచే విధంగా ఉండాలని, అదే రీతిలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సదస్సుకు సంబంధించి అన్ని డిజైన్లు నెలాఖరులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Also Read: Pet Detective: అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ‘ది పెట్ డిటెక్టివ్‌’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Just In

01

Samantha Wedding: మళ్లీ తెరపైకి సమంత పెళ్లి వ్యవహారం.. నేడు పెళ్లి అంటూ వార్త వైరల్.. రాజ్‌ మాజీ భార్య షేర్ చేసింది ఇదే..

Bhadradri Kothagudem: భద్రాద్రి మోడల్‌పై సర్కార్ స్టడీ? ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలకు దేశ స్థాయి గుర్తింపు!

Marriage Debate: తన మనవరాలి పెళ్లి విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జయా బచ్చన్.. ఏం అన్నారంటే?

Bhatti Vikramarka: రెండేళ్లలో ఏం చేశాం? భవిష్యత్‌లో ఏం చేయబోతున్నాం? కాంగ్రెస్ ప్లాన్ ఇదే : భట్టి విక్రమార్క

CM Revanth Reddy: యువ‌త‌కు ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలే లక్ష్యం.. గ్లోబల్ సమ్మిట్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి!