Jani Master: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Choreographer Jani Master) పై ఈ మధ్యకాలంలో ఎలాంటి వార్తలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లైంగిక వేధింపుల కేసు ఆయనపై నమోదైంది. ఇక ఆయన సినిమాలకు దూరమవుతారని అంతా అనుకుంటున్నా, ఆయన మాత్రం ధైర్యంగా తన పని తను చేసుకుంటూ, ఇంతకు ముందు కంటే రెట్టింపు ఉత్సాహంతో దూసుకెళుతున్నారు. ఇటీవల వచ్చిన ‘పెద్ది’లోని ‘చికిరిచికిరి’ (Chikiri Chikiri Song) సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి స్పందనను రాబట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాటకు రెహమాన్ మ్యూజిక్‌తో పాటు జానీ మాస్టర్ స్టెప్స్ కూడా హైలెట్ అనేలా అందరూ.. పాటపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తనదైన స్టైల్‌తో డ్యాన్స్‌లో ఒక సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేసిన కొరియోగ్రాఫర్‌గా దూసుకెళుతున్న జానీ మాస్టర్‌ను తాజాగా ‘క్రియేటివ్ కొరియోగ్రాఫర్’ అవార్డు వరించింది. ఈ అవార్డుతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. కర్ణాటకకు చెందిన చిత్తార మీడియా (Chittara Media) ప్రతిష్టాత్మకంగా అందించిన ఈ గౌరవం… గత కొంతకాలంగా ఈ మాస్టర్ పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్న హేటర్స్‌కు ముచ్చెమటలు పట్టించినట్లయిందని నెటిజన్లు కొందరు, జానీని అభిమానించే వారు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుండటం విశేషం.
కళ్లు చెదిరే అవార్డుతో దిమ్మతిరిగే రిప్లై!
గతంలో ఈ కొరియోగ్రాఫర్ చేసిన కొన్ని ప్రయోగాత్మక కొరియోగ్రఫీపై కొందరు సోషల్ మీడియా వేదికగా తమ వ్యతిరేకతను, పెదవి విరుపును వ్యక్తం చేశారు. ‘పాత స్టైలే.. కొత్తదనం లేదు’, ‘పాటకు న్యాయం చేయలేదు’ అంటూ రకరకాలుగా కామెంట్లు పెట్టిన వారికి.. ఈ అవార్డు ఒక స్ట్రాంగ్, సైలెంట్ రిప్లై లాంటిదని చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ అవార్డు కేవలం ఒక్క పాట కోసం కాదు. ‘ఇప్పటివరకు తాను చేసిన అన్ని సూపర్ హిట్ చార్ట్‌బస్టర్ సాంగ్స్’కు గుర్తింపుగా చిత్తార మీడియా అందించిందని జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు.
Elated to receive the CREATIVE CHOREOGRAPHER Award for all the superhit chartbuster songs I did till date 😇 Thank you @Chittaramedia for the honour 🤝
I’m forever grateful to all the Actors, Directors, Technicians, Producers, and the Audience for their constant support,… pic.twitter.com/eZp8oveHnT
— Jani Master (@AlwaysJani) November 26, 2025
హేటర్స్‌కు ఇక మాటల్లేవా?
‘క్రియేటివ్ కొరియోగ్రాఫర్’ అనే బిరుదు పొందడం అంటే.. మామూలు విషయం కాదు. ఎందుకంటే, దీనికి క్రియేటివిటీతో పాటు వాణిజ్యపరమైన విజయం కూడా కావాలి. అవార్డు అందుకున్న తర్వాత ఈ కొరియోగ్రాఫర్ తన ట్వీట్‌లో ‘నటులు, దర్శకులు, టెక్నీషియన్లు, నిర్మాతలు, ప్రేక్షకుల మద్దతు, ప్రశంసలతో పాటు నాకు వస్తున్న అవకాశాలకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడిని’ అని పేర్కొనడం విశేషం. ఈ విజయం కేవలం విమర్శకుల కోసం కాదు, తన పనిని ఇష్టపడే లక్షలాది మంది ప్రేక్షకులు ఇచ్చిన తీర్పుగా భావించాలి. హేటర్స్ చేస్తున్న కొన్ని కామెంట్లను పక్కనపెడితే, మొత్తం ప్రేక్షకులు మాత్రం ఈ మాస్టర్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ భారీ సక్సెస్ ముందు చిన్నపాటి విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు.
Also Read- NBK111: నటసింహం బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబో చిత్రానికి క్లాప్ కొట్టిందెవరంటే?
అంచనాలకు తగ్గట్టుగా
చిత్తార మ్యూజిక్ అవార్డ్స్ 2025 (CMA2025) వేదికగా లభించిన ఈ గౌరవం, ఇక ముందు ఈ కొరియోగ్రాఫర్ మరింత గొప్పగా తన పనిని కొనసాగించడానికి స్ఫూర్తినిస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ మాస్టర్ ట్వీట్‌లో.. ‘‘రాబోయే సినిమాల్లో మన అభిమాన తారలతో మీ అంచనాలకు తగ్గట్టుగా నా కొరియోగ్రఫీని అందిస్తూనే ఉంటాను’ అని ధీమా వ్యక్తం చేయడంతో, హేటర్స్‌కు ఇక కామెంట్లు చేయడానికి కూడా ఛాన్స్ దొరకదేమో అనేలా ఆయన అభిమానులు చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మొత్తంగా చూస్తే, ఈ అవార్డుతో తనపై విమర్శలు చేసిన నోళ్లకు తాళం వేసినట్లయింది. ఇక హేటర్స్ పరిస్థితి ఏంటో వారికే తెలియాలి!
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
