Akhanda 2: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2: తాండవం’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన విడుదల తేదీన విడుదల కానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. ఈ క్రమంలోనే, అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం ముహూర్తం ఖరారైంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, కైత్లాపూర్ గ్రౌండ్స్‌ను వేదికగా ఎంచుకున్నారు. నవంబర్ 28, 2025 తేదీన సాయంత్రం ఈ అఖండ వేడుక జరగనుంది. ‘అఖండ’ మొదటి భాగం సాధించిన సంచలనాత్మక విజయం దృష్ట్యా, ఈ రెండవ భాగంపై కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక, ప్రపంచవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను కూడా అత్యంత భారీ ఎత్తున నిర్వహించడానికి చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ సన్నాహాలు చేస్తోంది.
Read also-TFCC Elections: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్.. నామినేషన్ చివరి తేదీ ఎప్పుడంటే?
ఈ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రం గురించి పంచుకునే విశేషాలు సినిమాపై మరింత హైప్‌ను పెంచడం ఖాయం అంటున్నారు సీని పెద్దలు. హీరోయిన్ సంయుక్త మీనన్, ఇతర కీలక నటీనటులు ఆది పినిశెట్టి, కబీర్ దుహాన్ సింగ్తో పాటు సంగీత దర్శకుడు ఎస్. థమన్ కూడా ఈ వేడుకలో పాల్గొంటారు. తమన్ ఇచ్చిన నేపథ్య సంగీతం, పాటలు ‘అఖండ’ విజయానికి ఎంత దోహదపడ్డాయో తెలిసిందే. ఈ సారి కూడా ‘తాండవం’తో థమన్ ఎలాంటి బీజీఎమ్‌తో మెస్మరైజ్ చేస్తాడో చూడాలి. విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తుంటే సినిమాపై అంచనాలు మరింత పెంచేలా ఉన్నాయి. ఇప్పటికే సంగీత దర్శకుడు థమన్ అందించిన సంగీతం తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. టైటిల్ సాంగ్, ఐటమ్ సాంగ్ చూస్తుంటే.. ప్రేక్షకుల అంచనాలు మించి పోయేలా ఉన్నాయి.
ఈ వేడుకకు సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలలో ఒకరు, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా రాబోతున్నారని సమాచారం. అయితే, దీనిపై నవంబర్ 27న అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగిన సరిగ్గా ఏడు రోజుల తర్వాత, అంటే డిసెంబర్ 5న ‘అఖండ 2: తాండవం’ సినిమా తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 2D, 3D ఫార్మాట్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో బాలయ్య బాబు పాన్ ఇండియా స్టార్ అయిపోతాడంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే డిసెంబర్ 5 వరకూ ఆగాల్సిందే.
#Akhanda2 GRAND PRE RELEASE EVENT on November 28th at Kaithlapur Grounds, Kukatpally, Hyderabad 💥💥
Get ready for a massive evening ❤🔥
In cinemas worldwide on December 5th.#Akhanda2Thaandavam
‘GOD OF MASSES’ #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial… pic.twitter.com/g0CQn4sdtC— 14 Reels Plus (@14ReelsPlus) November 26, 2025
