Mowgli 2025: సెకండ్ సింగిల్ ‘వనవాసం’ ప్రోమో ఎలా ఉందంటే?
Mowgli 2025 (Image Source: YT)
ఎంటర్‌టైన్‌మెంట్

Mowgli 2025: ‘మోగ్లీ 2025’ మూవీ సెకండ్ సింగిల్ ‘వనవాసం’ ప్రోమో ఎలా ఉందంటే?

Mowgli 2025: ‘బబుల్‌గమ్’ సినిమాతో హీరోగా పరిచయమైన యంగ్ హీరో రోషన్ కనకాల (Roshan Kanakala) తన రెండవ చిత్రం ‘మోగ్లీ 2025’ (Mowgli 2025)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ (Sandeep Raj) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అడవి నేపథ్యంలో సాగే ఒక యూనిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ సింగిల్, టీజర్ మంచి స్పందనను రాబట్టుకుని, సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రెండవ సింగిల్ ‘వనవాసం’ ప్రోమో (Vanavaasam Promo)ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రోమో ‘రామాయణం’ థీమ్‌ను, యుద్ధాన్ని ప్రతిబింబిస్తూ అత్యంత శక్తివంతంగా ఉందని చెప్పొచ్చు.

Also Read- Malavika Mohanan: స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్లకు ఇంపార్టెన్స్ ఉండదు.. కానీ ‘రాజా సాబ్’లో!

యుద్ధానికి సిద్ధమవుతున్న శబ్దం

ఈ ప్రోమోని గమనిస్తే.. అడవిలో ఉన్న రాముడి విగ్రహం, చెట్ల మధ్య వెలుతురు, మంటల ప్రభావంతో కూడిన దృశ్యాలు అద్భుతమైన విజువల్స్‌గా నిలిచాయి. చివర్లో మోగ్లీ (రోషన్) గుడి మెట్లపై కూర్చుని ఉండటం, గాలిలో బాణాలు, పక్షి విగ్రహం మీదుగా ఎగిరిపోవడం వంటి షాట్‌లు సినిమా నిర్మాణ విలువలను చాటుతున్నాయి. జాతీయ అవార్డు గ్రహీత అయిన కాళ భైరవ అందించిన సంగీతం అత్యంత పవర్‌ఫుల్‌గా ఉంది. ప్రోమోలో వినిపించిన పాట లిరిక్స్‌లో రామాయణం, మలుపులు, యుద్ధం, సాక్ష్యం, శబ్దం వంటి పదాలు హీరో యొక్క పోరాటాన్ని, అతని వనవాస నేపథ్యాన్ని సూచిస్తున్నాయి. యుద్ధానికి సిద్ధమవుతున్న శబ్దంలా ఈ పాట ఉంది. ఈ పాటరే లిరిక్స్ కళ్యాణ్ చక్రవర్తి అందించారు. ‘రామాయణం మలుపులే తీసుకున్నా’, ‘శబ్దమే యుద్ధమై మారుతుంటే’ వంటి పదాలు కథలోని సంఘర్షణను, హీరో ఎదుర్కొనే కష్టాలను తెలియజేస్తున్నాయి.

Also Read- Syamala: హిందూపురంలో అంత రచ్చ జరుగుతుంటే ఎమ్మెల్యే ఎక్కడ? బాలకృష్ణపై శ్యామల ఫైర్..

‘వనవాసం’ పూర్తి లిరికల్ సాంగ్ ఎప్పుడంటే?

‘వనవాసం’ అనే టైటిల్‌కు తగ్గట్టుగానే అడవి, యుద్ధం, ఒంటరి పోరాట నేపథ్యాన్ని ఈ పాట ప్రోమో సూచిస్తోంది. అడవిలో విలన్లతో హీరో చేసే పోరాటం, దాని వెనుక ఉన్న ఒక భావోద్వేగపూరిత కథనాన్ని ఇది తెలియజేస్తుంది. ‘వనవాసం’ పూర్తి లిరికల్ సాంగ్ నవంబర్ 26 బుధవారం విడుదలవుతుందని మేకర్స్ ఈ ప్రోమోలో ప్రకటించారు. ఈ ప్రోమో చూసిన ప్రేక్షకులు, పాట కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ‘మోగ్లీ 2025’ చిత్రాన్ని డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీపై హీరో రోషన్ కనకాల ఎంతో నమ్మకాన్ని పెట్టుకుని ఉన్నారు. సినిమా కచ్చితంగా హిట్టవుతుందనేలా ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ ఉంది. దర్శకుడు సందీప్ రాజ్.. ఈ సినిమాలోని హీరోని చాలా కొత్తగా చూపిస్తున్నాడు. అలాగే హీరోయిన్ పాత్రకు కూడా ఇందులో చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క