Rangareddy land scam: నిబంధనలతో పనిలేదు.. కాసులిస్తే చాలు
హెచ్ఎండీఏ అనుమతులు జీపీఏ భూమికి
సబ్ రిజిస్ట్రార్ మద్దతుతో అక్రమ డాక్యుమెంట్ల సృష్టి
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోరా?
ఎవరు ఏమీ చేయలేరనే ధీమాలో సబ్ రిజిస్ట్రార్
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: కొందరు రియల్ వ్యాపారులు వ్యక్తిగత అవసరాల కోసం, క్రయవిక్రయాల్లో సైతం మోసాలకు పాల్పడుతున్నారు. ఇల్లీగల్ అంశాలను కప్పిపుచ్చుకోని రియల్ వ్యాపారులు చట్టవిరుద్దంగా రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని కొంతమంది రియల్ వ్యాపారులు వినియోగదారులను నిండా (Rangareddy land scam) ముంచేస్తున్నారు. ఆ అక్రమాలకు సబ్ రిజిస్ట్రార్లు వంత పాడుతున్నారు. సబ్‌రిజిస్ట్రార్ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయాలి. కానీ, అవేమీ తమకు తెలియదు కాసులిస్తే చాలు.. అన్నింటిని రిజిస్ట్రేషన్లు చేస్తామని పరోక్షంగా ప్రజలకు అధికారులు సందేశం ఇస్తున్నట్టుగా పరిస్థితులు తయారయ్యాయి.
కార్తికేయ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు కరెక్టేనా?
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్ రెవెన్యూ పరిధిలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్లు 31/పార్ట్, 32/పార్ట్, 33, 35, 36, 37, 38, 39/పార్ట్‌లో 11 ఎకరాల 34 గుంటల భూమికి ముగ్గురు పట్టాదారులుగా ఉన్నారు. వీరు తమ అవసరాల కోసం రెండు ఎకరాల భూమిని నగరానికి చెందిన ఓ వ్యక్తిపై జీపీఏ చేశాయి. అయినప్పటికి నిబంధనలకు విరుద్దంగా రైతుల పేరుతో హెచ్ఎండీఏ అనుమతులు తీసుకున్నారు. అంతటితో ఆగకుండా కార్తికేయ పేరుతో 42 ప్లాట్లతో లేఅవుట్ చేశారు. ఈ ప్లాట్లు కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్లను పట్టాదారులైన రైతులు నేరుగా చేయాలి. ఒకవేళ జీపీఏ చేసిన రెండు ఎకరాలకు అవకావం ఉన్నా, మిగిలిన 9 ఎకరాల 34 గుంటల పరిధిలోని భూమిలోని ప్లాట్లను రైతులే రిజిస్ట్రేషన్లు చేయాలి. కానీ, లోసుగులను ఎత్తిచూపాల్సిన అధికారులు… రియల్ వ్యాపారులతో కుమ్మక్కై ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. వాస్తవానికి రైతులు, రియల్ వ్యాపారులు కలిసి ఒప్పందంలో భాగంగా నేరుగా రియల్ వ్యాపారులు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని అనుకోవచ్చు. కానీ ఐజీ స్టాంప్ డ్యూటీ నిబంధనల ప్రకారం వాళ్ల ఒప్పందం సబ్ రిజిస్ట్రార్ చేయ్యొచ్చా అనేది అనుమానమే. నిబందనలకు విరుద్దంగా అదనపు సంపదనకు కక్కుర్తిపడి నిబంధనలు తుంగలో తొక్కుత్తున్నారు.
Read Also- TG Gram Panchayat Elections: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. మూడు విడతల్లో పోలింగ్
సబ్ రిజిస్ట్రార్ అక్రమాలకు అడ్డులేదు!
ఇబ్రహీంపట్నంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇద్దరు అధికారులు ఉన్నారు. ఇందులో ఒకరు రెగ్యులర్ పోస్టింగ్, మరొకరు డిప్యూటేషన్ పేరుతో ఆదాయం వచ్చే ప్రాంతాల్లో పనిచేసేందుకు ఇష్టపడతారని ప్రచారం ఉంది. అయితే. నిబంధనలకు అనుగుణంగా ఉన్నా లేకున్నా ఆ సబ్ రిజిస్ట్రార్‌కు చేతులు తడపాల్సిందే. లేకపోతే కొర్రీల పేరుతో జాప్యం చేయడం వారికి వెన్నతోపెట్టిన విద్య. ఇలాంటి సబ్ రిజిస్ట్రార్‌పై అనేక ఫిర్యాదులు ఉన్నతాధికారులు చేశారు. అయినప్పటికీ వారిలో చలనం లేదు. తప్పులను కప్పిపుచ్చుకోవాలంటే ఉన్నతాదికారులు ముడుపులు చెల్లిస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుచేత వారిపై విచారణ జరిపేందుకు జాప్యం చేస్తున్నారు.
విచారణకు జంకుతున్న ఉన్నతాధికారులు
ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఓ అధికారిపై హైకోర్టు న్యాయవాది ఆధారాలతో సహా ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. ఇబ్రహింపట్నం మండలం మంగల్‌పల్లిలోని 367 సర్వే నెంబర్లలోని లోని ఒక ఇంటిని యాజమాని ప్రమేయం లేకుండా మరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో బాధితుడు పోలిస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. బోంగులూరు, ఆదిబట్ల, మంగళపల్లి పటేల్ గూడ ప్రాంతాల్లో నిర్మించే బహుళ అంతస్థుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఐదు అంతస్థుల భవనాలు నిర్మిస్తే రెండంతస్తులకు మాత్రమే స్టాంప్ డ్యూటీ అధికారికంగా కట్టిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఆ సబ్ రిజిస్ట్రార్ కొన్ని సందర్భాల్లో ఐదు అంతస్థులకు స్టాంప్ డ్యూటి కట్టిస్తూ, రెండు అంతస్థుల భవనం ఉన్నట్టుగా ఫొటోలను డాక్యుమెంట్లకు జత చేస్తున్నారు. ఆడిట్ జరిగినప్పుడు అక్రమాలు బయటపడకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీటిపై విచారణ చేయాలని ఐజీ స్టాంఫ్ డ్యూటీ కమీషనర్, ఏసీబీకి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులకు ఫిర్యాదులు అందాయని, అయినా వీటిపై విచారణ చేసేందుకు అధికారులు జంకుతున్నారని తెలిసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ సబ్ రిజిస్ట్రార్ చేసే అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also- Emmy Awards 2025: ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ 2025.. ఈసారి ట్రోఫీలు దక్కించుకున్న వాళ్ళు వీరే!

