CM Revanth Reddy: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నది. డ్రగ్స్ అరికట్టడాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, డ్రగ్స్ పేరు ఎత్తితే కాళ్లు చేతులు వణకాలి అని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పేర్కొన్నారు. తెలంగాణలో డ్రగ్స్ అనే పదం వినిపించకూడదని, డ్రగ్స్ నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నార్కోటిక్స్ బ్యూరో కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించిందని ఆ తర్వాత వెల్లడించారు. ఈ నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. డ్రగ్స్ వల్ల కలిగే విపరిణామాలపై అవగాహన తీసుకురావడానికీ చర్యలు చేపట్టింది.
@TelanganaCMO నేతృత్వంలోని ఈ డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది.https://t.co/iett4gCDLl
మాదకద్రవ్యాల వ్యసనం వల్ల కలిగే తీవ్ర పరిణామాలను హైలైట్ చేసే శక్తివంతమైన వీడియో ఇది.
మీరు లేదా మీకు తెలిసిన వారెవరైనా డ్రగ్స్ వాడుతున్నా, కొనుగోలు చేస్తున్నా లేదా పంపిణీ…
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 28, 2024
తాజాగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవి కూడా తన వంతుగా ముందుకు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయానికి మద్దతుగా అవగాహన కోసం ఓ యాడ్‌లో కనిపించారు. డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలను ఆ యాడ్‌లో చిరంజీవి వివరించారు. డ్రగ్స్ తీసుకుంటే జీవితాలు ధ్వంసమైపోతాయని హెచ్చరించారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు లేదా కొనుగోలు చేసినట్టు తెలిస్తే వెంటనే నార్కోటిక్స్ బ్యూరోకు సమాచారం ఇవ్వాలని సూచించారు. 8712671111 నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతారని చెప్పారు. ఇది డ్రగ్స్ తీసుకున్నవారిని శిక్షించడానికి కాదని, డ్రగ్స్ నుంచి వారిని విముక్తి చేయడానికేనని చెప్పారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రగ్స్‌కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తానూ భాగమవుతున్నానని వివరించారు. అందరూ భాగస్వాములై రాష్ట్రం నుంచి డ్రగ్స్ మహమ్మారిని పారద్రోలాలని పిలుపు ఇచ్చారు.