Mass Jathara: ‘మాస్ జాతర’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
mass-jatara-ott(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ ఓటీటీ అఫిషియల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?.. చూడాలంటే?..

Mass Jathara: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ థియేటర్లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు. మాస్ జాతర సినిమా నవంబర్ 28 తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ సినిమా ఓటీటీ విడుదలకోసం ఆసక్తిగా ఎదురు చూసిన రవితేజ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, థియేటర్లలో ఓకే అనిపించినప్పటికీ, డిజిటల్ ప్రేక్షకులను మెప్పిస్తుందని చిత్ర యూనిట్ ఆశపడుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం, విడుదలకు ముందు విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అయితే, పలుమార్లు వాయిదా పడటం వల్ల సినిమాపై కొంత నెగెటివ్ ప్రభావం చూపింది. రిలీజ్ రోజున కూడా ఈ చిత్రం ప్రేక్షకులను అంతంత మాత్రం గానే ఆకట్టుకుంది. చిత్రానికి వచ్చిన టాక్‌తో ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు వెనుకాడారు. అయితే ఈ సినిమా ఓటీటీ లో జాతర అవుతుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. ఓటీటీలో ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.

Read also-Dharmendra Death: బాలీవుడ్ సినీ దిగ్గజం ధర్మేంద్ర మృతితో షోలే రోజులు గుర్తుచేసుకున్న అమితాబ్.. పోస్ట్ వైరల్..

నిర్మాణ సంస్థకు (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్), ఓటీటీ సంస్థకు మధ్య నెలకొన్న కొన్ని విభేదాల కారణంగా, ‘మాస్ జాతర’ డిజిటల్ స్ట్రీమింగ్ తేదీ విషయంలో గందరగోళం ఏర్పడింది. సుమారు నెల రోజుల పాటు ఈ వివాదం నడుస్తుండటంతో, అభిమానుల్లో కొంత అసహనం కనిపించింది. ఇదేంటి రవితేజ సినిమాకు ఇలా అవుతుందని అభిమానులు కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఈ సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని, ఎట్టకేలకు ఓటీటీ విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఇందులో ల‌క్ష్మ‌ణ్ భేరి అనే రైల్వే పోలీస్‌గా నటించారు. గంజాయి స్మ‌గ్ల‌ర్ శివుడు (న‌వీన్ చంద్ర‌), రైల్వే పోలీస్‌ ల‌క్ష్మ‌ణ్ భేరి మ‌ధ్య వైరం ఎలా మొద‌లైంది? శివుడి గంజాయి సామ్రాజ్యాన్ని ల‌క్ష్మ‌ణ్ ఎలా నాశ‌నం చేశాడనే కథాంశంతో భాను భోగ‌వ‌ర‌పు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాజేంద్రప్రసాద్, నరేష్ వంటి వారు కీలక పాత్రలలో నటించారు.

Read also-Narasimha Oscars: అకాడమీ అవార్డ్స్ బరిలో ‘మహావతార్ నరసింహ’.. భారతీయుల కల నెరవేరనుందా?..

రవితేజ మార్క్ యాక్షన్, కామెడీ మేళవింపుగా రూపొందిన ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటించింది. విలక్షణ నటుడు నవీన్ చంద్ర (Naveen Chandra) విలన్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రం కేవలం తెలుగులోనే కాకుండా, దక్షిణాది, ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మాస్ జాతర’ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి. రవితేజ యాక్షన్ డ్రామాను ఇంటిల్లిపాది హాయిగా చూసే అవకాశం దొరకడంతో, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్‌గా, మాస్ మహారాజా ‘మాస్ జాతర’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఎంతటి రచ్చ చేస్తుందో.. తెలియాలంటే మాత్రం నవంబర్ 28 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం రవితేజ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓటీటీలో ఈ సినిమా ఎంత హంగామా చేస్తుందో చూడాలి మరి.

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం