Kavitha: పుచ్చ లేచిపోద్ది.. మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డిపై కవిత ఘాటు వ్యాఖ్యలు!
Kavitha ( image cRedit: swwetcha reporter)
Political News

Kavitha: నిరంజన్ రెడ్డి పుచ్చ లేచిపోద్ది.. మాజీ మంత్రిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కవిత

Kavitha: నన్ను ఉద్దేశించి పుచ్చువంకాయ, సచ్చు వంకాయ అంటూ అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇంకోసారి ఇలా పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుంది. తండ్రి వయసు వారని ఇప్పటికీ గౌరవిస్తున్నా. ఎక్కువ మాట్లాడితే ఊరుకునేది లేదు’’ అంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వనపర్తిలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి కారణంగా బీఆర్ఎస్ కోలుకోని విధంగా దెబ్బతింటోందని ఆరోపించారు. ‘‘ఆయన బీసీలపై అరాచకం సృష్టించారు. వాళ్లపై కేసులు పెట్టి రక్తాలు వచ్చేలా కొట్టించారు. మూడుమూడు సార్లు 32 మంది బీసీలపై అన్యాయంగా కేసులు పెట్టించారు. నిరంజన్ రెడ్డి మూడు, మూడు ఫామ్ హౌస్‌లు కట్టుకున్నారు. కష్టపడిన జీతంతో కట్టుకుంటే సరే.. కానీ వీటిలో అసైన్డ్ భూములు ఉన్నాయి’’ అంటూ కవిత ఆరోపించారు.

కేసీఆర్‌కి అది తెలిసినా ఊరుకుంటే మాత్రం అది తప్పే

కృష్ణా నది కాల్వనే ఆ భూముల్లో ఉందన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ చేయటం లేదు?, ఈ విషయం కేసీఆర్ కి తెలియదా?, తన మనిషి అని కేసీఆర్‌కి తెలియకుండా హరీష్ రావు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. నిరంజన్ రెడ్డి అరాచకాలు ఘోరాతి ఘోరంగా ఉన్నాయని, చిన్నపిల్లాడిని అడిగినా చెబుతున్నారన్నారు. ‘‘ఇలాంటి వ్యక్తి నాపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. మా తండ్రి వయసు ఉన్న వారని ఇప్పటికి గౌరవిస్తున్నాను. మీరు ఎమ్మార్వో ఆఫీస్ తగలబెట్టారు. కేసీఆర్‌కి అది తెలిసినా ఊరుకుంటే మాత్రం అది తప్పే. వ్యవసాయ శాఖ మంత్రిగా కేసీఆర్ అవకాశం ఇస్తే ప్రజల రక్తం తాగుతారా?. ఎదుల రిజర్వాయర్ కూడా మీరు పూర్తి చేయలేదు. కానీ, మీకు మీరే నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకున్నారు.

నిరంజన్ రెడ్డి భూదాహానికి అంతులేదా?

జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు. పాత వాటికే కనెక్ట్ చేసి నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకోవటం సరికాదు. పెబ్లేరు సంత చాలా ఫేమస్. అక్కడ 32 ఎకరాలను నిరంజన్ రెడ్డి మనుషులు కబ్జా పెట్టి అమ్ముకోవాలని చూస్తున్నారు. దేవుడి గుళ్లనైనా అవినీతి నుంచి వదిలేయాలని హెచ్చరిస్తున్నా. కబ్జా కోరులకు పెద్ద నాయకులు సపోర్ట్ చేయవద్దు. వనపర్తి, పెబ్బేరు ఎక్కడైనా కబ్జాలేనా?. నిరంజన్ రెడ్డి భూదాహానికి అంతులేదా?. ఇలాంటి వ్యక్తులను ఏ పార్టీ కూడా ఎంకరేజ్ చేయవద్దుని కోరుతున్నా. ఇలాగే ఉంటే బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో బతికి బట్టకట్టదు. ఇంకా ఎక్కువ మెజార్టీతో ప్రజలు ఓడిస్తారు. హరీష్ రావు మనిషి కాబట్టే నిరంజన్ రెడ్డిపై సీఎం చర్యలు తీసుకోవటం లేదు. ఇలా అవినీతిని ఎంకరేజ్ చేస్తే తెలంగాణ బాగుపడతదా?. నేను చేసిన విమర్శలకు సమాధానం చెప్పకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు’’ అని కవిత మండిపడ్డారు.

Also Read: Maloth Kavitha: భగవాన్ సత్య సాయిబాబా ఆలోచనలు ఆశయాలు ఆచరణీయం: మాలోతు కవిత

అద్దాల మేడలో ఉన్నోళ్లకే నష్టం

అద్దాల మేడల్లో ఉన్నోళ్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే వారికే నష్టమని, అరాచకాలు కేసీఆర్‌కు తెలియవని అనుకుంటున్నానని, అందుకే మీడియా ద్వారా చెబుతున్నానని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. వనపర్తి ప్రజలంటేనే ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. కొత్తకోట మండలంలో చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. తెలంగాణ రాకముందు కేసీఆర్ చేనేత కార్మికుల కోసం భిక్షాటన చేసి వారిని ఆదుకున్నారన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక చేనేతలకు వారితో పాటు ఇద్దరు సహాయకులకు ఆర్థిక సాయం అందించారని కవిత ప్రస్తావించారు. కానీ, కాంగ్రెస్ రాగానే అందులో ఒకరికి ఆర్థిక సాయాన్ని ఆపేసిందని ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 8, 891 మంది చేనేత కార్మికులు సాయం కోసం జులైలో దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటివరకు ఒక్కరికి కూడా సాయం చేయలేదన్నారు.

ఈ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు 

కనాయ్‌పల్లి శంకర సముద్రం ప్రాజెక్ట్ నిర్వాసితుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. తెలంగాణ వచ్చాక కూడా ఈ ప్రాజెక్ట్ పూర్తి కాలేదన్నారు. తెలంగాణ తెచ్చుకున్నదే బీమా, నెట్టంపాడు, కల్వకుర్తి లాంటి ప్రాజెక్ట్‌లు పూర్తి చేయటానికి, కానీ ఇప్పుడు వరకు అది జరగలేదన్నారు. మల్లన్న సాగర్, మిడ్ మానేరు నిర్వాసితులకు కట్టించినట్లుగానే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించాలని కవిత డిమాండ్ చేశారు. శంకర సముద్రం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే మరో 40 వేల ఎకరాలకు నీళ్లు వస్తాయన్నారు. ఈ ప్రాంతానికి చెందిన నాయకుడు రావుల చంద్రశేఖర్ మంచి మనిషి అని, అవినీతి మరక లేని వారని ప్రశ్నించారు. ఆయన కేసీఆర్‌కి ఈ విషయాన్ని చెప్పి ప్రజలకు న్యాయం చేయాలని, ఇక్కడి ప్రజల తరఫున ముందుండి పోరాడాలని కోరారు. తెలంగాణలో ఉన్న ప్రతి మహిళకు చీరలు ఇవ్వాల్సిందేనని ఈ సందర్భంగా కవిత డిమాండ్ చేశారు.

Also Read: Kalvakuntla Kavitha: సింగరేణి ముట్టడి ఉద్రిక్తం.. రోడ్డుపై బైఠాయించిన కవిత.. అరెస్ట్ చేసిన పోలీసులు

Just In

01

Premante OTT Release: ప్రియదర్శి ‘ప్రేమంటే’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

VH Hanumantha Rao: బీసీ రిజర్వేషన్లపై.. బీజేపీ ఓబీసీ ఎంపీలు మౌనమేల: వీహెచ్ ఫైర్

Lipstick: మీ స్కిన్ టోన్‌కి అద్భుతంగా కనిపించే లిప్ స్టిక్ షేడ్స్.. డే-టు-డే నుండి పార్టీ లుక్ వరకు

New Year Party: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్.. నగరానికి చేరుస్తున్న పెడ్లర్లు డెడ్​ డ్రాప్​ పద్దతిలో..!

Nagababu Politics: అక్కడ ఫోకస్ పెట్టేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఫోకస్ తగ్గించుకుంటున్న మెగా బ్రదర్..