AP Deputy Cm Pawan Kalyan Special Darshan To kondagattu Anjanna: ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం కోసం పవన్ కళ్యాణ్ రోడ్డుమార్గాన వెళ్లారు. వెళ్లే దారిలో సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి వద్ద జనసేన అధినేత,ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ‌్‌కు గజమాలతో సన్మానం చేశారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..తెలంగాణలో బీజేపీ, జనసేన పార్టీ కలిసి పనిచేస్తాయని అన్నారు. తెలంగాణలోని జనసేన కార్యకర్తలకు, అభిమానులకు, ఉద్యమకారులకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఉదయం హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో పోలీసుల భారీ బందోబస్తు నడుమ కొండగట్టుకు చేరుకున్న అనంతరం దేవాలయ ఈవో స్వాగతం పలికారు. వేదపండితులు మంత్రోచ్ఛరణాలతో ప్రత్యేక పూజలు నిర్వహించగా, తమ ఇలవేల్పు కొండగట్టు అంజన్నకు పవన్ మొక్కులు చెల్లించుకున్నారు. దర్శననంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు. ఇక పవన్ కల్యాణ్ ఒక్కరే కాదు, మెగా ఫ్యామిలీ మొత్తం ఆంజనేయస్వామిని ఇష్టంగా పూజిస్తారు. ప్రజారాజ్యం 2009 ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్‌కు కొండగట్టు సమీపంలో ప్రమాదం తప్పింది.
Also Read: సీఎం వరంగల్ షెడ్యూల్
హైటెన్షన్ వైర్లు పడటం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. అప్పటి నుంచి కొండగట్టు అంజన్నను పవన్ కల్యాణ్ ఇష్టదైవంగా ఆరాధిస్తున్నారు. ఏ మంచి పని చేపట్టినా ముందుగా కొండగట్టు వెళుతుంటారు. గత ఎన్నికల్లో ప్రచారం కోసం పవన్ కల్యాణ్ వారాహి అనే ప్రత్యేక వాహనాన్ని ఉపయోగించారు. ఆ వాహనానికి తొలి పూజ కొండగట్టు అంజన్న ఆలయంలో నిర్వహించారు. ఎన్నికల ముందు వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ కొండగట్టులోనే పూజలు నిర్వహించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది. కూటమి విజయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధాన పాత్ర పోషించారు.