Upender: పోలీస్ సేవలో అంకితభావానికి నిదర్శనం.
Dakshata Award ( image CREDIT: SWRTCHA REPORTER)
Telangana News

Upender: పోలీస్ సేవలో అంకితభావానికి నిలువెత్తు నిదర్శనం.. ఉపేందర్ సేవలకు దేశ స్థాయి గౌరవం!

Upender: విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సైబరాబాద్ ఎకనమిక్​ అఫెన్సెస్​ వింగ్​ ఇన్స్ పెక్టర్​ ఉపేందర్ కేంద్ర హోంమంత్రి దక్షత అవార్డును సాధించారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ కమిషనర్ అవినాష్​ మహంతి తన కార్యాలయంలో ఇన్స్ పెక్టర్ ఉపేందర్ ను శభాష్ అంటూ అభినందించారు. ఎనకమిక్​ అఫెన్సెస్​ వింగ్​ కు బదిలీ కాకముందు ఇన్స్​ పెక్టర్​ ఉపేందర్ వేర్వేరు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించారు.

Also Read: Asha Worker Award: ఆశా వర్కర్ సోయం జయమ్మ కు.. ఉత్తమ సేవా అవార్డు!

హోం మంత్రి దక్షత అవార్డు

ఈ క్రమంలో పలు హత్యల కేసులను దర్యాప్తు చేసిన ఆయన పక్కగా సాక్ష్యాధారాలు సేకరించి ఆయా కోర్టులకు సమర్పించారు. ఈ నేపథ్యంలో తొమ్మిది మందికి శిక్షలు పడేలా చూశారు. ఈ నేపథ్యంలోనే దేశ మొదటి హోం మంత్రి సర్దార్​ వల్లబ్​ భాయ్​ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రకటించిన హోం మంత్రి దక్షత అవార్డును అందుకున్నారు. సోమవారం ఎకనమిక్​ అఫెన్సెస్ వింగ్ డీసీపీ ముత్యంరెడ్డితో కలిసి మర్యాదపూర్వకంగా కమిషనర్ అవినాష్​ మహంతిని కలిశారు.

Also Read: 71st National Awards: జాతీయ అవార్డులు అందుకున్న తెలుగు గ్రహీతల ఫస్ట్ రియాక్షన్.. ఏంటంటే?

Just In

01

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య

Bandla Ganesh: ‘మోగ్లీ 2025’పై బండ్ల గణేష్ రివ్యూ.. ‘వైల్డ్’ అర్థమే మార్చేశారు

Bondi Beach Attack: యూదులే టార్గెట్.. బోండీ బీచ్ ఉగ్రదాడిలో సంచలన నిజాలు వెలుగులోకి