Raju weds Rambai: ఈ మధ్య టాలీవుడ్‌లో చిన్న చిత్రాలు ఘన విజయాన్ని సాధిస్తూ.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పుడా లిస్ట్‌లోకి తాజాగా థియేటర్లలోకి వచ్చిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం కూడా చేరింది. కేవలం 3 రోజుల్లోనే ఈ సినిమా ప్రాఫిట్ జోన్‌లోకి ప్రవేశించిందని మేకర్స్ చెప్పడం చూస్తుంటే.. మున్ముందు ఈ సినిమా ఎలాంటి సంచలనాను క్రియేట్ చేయబోతుందో అర్థం చేసుకోవచ్చు. అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju weds Rambai). హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం డే 1 నుంచి మంచి ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. 3 రోజుల్లో ఈ సినిమాకు 7.28 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లుగా మేకర్స్ తెలుపుతూ.. అధికారికంగా పోస్టర్ కూడా విడుదల చేశారు. అంతేకాదు, ప్రాఫిట్ జోన్‌లోకి కూడా ఈ సినిమా ఎంటరైనట్లుగా ఈ పోస్టర్‌లో తెలిపారు. మొదటి రోజు కంటే రెండో రోజు, రెండో రోజును మించిన వసూళ్లు మూడో రోజు ఈ చిత్రానికి వచ్చినట్లుగా మేకర్స్ తెలపడంతో.. చిన్న సినిమాగా వచ్చి గ్రాండ్ సక్సెస్ అయిన చిత్రాలలోకి ‘రాజు వెడ్స్ రాంబాయి’ కూడా చేరింది.
Also Read- Dharmendra Deol: బాలీవుడ్ హీ-మ్యాన్ ధర్మేంద్ర గురించి ఈ విషయాలు తెలుసా? టాలీవుడ్ నివాళి..
‘లిటిల్ హార్ట్స్’ దారిలోనే..
ఈ సినిమా సక్సెస్‌ను పురస్కరించుకుని, సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన వంశీ నందిపాటి (Vamsi Nandipati), బన్నీ వాస్ (Bunny Vas) మీడియా సమావేశం నిర్వహించి మరీ.. తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బన్నీ వాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా మేము ఊహించినదాని కంటే పెద్ద విజయాన్ని సాధిస్తోంది. కొన్ని సినిమాలకు కలెక్షన్స్ ఇంత వచ్చాయి అని చెప్పలేం. కానీ ఈ సినిమాకు మాత్రం కలెక్షన్స్‌ను డిటైల్డ్‌గా చెప్పాలని అనిపించింది. ఇప్పటి వరకు (3 రోజులకు) మొత్తం 7.28 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. కేవలం నైజాం నుంచే రూ. 5 కోట్ల 2లక్షలు వసూలు అయ్యాయి. నిన్న (ఆదివారం) ఒక్కరోజు 2 కోట్ల 17 లక్షలు కలెక్షన్స్ వచ్చాయి. తెలంగాణ స్టేట్‌లోని మల్టీప్లెక్స్‌ల కంటే సింగిల్ స్క్రీన్స్ నుంచే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఏపీలో మొదటి రెండు రోజులు డల్‌గా ఉన్నా.. నిన్న కలెక్షన్స్ బాగున్నాయి. వైజాగ్ 10 లక్షలు, ఈస్ట్ నుంచి 9 లక్షలు వచ్చాయి. కృష్ణా 12 లక్షలు, గుంటూరు 13 లక్షలు కలెక్ట్ చేసింది. సీడెడ్ కలెక్షన్స్ డీసెంట్‌గా ఉన్నాయి. మేము విడుదల చేసిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమాకు కూడా ఇలాగే కలెక్షన్స్ వచ్చాయి. ఈ మధ్యకాలంలో ఏపీలో కంటే నైజాంలోనే సినిమాలకు ఎక్కువగా కలెక్షన్స్ వస్తున్నాయి. ఐబొమ్మ (IBomma) క్లోజ్ అవడం, 99 రూపాయలు టికెట్ రేట్ పెట్టడం వల్ల కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. కొందరు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మొదట్లో ఒప్పుకోలేదు కానీ.. ఇప్పుడు 70 పర్సెంట్ అంతా ఈ రేటుకు అంగీకారానికి వచ్చారని తెలిపారు.
Also Read- Bigg Boss Telugu 9: ఈ వారం రెండు దశల్లో నామినేషన్స్.. టాప్ 5లో ఉండాల్సిన భామే టార్గెట్!
సింగిల్ స్క్రీన్స్ క్లోజ్ చేసుకోవాల్సిందే
వంశీ నందిపాటి మాట్లాడుతూ.. ఈ సినిమా విజయంతో చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమా చూస్తూ అమ్మాయిలు ఎమోషన్‌కు గురవుతున్నారు. మేము పెట్టిన పెట్టుబడికి నాలుగు రెట్ల లాభాన్ని ఈ సినిమా ఇస్తుందని ఆశిస్తున్నాం. మా టీమ్ ఆల్రెడీ థియేటర్స్ విజిట్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో మొత్తం టీమ్ అంతా థియేటర్స్ విజిట్‌కు వెళ్తాం. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి స్క్రీన్స్ యాడ్ చేశాం. మల్టీప్లెక్స్‌తో పాటు బీ, సీ సెంటర్స్‌లో కూడా కలెక్షన్స్ బాగున్నాయి. 99 రూపాయల టికెట్ రేట్ పెట్టడం, ఐబొమ్మ క్లోజ్ కావడం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. ఐ బొమ్మలో పైరసీ మూవీస్ చూసేవాళ్లంతా ఎక్కువగా బీ, సీ సెంటర్స్ వాళ్లే. ఇప్పుడా సైట్ క్లోజ్ కావడం వల్ల వాళ్లు థియేటర్స్‌కు రావడం పెరిగింది. టికెట్ రేట్ రూ.99 గా ఫిక్స్ చేసుకోకుంటే సింగిల్ స్క్రీన్స్ క్లోజ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయని హెచ్చరించారు. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై సాయిలు కంపాటి దర్శకత్వంలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి ఈ సినిమాను నిర్మించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
