MLC Kavitha: వనపర్తి జిల్లాలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు..!
MLC Kavitha (imagecredit:swetcha)
Telangana News

MLC Kavitha: వనపర్తి జిల్లాలో జాగృతి జనం బాటలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు..!

MLC Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం నాడు జిల్లాలోని కొత్తకోట – కానాయిపల్లి శంకర సముద్రం రిజర్వాయర్‌ను సందర్శించారు. రిజర్వాయర్ నిర్వాసిత మహిళలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, కానాయపల్లి శంకర మహాసముద్రం రిజర్వాయర్‌ను 12 ఏళ్లైనా నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారని, ఇక్కడి నిర్వాసితులకు వాళ్ల ప్లాట్ల దగ్గరే ఇళ్లు కట్టించాలని ఆమె డిమాండ్ చేవారు. గతంలో 30, 40 మంది పేర్లు జాబితాలో మిస్సయ్యాయని, వాళ్ల పేర్లను యాడ్ చేయాలని అన్నారు. ప్రస్తుతం కొంతమంది ఊరిలో లేరని, వారికి కూడా న్యాయం చేయాలన్నారు. అప్పుడు 18 ఏళ్లు నిండని వాళ్లకు ప్రస్తుతం 18 ఏళ్లు వచ్చాయని, వాళ్లందరికీ కూడా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్, మిడ్ మానేరు, రంగనాయక సాగర్ నిర్వాసితులకు ఎలా న్యాయం చేశారో అలాగే వీరికి కూడా చేయాలని కవిత పేర్కొన్నారు. నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టి ఇవ్వాలన్నారు. ‘‘అడిగితే గానీ అమ్మ కూడా అన్నం పెట్టదు. మనం కూడా అడిగితేనే మనకు న్యాయం చేస్తారు. ఎందరో మగ నాయకులు వచ్చి మీకు న్యాయం చేస్తామని మోసం చేశారు. కానీ నేను మహిళా నాయకురాలిని, మీకు కచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నాను. నేను చేసే పోరాటంలో మీరంతా కలిసి రావాలి. ఇప్పుడు నేను అధికార పార్టీలో లేను. అయినా సరే కొట్లాడి మీకు న్యాయం చేస్తా’’ అని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు.

Also Read: Bomb Threat: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి.. మరోసారి బాంబు బెదిరింపు!

ప్రభుత్వ ఆస్పత్రి సందర్శన

వనపర్తి జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం, ప్రభుత్వ ఆస్పత్రిని కూడా కవిత సందర్శించారు. మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఇక్కడ చాలా చక్కగా నిర్మించారని, కానీ, సిబ్బంది కొరత ఉందన్నారు. సిబ్బందిని పెంచటంపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని సూచన చేశారు. ఈ హాస్పిటల్ టౌన్‌కు దూరంగా ఉందని, అందువల్ల టెస్ట్‌ల కోసం రోగులు ఇబ్బంది పడాల్సి వస్తుందని ప్రస్తావించారు. ‘‘ రేడియాలజీ డిపార్ట్‌మెంట్‌లో పర్మినెంట్ స్టాఫ్ లేరు. టెస్టులకు ప్రజలు ఇబ్బంది పడకూడదనుకుంటే రేడియాలజీ డిపార్ట్‌మెంట్‌పై ఫోకస్ పెట్టాలి. హాస్పిటల్‌లో గైనకాలజీ డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉంది. వాళ్లు చాలా కష్టపడుతున్నప్పటికీ అందరికీ సేవలు అందించలేని పరిస్థితి. గైనకాలజీ డాక్టర్ల సంఖ్య పెంచటంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అన్ని హాస్పిటల్స్ ఉన్నట్లుగానే ఇక్కడ సమస్యలు ఉన్నాయి. శానిటేషన్, కేర్ టేకర్స్, సెక్యూరిటీ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదు. మెయింటెన్స్‌కు డబ్బులు ఇవ్వటం లేదు. మందులు లేని పరిస్థితి ఉంది. ఈ సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నా. వనపర్తిలో రెండు రోజుల పాటు పర్యటిస్తాం. మండల స్థాయిలో ఉన్న సమస్యలను కూడా తెలుసుకుంటాం. ఆరోగ్య తెలంగాణ కావాలంటే హాస్పిటల్స్‌లో అన్ని సౌకర్యాలు ఉండాలి. అలాగైతేనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి’’ అని కవిత పేర్కొన్నారు.

Also Read: Warangal District: వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల అత్యుత్సాహం.. రేషన్ కార్డులపై ఫొటోలు కలకలం

Just In

01

Panchayat Elections: ఏకగ్రీవాల వైపు అడుగులేస్తున్న గ్రామాలు.. పార్టీలకు అతీతంగా పాలకవర్గం ఎంపిక!

Euphoria Teaser: గుణశేఖర్ ‘యుఫోరియా’ టీజర్ వచ్చేసింది చూశారా.. ఏం థ్రిల్ ఉంది మామా..

Shocking Crime: దేశంలో ఘోరం.. భార్యను కసితీరా చంపి.. డెడ్ బాడీతో సెల్ఫీ దిగాడు

Bigg Boss Telugu 9: ఇమ్మాన్యూయేల్ వ్యవహారంపై ఫైర్ అయిన రీతూ.. డీమాన్ పవన్ కాన్ఫిడెన్స్ ఏంటి భయ్యా..

Harish Rao: కాంగ్రెస్‌కు సంగారెడ్డి నేతలుగుడ్ బై.. కండువాలు కప్పి ఆహ్వానించిన హరీశ్!