Local Body Elections: స్థానిక ఎన్నికల్లో పట్టు కోసం ప్రభుత్వం ప్లాన్
Local Body Elections (imagecrdit:twitter)
Telangana News

Local Body Elections: స్థానిక ఎన్నికల్లో పట్టు కోసం ప్రభుత్వం ప్లాన్.. ఆ గుర్తుతో 90 శాతం గెలిచేందుకు సిద్దం..!

Local Body Elections: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత జోష్ పెంచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 90శాతం సీట్లు సాధించి మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నది. అందులో భాగంగా మొదట పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని పక్కా ప్లాన్ చేస్తున్నది. ఇప్పటికే సామాజిక, ఆర్థిక, రాజకీయంగా అలర్ట్ చేసింది. స్థానిక ఎన్నికల అనంతరం జరిగే ఎంపీటీసీ(MPTC), జెడ్పీటీసీ(ZPTC), మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నది. ఎవరెం చేసినా, ఎన్ని ప్లాన్స్ చేసినా.. స్థానిక ఎన్నికల్లో సైతం జూబ్లీహిల్స్ బై పోల్ వచ్చిన రికార్డులే వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్కెచ్ వేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు మెజార్టీ సీట్లు సాధించే లక్ష్యం పెట్టుకున్నది. 80 శాతం గ్రామాల్లో అధికార పార్టీ విజయ ఢంకా మోగించేందుకు సిద్ధమైంది. అందుకే తొలుత గ్రామ సర్పంచ్‌లు, వార్డులకు ఎన్నికలకు నిర్వహిస్తున్నట్లు సమాచారం. స్థానికంగా పట్టు సాధించిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది.

రెండేళ్లలో సాధించిన ప్రగతిని వివరించేందుకు ప్లాన్

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుండటంతో ఈ రెండేళ్లలో సాధించిన ప్రగతిని వివరించేందుకు సిద్ధమవుతుంది. అన్ని శాఖల నుంచి పూర్తి సమాచారాన్ని సైతం సేకరిస్తుంది. డిసెంబర్ 1 నుంచి 9వరకు ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించబోతున్నది. ఈ వారోత్సవాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరు గ్యారంటీలు.. ఇప్పటికే అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని భావిస్తున్నది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రజా ప్రతినిధులకు సూచనలు చేసినట్లు సమాచారం.

Also Read: Shiva Jyothi Controversy: తిరుమలలో చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు చెప్పిన యాంకర్ శివ జ్యోతి..

సంక్షేమ పథకాలను వివరించి..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు, మహిళలకోసం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించబోతున్నట్లు సమాచారం. రుణ మాఫీ, మహిళలకు రుణాలు, సబ్సిడీపై గ్యాస్, ఉచిత కరెంటు, ఉద్యోగాల కల్పన అంశాలను విస్తృతంగా ఇంటింటికి వివరించేందుకు సిద్ధమవుతుంది. అంతేగాకుండా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సైతం ప్రధాన అస్త్రంగా చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇప్పటికే మహిళా సంఘాల్లోని సభ్యులకు ఉచితంగా చీరల పంపిణీ చేపడుతుంది. ఈ కార్యక్రమంలో క్షేత్రస్థాయిలోని నేతలను భాగస్వాములను చేస్తూ ప్రచార స్పీడ్ పెంచింది. ఇంటింటికి వెళ్లి పంపిణీ చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు సైతం జారీచేసింది. దీనికి తోడు ప్రభుత్వ పథకాలతో పాటు చేస్తున్న సంక్షేమం, ఈ చీరల పంపిణీ కార్యక్రమానికి చెందిన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో సైతం వాట్సాప్ గ్రూపుల్లోనూ ప్రచారం చేయాలని సోషల్ మీడియాకు సూచనలు చేసినట్లు సమాచారం.

విమర్శలకు గట్టి కౌంటర్లు ఇవ్వాలని..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను మరోసారి ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు సూచించింది. అంతేగాకుండా ప్రభుత్వంపై విమర్శలకు గట్టి కౌంటర్లు ఇవ్వాలని ఇదే స్థానిక సంస్థల ఎన్నికల్లో అస్త్రంగా పనిచేస్తుందని పేర్కొన్నట్లు సమాచారం. ప్రజల్లో బీఆర్ఎస్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు మననం చేస్తుండాలని ఆదేశించినట్లు తెలిసింది. ఏది ఏమైనా కాంగ్రెస్ మెజార్టీ సర్పంచ్ స్థానాలను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఇప్పటి నుంచే పార్టీ అధిష్టానం సైతం ఆదేశాలు ఇస్తూ నేతలను అలర్ట్ చేస్తున్నట్లు సమాచారం.

Also Read: Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాధన్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ నుంచి సెకండ్ సింగిల్ ఎప్పుడంటే?..

Just In

01

Chamal Kiran Kumar Reddy: ట్రిపుల్ఆర్ మూసీ రీజువెనేషన్ కు కేంద్రం సహకరించాలి : ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!