VC Sajjanar: కంప్లైంట్ చేస్తే పట్టించుకోని వైనం..!
VC Sajjanar (imagecredit:twitter)
Telangana News

VC Sajjanar: మోసానికి గురైతే ఫిర్యాదు చేయమంటారు.. కంప్లైంట్ చేస్తే పట్టించుకోని వైనం!

VC Sajjanar: సైబర్ క్రిమినల్స్‌కు చెక్ పెట్టేందుకు విస్తృత చర్యలు తీసుకుంటున్నాం.. ఐ బొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసినప్పుడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైదరాబాద్​ కమిషనర్ వీసీ సజ్జనార్ చెప్పిన మాటలివి. అయితే, వరుసగా వెలుగు చూస్తున్న ఉదంతాలు సైబర్ మోసగాళ్లకు కళ్లెం వేయడంలో పోలీసుల నిస్సహాయతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒవైపు ఇంటింటికీ వెళ్లి సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నామని అధికారులు చెబుతుంటే.. మరోవైపు సైబర్ క్రిమినల్స్​ వరుసగా నేరాలకు పాల్పడుతున్నారు. హైకోర్టు అధికారిక వెబ్‌సైట్​ హ్యాకింగ్​, సీఎంవో, డిప్యూటీ సీఎంవో, మంత్రుల అధికారిక వాట్సాప్​ గ్రూపుల హ్యాకింగ్, కొత్త సినిమాలు రిలీజైన ఒక్క రోజులోనే పైరసీ చేయడం వంటి ఉదంతాలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇక, మోసానికి గురైతే ఫిర్యాదు చేయండి.. న్యాయం చేస్తామని అధికారులు అంటుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా కనిపిస్తున్నది. తన ఫోన్​ హ్యాక్ చేసి డబ్బులు కొట్టేస్తున్నారని ఓ మహిళా యాంకర్ ఫిర్యాదు చేయడానికి సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అయితే, ఆదివారం అధికారులు ఎవ్వరూ ఉండరంటూ వచ్చిన సమాధానం ఆమెను నివ్వెర పోయేలా చేసింది. వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ ఉదంతాలతో నెటిజన్లు సోషల్​ మీడియాలో ఇదేం పోలీసింగ్​? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

కమిషనర్ ఏం చెప్పాలనుకున్నారని ప్రశ్నలు..

ఐ బొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసిన సమయంలో సవాల్ విసిరిన అతన్ని కటకటాల వెనక్కి పంపించామని కమిషనర్​ సజ్జనార్ చెప్పిన విషయం తెలిసిందే. ఇదీ పోలీసుల సత్తా అని కూడా ఆయన అన్నారు. కాగా, టాలీవుడ్ హీరోలు, దర్శకుడు, నిర్మాతలను పక్కన కూర్చొబెట్టుకుని ఆయన మీడియా సమావేశంలో మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తాయి. రవి అరెస్టులో కీలక పాత్ర వహించిన అధికారులను వెనక కూర్చొబెట్టి కమిషనర్ ఏం చెప్పాలనుకున్నారంటూ పలువురు సోషల్ మీడియాలో నేరుగానే ప్రశ్నించారు. మీడియా సమావేశంలో కూర్చున్న టాలీవుడ్​ హీరోలు, దర్శకుడు, నిర్మాతల్లో ఎవ్వరూ రవి బాధితులు కాదు కదా అని వ్యాఖ్యలు చేశారు. నిజమైన బాధితులను కూర్చోబెట్టినా బాగుండేదని అభిప్రాయ పడ్డారు. ఇక, సైబర్ క్రిమినల్స్ కు అడ్డుకట్ట వేయటానికి విస్తృత స్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంట్లో భాగంగానే హైదరాబాద్ లో జాగృత్.. సురక్షిత్ హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు కూడా కమిషనర్ సజ్జనార్​ చెప్పారు.

దీంట్లో భాగంగా కరపత్రాలను ఇంటింటికి పంచుతున్నామన్నారు. ప్రతీ ఇంట్లో ఓ సైబర్ సింబా ఉండేట్టు చూస్తున్నామన్నారు. ఒకవైపు అధికారులు ఇలా చెబుతుంటే మరోవైపు సైబర్ మోసగాళ్లు సరికొత్త సవాళ్లను విసురుతున్నారు. దీనికి హైకోర్టు అధికారిక వెబ్ సైట్‌ను హ్యాక్ చేయటాన్ని పేర్కొనవచ్చు. ఆర్డర్ కాపీలు, కేసుల వివరాలు, తదుపరి విచారణ ఎప్పుడుంది అన్న వివరాలు తెలుసుకోవటానికి, అధికారిక పత్రాలను డౌన్ లోడ్ చేసుకోవడానికి న్యాయవాదులు, కక్షిదారులు హైకోర్టు వెబ్ సైట్ కు లాగిన్ అవుతుంటారు. అయితే, దీనిని హ్యాక్ చేసిన సైబర్ క్రిమినల్స్ లాగిన్ కాగానే బీడీజీ ఎస్ఎల్వోటీ అన్న ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్ ఓపెన్ అయ్యేలా చూశారు. దాంతో ఖంగు తినడం న్యాయవాదులు, కక్షిదారుల వంతయ్యింది. దీనిని మరిచిపోక ముందే సైబర్ క్రిమినల్స్ ఏకంగా సీఎంవో, డిప్యూటీ సీఎంవో, కొందరు మంత్రుల అధికారిక వాట్సాప్ గ్రూప్​ లను హ్యాక్ చేశారు. ఎస్బీఐ బ్యాంక్ ఆధార్​ అప్ డేట్​ పేర ఏపీకే ఫైళ్లను పంపించి డబ్బు కొల్లగొట్టేందుకు ప్రయత్నించారు.

Also Read: Jangaon News: బ్రిడ్జి పోరాటంలో జైలుకు వెళ్ళిన ఉమాప‌తికి స‌న్మానం..!

ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. విచిత్ర అనుభవం..

సైబర్ మోసానికి గురైతే వెంటనే హెల్ప్ లైన్​ నెంబర్​ 1930కి ఫోన్ చేయాలని సందర్భం వచ్చిన ప్రతీసారి పోలీసు అధికారులు చెబుతుంటారు. దాంతోపాటు www.cybercrime.gov.in అన్న పోర్టల్ కు సమాచారం ఇవ్వొచ్చని తెలియ చేస్తారు. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని అంటూ మొదటి గంటలోనే కంప్లయింట్ ఇస్తే మంచిదంటారు. అయితే, తన మొబైల్ ఫోన్​ హ్యాక్ కావటంతో ఫిర్యాదు చేయటానికి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్​ స్టేషన్ కు వెళ్లిన ఓ మహిళా యాంకర్ కు విచిత్ర అనుభవం ఎదురైంది. ఆమె వెళ్లినప్పుడు స్టేషన్‌లో ఉన్న కానిస్టేబుళ్లు ఈ రోజు ఆదివారం.. ఎవరూ ఉండరని జవాబు చెప్పారు. మరో రోజు ఫిర్యాదు ఇవ్వాలన్నారు. యాంకర్‌ పై అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా అసలు మీరు బాధితులే కాదు.. డబ్బు పోగొట్టుకున్న వారు కంప్లైంట్ ఇస్తే తీసుకుంటామంటూ దురుసుగా మాట్లాడారు. నా ఫోన్‌ను హ్యాక్ చేసి డబ్బు కొల్లగొట్టారని చెప్పినా పట్టించుకోలేదు. దీనిపై కూడా నెటిజన్లు మండి పడుతున్నారు. ఆదివారం సైబర్ క్రైం పోలీసులకు సెలవా? అని నెట్టింట్లో ప్రశ్నిస్తున్నారు.

ఆమెను బదిలీ చేయడం ఏంటి?

ఇక, నిన్నటి వరకు సైబర్ క్రైం డీసీపీగా ఉన్న దార కవిత బదిలీపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సైబర్ క్రైం డీసీపీగా ఉన్న దార కవిత ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టులో కీలకపాత్ర వహించిన విషయం తెలిసిందే. దీనికి ముందు కూడా ప్రత్యేక బృందాలతో అంతర్ రాష్ట్ర ఆపరేషన్లు జరిపి సైబర్ నేరాలతో సంబంధం ఉన్న పలువురిని కటకటాల వెనక్కి పంపించడంలో కూడా ఆమె ముఖ్య పాత్ర వహించారు. రవిని అరెస్ట్ చేసినప్పుడు డీసీపీ దార కవితను ప్రశంసించి రెండు రోజుల తరువాత ఆమెను బదిలీ చేయడం ఏంటని? నెటిజన్లు అడుగుతున్నారు. పోలీస్ బాస్‌లు క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన చర్యలు తీసుకున్నప్పుడే పోలీసింగ్ మెరుగవుతుందని అంటున్నారు.

Also Read: Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాధన్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ నుంచి సెకండ్ సింగిల్ ఎప్పుడంటే?..

Just In

01

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!

Jailer 2: ‘జైలర్ 2’లో గెస్ట్ రెల్ చేసేది బాలయ్య కాదట.. ఎవరంటే?