Justice Suryakant: సీజేఐగా నేడు జస్టిస్‌సూర్యకాంత్ ప్రమాణస్వీకారం
Justice Suryakant (imagecredit:twitter)
Telangana News

Justice Suryakant: సీజేఐగా నేడు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం

Justice Suryakant: రాజ్యాంగం, పౌర హక్కులకు సంబంధించిన పలు ముఖ్యమైన తీర్పులు ఇచ్చిన బెంచ్‌లలో సభ్యుడిగా ప్రసిద్ధి చెందిన జస్టిస్ సూర్యకాంత్(Justice Suryakant), సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. పదవీకాలం ముగిసిపోవడంతో, జస్టిస్ బీఆర్ గవాయ్(Justice BR Gavai) ఆదివారం సాయంత్రం బాధ్యతల నుంచి దిగిపోయారు. గవాయ్ స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరిస్తారు. తదుపరి సీజేఐగా అక్టోబర్ 30న ఆయన నియమితులయ్యారు. దాదాపు 15 నెలల పాటు సుదీర్ఘకాలంపాటు ఆయన పదవిలో కొనసాగుతారు. 65 సంవత్సరాలు నిండే వరకు అంటే, 2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగుతారు. జస్టిస్ సూర్యకాంత్ వ్యక్తిగత వివరాల విషయానికి వస్తే, 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిసార్ జిల్లాలో ఆయన పుట్టారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. తొలుత హిసార్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఈ తర్వాత పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో జడ్జిగా అనేక ప్రభావవంతమైన తీర్పులు ఇచ్చారు. 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్ నియమితులయ్యారు.

Also Read: Bigg Boss Telugu 9: ఇమ్మానుయేల్ చేతుల్లో పవరాస్త్ర.. ఈ వారం ఎలిమినేషన్ ఆపుతాడా?

చారిత్రాత్మక తీర్పుల్లో భాగస్వామి

అపారమైన అనుభవం ఉన్న జస్టిస్ సూర్యకాంత్ పలు చారిత్రాత్మక తీర్పులు ఇచ్చిన బెంచ్‌లలో సభ్యుడిగా ఉన్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తొలగించిన ఆర్టికల్ 370 రద్దు చేసిన ధర్మాసనంలో భాగంగా ఉన్నారు. బ్రిటిష్ పాలనాకాలం నాటి దేశద్రోహ చట్టాన్ని నిలిపివేసిన ధర్మాసనంలో కూడా భాగంగా ఉన్నారు. ప్రభుత్వం ఈ నిబంధనను పునఃపరిశీలించే వరకు, సెక్షన్ 124ఏ ఐపీసీ కింద కొత్త ఎఫ్ఐఆర్‌లను నమోదు చేయవద్దంటూ రాష్ట్రాలు, కేంద్రాన్ని ఆదేశించారు. పెగాసస్ స్పైవేర్ ఆరోపణలపై విచారణ జరిపిన ధర్మాసనంలో కూడా జస్టిస్ కాంత్ భాగంగా ఉన్నారు. జాతీయ భద్రత పేరుతో ప్రభుత్వానికి స్వేచ్ఛా ఇవ్వలేమన్నారు. బీహార్ ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన పిటిషన్లపై విచారణలో కూడా భాగస్వామిగా ఉన్న జస్టిస్ సూర్యకాంత్, బీహార్ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను వెల్లడించాలంటూ ఎన్నికల సంఘాన్ని జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు. అంతేకాదు, చట్టవిరుద్ధంగా పదవి నుంచి తొలగింపునకు గురైన ఓ మహిళా సర్పంచ్‌ను తిరిగి నియమించిన ధర్మాసనానికి ఆయనే నాయకత్వం వహించారు. ఈ కేసులో లింగ వివక్షను ఆయన ఎత్తిచూపారు. న్యాయవాద సంఘాలలో లింగ సమానత్వం కోసం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌తో సహా బార్ అసోసియేషన్లలోని సీట్లలో మూడింట ఒక వంతు మహిళలకు రిజర్వ్ చేయాలని ఆయన ఆ తర్వాత ఆదేశించారు. అంతేకాదు, మరికొన్ని చారిత్రాత్మక తీర్పులలో కూడా ఆయన భాగస్వామిగా ఉన్నారు.

Also Read: Gadwal Sand Supply: కలెక్టర్ చొరవతో సమస్యకు పరిష్కారం.. 43 రోజుల లబ్ధిదారుల నిరీక్షణకు తెర..!

Just In

01

Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఇక బుకింగ్..!

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం

Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి

Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం పేరు మార్పు పై ప్రియాంక గాంధీ ఫైర్!