Jangaon RTA Office: అన్నీ ఉన్నా చెయ్యి తడపాల్సిందే!
Jangaon RTA Office (imagecrdit:twitter)
Telangana News

Jangaon RTA Office: జనగాం రవాణా శాఖ కార్యాలయంలో జోరుగా దందా.. అన్నీ ఉన్నా చెయ్యి తడపాల్సిందే!

Jangaon RTA Office: ఆ రవాణాశాఖ కార్యాలయం అంటేనే ఈజిల్లా ప్రజలు జంకుతున్నారు. వాహనం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుందామని వెళ్తే ఇక అంతే సంగతులు. అన్ని డాక్యుమెంట్లు ఉన్నా.. అందుకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు చెల్లించినా సరే.. ఆ అధికారులకు మాత్రం మామూళ్లు ముట్టజెప్పాల్సిందే. లేకుంటే ఆ డాక్యుమెంట్ లేదు.. ఇది లేదు అంటూ కొర్రీలు పెడుతూ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని పలువురు వాహనదారులే పేర్కొంటున్నారు. ఏంచేయాలో తోచని స్థితిలో చేతులు తడిపి వాహనాల రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు.. ఇది ఏ జిల్లా ఏ కార్యాలయం అనుకుంటున్నారా.. జనగాం జిల్లా ఆర్టీఏ కార్యాలయం.

ఆడిందే ఆట పాడిందే పాట

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పారదర్శక సేవలు అందించేందుకు సంస్కరణలు తీసుకొస్తుంది. అక్రమాలకు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. అధికారులకు సైతం సమావేశాల్లో పనితీరుపై హెచ్చరికలు సైతం జారీ చేస్తుంది. కానీ జనగాం జిల్లాలో ఆర్టీఏ కార్యాలయానికి మినహాయింపు అని ప్రచారంజరుగుతుంది. ఇక్కడ పనిచేసే ఉద్యోగులు, అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైందని ఆరోపణలు వస్తున్నాయి. ఏ వాహనదారుడు అయినా వాహనం రిజిస్ట్రేషన్ కోసం వస్తే ఇక అతడి జేబులు గుల్లా చేస్తున్నారు. వాహనానికి సంబంధించిన డాక్యూమెంట్ల సరిగ్గా ఉన్నా.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్స్ గానీ, రిజిస్ట్రేషన్ ఫీజు సైతం చెల్లించినా సరే అదనంగా ఇవ్వాల్సిందే. లేకుంటే జీవోలు లేకున్నా జీవోలంటూ, సరిగ్గా వాహనానికి సంబంధించిన పేపర్లు లేవు అంటూ కొర్రీలు పెడుతుండటం గమనార్హం.

ఫిక్స్ చేసి మరీ వసూలు

ఆర్టీఏ కార్యాలయంలో పనిచేసే ఇద్దరు అధికారులు ఈ వసూల్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మధ్యవర్తులను పెట్టుకొని మరీ దందా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి పనికీ ఓ రేటు అంటూ నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. కొత్తవాహనం అయినా సరే..పాత వాహనం అయినా ఏదైనా రిజిస్ట్రేషన్, వాహనం సీజ్ చేస్తే రిలీజ్ ఆర్డర్లు, డ్రైవింగ్ లైసెన్స్, రెన్యూవల్, పర్మిట్లు, డిఎల్ ఇస్ట్రాక్ట్, ఎన్ఓసీ కోసం స్లాట్ బుక్ చేసుకొని అందుకు సంబంధించిన పేపర్లను తీసుకొచ్చినా సరై ససేమిరా అంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా ఓనర్ వాహనం అమ్ముకుంటే సీసీ, ఎన్ఓసీ కొర్రీలు.. కొనుగోలు చేసిన వ్యక్తి 3 నెలలు ఆలస్యంగా వాహన రిజిస్ట్రేషన్ చేసుకుంటే 2 నుంచి3వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఎవరైనా వాహనంను ఫైనాన్స్ లో తీసుకుంటేఅతడు చెల్లింపులో జాప్యం జరిగితే.. లేకుంటే 3 నెలలు చెల్లించకపోతే ఆ సంబంధిత కంపెనీ సీజ్డ్ అని ఆన్ లైన్ లో నమోదు చేసినట్లయితే రిజిస్ట్రేషన్ సమయంలో 5వేల వరకు ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అంతేగాకు ట్రాక్టర్ ట్రాలీ రిజిస్ట్రేషన్ ఆలస్యం అయినా 5వేలు, పేరు మార్చితే 5వేలు, వాహనం సీజ్ అయితే రిలీజ్ ఆర్డర్ కోసం ఆ వాహనం ధరను బట్టి రేటు ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఇతర రాష్ట్రాల వాహనంను జనగాంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆవాహనానికి లైఫ్ టాక్స్ చెల్లించినా సరే రూ.15వేలు వసూలు చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ట్రాక్టర్ ట్రాలీ రిజిస్ట్రేషన్ ఏడాదిగడిస్తే 10వేలు వసూలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. టీఆర్ కాపీ గానీ ఎఫ్ఐఆర్ గానీ, లేకుంటూ అఫిడవిట్ గానీ తెచ్చుకుంటే రిజిస్ట్రేషన్ చేయాలని నిబంధన ఉంది. కానీ అధికారులు మాత్రం కొర్రీల పెడుతుండటంతో వాహనదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయం అంటేనే జంకుతున్నారు.

Also Read: Global Peace: గ్లోబల్ పీస్ హానర్స్ 2025లో ఎమోషనల్ అయిన రణ్‌వీర్ సింగ్.. ఎందుకంటే?

వ్యవసాయ రైతులని వదలని వైనం

మరోవైపు రైతుకు 3 ఎకరాలు ఉంటే వ్యవసాయ ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ అనే నిబంధన ఎక్కడ లేదు. రవాణాశాఖ సైతం జీవో విడుదల చేయలేదు. ల్యాండ్ ఉన్నా లేకున్నా అగ్రికల్చర్ ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ చేయాలని 2014లో జీవో ఇచ్చింది. కానీ అదే జీవో అడ్డంపెట్టుకొని అధికారులకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. 220 డీడీ తీస్తే వ్యవసాయ ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ 4880 అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చూస్తే జనగాం చిన్న రావాణాశాఖ కార్యాలయం కానీ.. పెద్దగా వసూల్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సీజ్ చేశారా అంటూ సాకులు

ఎవరైనా వాహనదారుడు ఫైనాన్స్ లో వాహనం తీసుకొని.. నిర్ణీత గడువుకంటే ముందే చెల్లించినా.. ఓకేసారి ఎందుకు చెల్లించారని.. వాహనం ఏమైనా సీజ్ చేశారా? అంటూ సాకులు చూపడంతోపాటు స్టేట్ మెట్ల పేరుతో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్నారని, దీంతో ఏం చేయాలో తోచని స్థితిలో ఆవాహన దారుడు 5వేలు ముట్టచెబుతున్న పరిస్థితి నెలకొంది. ఇలా కార్యాలయానికి వచ్చే ప్రతి వాహనదారుడు అదనంగా అధికారులకు ముట్టజెప్పుతున్న పరిస్థితి నెలకొంది. ఓ వ్యక్తికి ఇలాంటి ఘటనే ఎదురైనట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ జనగాం రవాణాశాఖ కార్యాలయంపై దృష్టిసారిస్తారా? లేక అవినీతిని ప్రోత్సహిస్తారనేది వేచిచూడాలి.

Also Read: MLA Murali Naik: గ్రామాభివృద్ధే కాంగ్రెస్ సర్కార్ ధ్యేయం : ఎమ్మెల్యే భూక్యా మురళి నాయక్!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..