Raju Weds Rambai: అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju Weds Rambai) సినిమా థియేటర్లలో కలెక్షన్ల ఊచకోత మొదలు పెట్టింది. ఈ సినిమాను హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ జనాల్లోకి తీసుకెళుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టిన ఈ మూవీ.. రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 4.04 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లుగా తెలుపుతూ మేకర్స్ అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు. మరీ ముఖ్యంగా నైజాం ఏరియాలో బాక్సాఫీస్ వద్ద ‘రాజు వెడ్స్ రాంబాయి’ డామినేషన్ చూపిస్తోంది. నైజాంలో డే 1 కు రెట్టింపు వసూళ్లను డే2 రాబట్టినట్లుగా మేకర్స్ చెబుతున్నారు. తొలి రోజు కోటి రూపాయలకు పైగా గ్రాస్ కలెక్ట్ కాగా, రెండో రోజు 2 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఈ రెండు రోజుల్లో కేవలం నైజాంలోనే 3 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను దక్కించుకుందీ చిత్రం. కంటెంట్ ఉన్నటువంటి చిన్న చిత్రాలైనా విజయానికి తిరుగుండదని ‘రాజు వెడ్స్ రాంబాయి’ ప్రూవ్ చేస్తోంది.
Also Read- The Raja Saab: ‘పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచ్‌లర్ నేనేలే’.. ‘రెబల్ సాబ్’ సాంగ్ ఎలా ఉందంటే?
హుజూరాబాద్‌లో హంగామా
చిత్ర సక్సెస్‌ను పురస్కరించుకుని టీమ్ థియేటర్ల విజిట్ చేస్తోంది. నవతరం ప్రేమకథా చిత్రంగా వచ్చి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటున్న సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు ఆదివారం సాయంత్రం హుజూరాబాద్ పట్టణంలో సందడి చేశారు. పట్టణంలోని అన్నపూర్ణ థియేటర్‌లో సాయంత్రం ఏడు గంటలకు సినిమా ప్రదర్శన మధ్యలో, చిత్ర యూనిట్ సభ్యులు నేరుగా ప్రేక్షకులను కలుసుకునేందుకు థియేటర్‌కు చేరుకున్నారు. చిత్ర బృందానికి అభిమానులు, ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు సాయిలు కంపాటి, ప్రధాన నటులు అఖిల్ రాజ్, తేజస్విని తదితరులు పాల్గొన్నారు. తమ చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు హుజూరాబాద్ ప్రేక్షకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులతో ఫొటోలు దిగుతూ, తమ సినిమా అనుభవాలను పంచుకుంటూ చిత్ర యూనిట్ థియేటర్ ఆవరణలో ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించింది. ఈ పర్యటనతో స్థానిక సినీ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
Also Read- Akhanda 2: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన ‘అఖండ 2’ టీమ్.. ఫొటోలు వైరల్!
సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు
‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొచ్చారు. శివాజి రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం తదితరులు ఇతర పాత్రలలో నటించారు. ఈ సినిమా సక్సెస్‌పై టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ.. చిత్రయూనిట్‌కు అభినందనలు తెలుపుతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

