Weather Update: తెలుగు రాష్ట్రాలకు రెండు రోజులు వర్ష సూచన..!
Weather Update (imagecredit:twitter)
Telangana News, ఆంధ్రప్రదేశ్

Weather Update: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాలకు రానున్న రెండు రోజులు భారీ వర్ష సూచన..!

Weather Update: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా విచిత్ర వాతావరణం నెలకొంది. ఓ వైపు చలి.. మరోవైపు అక్కడక్కడ తేలిక పాటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. అయితే మక్కా జలసంది దానికి ఆనుకొని ఉన్నటువంటి దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఓ అల్పపీడనం ఎర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది క్రమ క్రమంగా రూపాన్నీ మారుస్తూ ముందుకు సాగుతుంది. ఇది రేపు సాయంకాలం వరకు పశ్చిమ-ఉత్తరదిశగా కదిలి ఆగ్నేయం గుండా కదిలి బంగాళకాతంలో వాయుగుడంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) అధికారులు తెలిపారు. రానున్న 48 గంటల్లో బంగాళకాతంలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో కీలక మార్పులు జరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తూ.. వాతావరణం ఒక్కసారిగా చల్లబడి చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Also Read: Ponnam Prabhakar: గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్

ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడనం..

అల్ఫపీడనవ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి కొన్ని జిల్లాలో అరకొరక జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతమున్న పరిస్ధితులకు బిన్నంగా వాతావరణం చల్లబడి అధికంగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు.

తెలంగాణలో మోస్తరు వర్షాలు

తెలంగాణలో బిన్న వాతావరణం నెలకొంది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో దక్షిణ జిల్లాలో నల్గోండ, యాదాద్రి, సూర్యపేట, ఖమ్మం, రంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, హైదరాబాద్, గద్వాల జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో ఓక్కసారిగా వాతావరణం చల్లబడి రానున్న రోజుల్లో చలితీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: Gajwel: ప్రభుత్వ శాఖల్లో పైసా ఇవ్వందే పని జరగదు.. అన్ని శాఖల్లోనూ లంచం కంపు!

Just In

01

Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి

Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం పేరు మార్పు పై ప్రియాంక గాంధీ ఫైర్!

Premante OTT Release: ప్రియదర్శి ‘ప్రేమంటే’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

VH Hanumantha Rao: బీసీ రిజర్వేషన్లపై.. బీజేపీ ఓబీసీ ఎంపీలు మౌనమేల: వీహెచ్ ఫైర్

Lipstick: మీ స్కిన్ టోన్‌కి అద్భుతంగా కనిపించే లిప్ స్టిక్ షేడ్స్.. డే-టు-డే నుండి పార్టీ లుక్ వరకు