Movie Piracy: Movierulz అనేది పైరసీ వెబ్‌సైట్. ముఖ్యంగా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. కొత్త సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే లీక్ చేయడం దీని ప్రధాన లక్షణం.
1. 24 గంటలకే కొత్త సినిమాలు ఎందుకు కనిపిస్తాయి?
Movierulz లాంటి సైట్లకు కొన్ని “సోర్స్‌లు” ఉంటాయని చెబుతున్నారు. ఇవి మూడు రకాలుగా ఉంటాయి. థియేటర్ ప్రింట్ (CAM Print), రిలీజ్ అయిన వెంటనే కొంతమంది థియేటర్ లోపల మొబైల్‌తో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తారు. ఇది పెద్దగా ఖర్చు లేకుండా లభించడంతో ఈ ప్రింట్లు అత్యధికంగా కనిపిస్తాయి.
ఇన్‌సైడర్ లీక్స్
కొన్ని సినిమాలు రిలీజ్‌కు కొద్ది గంటలు/రోజులు ముందే డిజిటల్ కాపీలు పోస్ట్-ప్రొడక్షన్ స్టూడియోలు, సెన్సార్ కాపీలు, లేదా OTT పంపిణీదారుల నుంచి లీక్ అవుతాయి.
ప్రత్యేక పైరసీ గ్రూపులు
ఇతర దేశాల్లో ఉండే టెలిగ్రామ్ గ్రూపులు, టోరెంట్ టీమ్స్ కలిసి ఆడియో-వీడియో సింక్ చేసి “HD” వెర్షన్ తయారు చేస్తాయి.
2. పోలీసులు, సైబర్ క్రైం టీమ్స్ ఎన్ని కష్టాలు పడుతున్నా ఎందుకు పూర్తిగా ఆపలేకపోతున్నారు?
సైట్ తరచూ అడ్రెస్ మార్చడం వలన పోలీసులకు కూడా కష్టమవుతుంది. Movierulz.xyz, Movierulz.vip, Movierulz.pl
Movierulz.ms లాంటివి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. సైట్ బ్లాక్ చేసిన ప్రతిసారీ కొత్త డొమైన్ తెరవడం వీరి స్ట్రాటజీ.
VPN & ప్రాక్సీ సర్వర్లు
వారి సర్వర్లు భారత్‌కి బయట ఉంటాయి. ఇవి టోరెంట్-బేస్డ్ నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తాయి, అందువల్ల ట్రేస్ చేయడం కష్టం.
ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత అదే సినిమా వందల సైట్లు, టెలిగ్రామ్ ఛానెల్స్, టోరెంట్లలో కాపీ అవుతుంది. అన్నీ ఒకేసారి కట్టడి చేయడం చాలా కష్టం.
Also Read: Labour Policy: దేశంలో పని దొరికే అవకాశాలు పెరిగాయా.. 29 చట్టాల విలీనం తర్వాత వచ్చిన భారీ మార్పులు?
3. సినిమా ఇండస్ట్రీకి భారీ నష్టం
Movierulz వంటి సైట్ల వల్ల.. నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టం కలుగుతుంది. చిన్న సినిమాలకి పూర్తిగా థియేటర్ బిజినెస్ కట్ అవుతుంది. ఇండస్ట్రీలోని వేలాది మంది టెక్నీషియన్లు. లైట్ బాయ్స్ నుంచి ఎడిటర్ల వరకు వారి జీవనాధారం ప్రభావితం అవుతుంది.
OTT, థియేటర్ రాబడి తగ్గుతుంది. పైరసీ ఒక చిన్న విషయం కాదు. ఇది దేశవ్యాప్త పెద్ద సమస్యగా మారింది.
4. చట్టపరమైన చర్యలు
సినిమాను పైరేట్ చేయడం లేదా డౌన్‌లోడ్ చేయడం కూడా.. కాపీరైట్ యాక్ట్ 1957 ప్రకారం నేరం 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. రూ.3 లక్షల వరకు జరిమానా కూడా పడుతుంది. ఒక్కొక్కరిపై కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ, ఇది పూర్తిగా నిర్మూలించటం చాలా కష్టం అవుతోంది.
Also Read: VC Sajjanar: సినీ ప్రముఖులతో కలిసి ప్రెస్‌మీట్ ఏంటి? సామాన్యులతో ఇలా ఎప్పుడైనా మీడియాతో మాట్లాడారా?
5. ఎందుకు “పోలీసులకు సవాల్” చేస్తున్నట్టుగా కనిపిస్తుంది?
Movierulz లాంటి సైట్లు.. చట్టం ఒక డొమైన్‌ను బ్లాక్ చేస్తే వెంటనే ఇంకొక కొత్త డొమైన్ తెరుస్తాయి. VPN, వేరే దేశాల్లో సర్వర్లు, అప్లోడర్లు ఇవి కలిసి పోలీసుల కంటే ఒక అడుగు ముందే ఉంటాయి. సోషల్ మీడియా, టెలిగ్రామ్ ద్వారా పెద్ద నెట్‌వర్క్‌లా పనిచేస్తాయి. వాటిని సపోర్ట్ చేసే అంతర్జాతీయ పైరసీ టీమ్స్ ఉన్నాయి. అందుకే ఇవి “పోలీసులకు సవాల్” చేస్తున్నాయి.
