BRS Harish Rao Meet MLC Kavitha
Politics

Harish Rao : కవితతో ములాఖత్

– తీహార్ జైలుకు హరీష్ రావు
– కవితతో ప్రత్యేక భేటీ
– యోగక్షేమాలపై ఆరా
– ధైర్యంగా ఉండాలని సూచన

Harish Rao Meets MLC Kavitha : లిక్కర్ స్కాం కేసులో ఇరుక్కుని తీహార్ జైలులో ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు కుటుంబసభ్యులు, బీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్లి ఆమెను కలుస్తున్నారు.

ఈమధ్యే కేటీఆర్, మహిళా నేతలు కలిశారు. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం తీహార్ జైలుకు వెళ్లిన ఆయన, కవితతో ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని కవితకు సూచించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత పాత్ర చాల కీలకమని, మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేసింది. తర్వాత ఆమెను కోర్టులో హాజరపరచగా, కస్టడీ విధించింది న్యాయస్థానం. తర్వాత ఇదే వ్యవహారంలో సీబీఐ ఎంట్రీ ఇచ్చి ఏప్రిల్ 11న అరెస్ట్ చేసింది. ఈ కేసులో జ్యుడీషయల్ కస్టడీ కొనసాగుతోంది. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా సహా పలువురు అరెస్ట్ అయ్యారు. దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొంటున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!