Ponnam Prabhakar: గౌరవెల్లి కి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. జలసౌధ లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో గౌరవెల్లి ప్రాజెక్ట్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. పునరావాసం సమస్యలపై ఉత్తమ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగపడే గౌరవెల్లి ప్రాజెక్ట్ కి సంబంధించి లీగల్ సమస్యను ఇటీవల సుప్రీం కోర్టు పరిష్కరించిందన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ లో నీళ్ళు నింపడానికి, కాలువలు తవ్వడానికి భూసేకరణకు సంబంధించి అవసరమైన నిధులు ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ అంగీకరించారన్నారు.
Also Read: Ponnam Prabhakar: పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: మంత్రి పొన్నం ప్రభాకర్
గౌరవెల్లి నుంచి గోదావరి నీళ్లు వచ్చే అవకాశం
పనులు వేగవంతం చేయడం తో పాటు లీగల్ సమస్యలు పరిష్కారం అయినప్పటికీ 55 ఎకరాల పునరావాసం కి సంబంధించిన సమస్య ఉందని, వారిని తీసుకొచ్చి ఇరిగేషన్ మంత్రి కి కల్పించామన్నారు. వారి సమస్య పరిష్కారానికి ఉత్తమ్ హామీ ఇచ్చారన్నారు. వీలైనంత త్వరగా ఈ పనులన్నీ పూర్తి చేస్తూ కాలువలకు సంబంధించి భూసేకరణ లో రైతుల మద్దతుకోరారు. కాలువలు తీసినట్లయితే గ్రామ గ్రామాన గౌరవెల్లి నుంచి గోదావరి నీళ్లు వచ్చే అవకాశం ఉందన్నారు.
లక్ష ఎకరాలకు పైన ఆయకట్టు
స్థానికంగా ప్రజలు సహకరించాలని కోరారు. ప్రభుత్వం పరంగా అన్ని అంశాలు వెంటవెంటనే పరిష్కారం చేసుకునే దిశలో నా కార్యాచరణ కొనసాగుతుందన్నారు. లక్ష ఎకరాలకు పైన ఆయకట్టు ఉన్న ఎత్తైన పీఠభూమి లో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత నాదన్నారు. వైఎస్ ఆర్ శంకుస్థాపన చేసినప్పటికీ 10ఏళ్లుగా కేసీఆర్ కుర్చీ వేసుకొని నిర్మిస్తామని చెప్పిన ప్రాజెక్ట్ కూడా ఇదేనన్నారు. పూర్తికాకున్న ఎవరిని నిందించకుండా ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాంత రైతాంగానికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు.
Also Read: Ponnam Prabhakar: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కొత్తగా 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు, తీరనున్న కష్టాలు
